shape

technology ChotaNews

షావోమి నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్!

షావోమి నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్!

షావోమి Xiaomi Civi 2 పేరుతో ఒక సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ హ్యాండ్‌సెట్ పూర్తిగా సరికొత్త డిజైన్‌తో వచ్చింది. ఇందులో భాగంగా ట్రిపుల్ రియర్ కెమెరాలు, డ్యూయల్ ఫ్రంట్ కెమెరాలు, 67W ఫాస్ట్ ఛార్జింగ్‌ వంటివి ప్రధాన అంశాలుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ చైనా మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ ప్రారంభ ధ‌ర రూ.27,800గా ఉంది.

Lenovo నుంచి 3rd Gen Tab విడుదల!

Lenovo నుంచి 3rd Gen Tab విడుదల!

Lenovo భార‌త్ మార్కెట్‌లో థ‌ర్డ్ జ‌న‌రేష‌న్‌ Lenovo Tab M10 Plusని విడుదల చేసింది. కొత్త Lenovo M10 Plus 2022 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌తో ఆధారితమైంది. ఇది Google Kids Spaceకు మద్దతునిచ్చే ట్యాబ్​లలో భారతదేశంలో మొదటిది. Lenovo Tab M10 Plus (3rd Gen) WiFi మాత్రమే మోడల్ ధర రూ. 19,999. LTE వేరియంట్ ధర రూ.21,999.

వాట్సాప్ యూజ‌ర్ల‌కు అప్‌డేట్‌

వాట్సాప్ యూజ‌ర్ల‌కు అప్‌డేట్‌

వాట్సాప్ యూజ‌ర్ల‌కు మెటా యాజ‌మాన్యం కీల‌క సూచ‌న చేసింది. వాట్సాప్ వాడుతున్న యూజ‌ర్లు ప్లేస్టోర్ నుండి కొత్త అప్‌డేట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల‌ని సూచించింది. ప్ర‌స్తుత వెర్ష‌న్‌లో ఓ బ‌గ్ లోపాన్ని గుర్తించ‌డంతో కొత్త అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. దీంతో ఆండ్రాయిడ్‌, iOS యూజ‌ర్లు అప్‌డేట్ చేసుకోవాల‌ని తెలిపింది.

దసరా కానుకగా మోటో జీ72 రిలీజ్

దసరా కానుకగా మోటో జీ72 రిలీజ్

మోటోరోలా దసరా కానుకగా మోటో జీ72 స్మార్ట్‌ఫోన్‌ను అక్టోబర్ 3న లాంఛ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. మీడియా టెక్ హెలియో జీ99 ఎస్ఓసీ చిప్‌సెట్‌ను కలిగిన ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్‌తో పని చేస్తుంది. 108 ఎంపీ బ్యాక్, 16 ఎంపీ సెల్ఫీ కెమెరాలను దీనిలో అమర్చారు. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీతో వస్తున్న ఈ ఫోన్ ధర రూ.19,999గా ఉంది.

గూగుల్ పబ్లిక్ పాలసీ హెడ్ రాజీనామా!

గూగుల్ పబ్లిక్ పాలసీ హెడ్ రాజీనామా!

టెక్ దిగ్గజం గూగుల్ ఇండియా పబ్లిక్ పాలసీ హెడ్‌ అర్చన గులాబీ కీలక నిర్ణయం తీసుకున్నారు. అయిదు నెలల క్రితమే పబ్లిక్ పాలసీ హెడ్‌గా బాధ్యతలు స్వీకరించిన అర్చన తాజాగా రాజీనామా చేశారు. అయితే తన రాజీనామాకు గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. తన రాజీనామాకు గల కారణాలపై మాట్లాడేందుకు అర్చన నిరాకరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఒక్క రోజులో HYD చూసేద్దాం: TSRTC

ఒక్క రోజులో HYD చూసేద్దాం: TSRTC

హైదరాబాద్‌లోని టూరిస్టు ప్రాంతాలను ఒక్కరోజులోనే చూసేందుకు వీలుగా టీఎస్ఆర్టీసీ వీకెండ్ టూర్‌ ప్యాకేజీని ప్రకటించింది. టీఎస్ఆర్టీసీ వెబ్‌సైట్‌లో ఈ ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు. నాన్‌ ఏసీ బస్ అయితే పెద్దలకు రూ.250, పిల్లలకు రూ.130గా.. ఏసీ బస్ అయితే పెద్దలకు రూ.450, పిల్లలకు రూ.340గా నిర్ణయించింది. ఉదయం 8.30 గంటలకు సికింద్రాబాద్‌లో ఈ టూర్ ప్రారంభమై రాత్రి 8 గంటలకు అక్కడే ముగుస్తుంది.

వివో ఫోల్డబుల్ ఫోన్ రిలీజ్

వివో ఫోల్డబుల్ ఫోన్ రిలీజ్

వివో ఎక్స్ ఫోల్డ్ ప్లస్ మోడల్‌ను చైనాలో లాంఛ్ చేసింది. స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జనరేషన్ 1 చిప్‌సెట్‌తో దీనిని తీసుకొచ్చారు. 8.3 ఇంచెస్‌ ఆమ్లోడ్ డిస్‌ప్లేతో వచ్చిన ఈ ఫోన్‌ క్లోజ్ చేసినప్పుడు 6.53 ఇంచెస్ డిస్‌ప్లే కనిపిస్తుంది. 4,730 ఎంఏహెచ్ బ్యాటరీని దీనిలో అమర్చారు. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.1,15,000గా ఉంది.

జియో 5జీ స్మార్ట్‌ఫోన్‌ ధర ఎంత?

జియో 5జీ స్మార్ట్‌ఫోన్‌ ధర ఎంత?

కోట్లాది మంది 2జీ, 3జీ వినియోగదారులను 4జీలోకి తీసుకురావడమే లక్ష్యంగా రిలయన్స్‌.. జియోఫోన్‌ నెక్ట్స్‌ స్మార్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. అందరికీ అందుబాటులో ఉండేలా దాని ధరను రూ.4,499గా నిర్ణయించింది. జియో నుంచి 5జీ ఫోన్‌ రానున్న నేపథ్యంలో దాని ధరపై ఆసక్తి నెలకొంది. గూగుల్‌తో కలిసి తయారు చేస్తున్న జియోఫోన్‌ నెక్ట్స్‌ 5జీ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.8,000-12,000 మధ్య ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్

వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్

వాట్సాప్ ఈ వారంలో సరికొత్త ఫీచర్‌ను యూజ‌ర్ల‌కు అందుబాటులోకి తీసుకురానుంది. 32మందితో గ్రూప్ వీడియో కాలింగ్‌ను ప్ర‌యోగాత్మ‌కంగా ప‌రిశీలించింది. 32మంది గ్రూప్ కాలింగ్‌లో కాల్‌లింక్స్‌ను ఈ వారంలో ప్రారంభించ‌నున్న‌ట్లు మెటా సీఈవో మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్ తెలిపారు. యూజ‌ర్లు త‌మ కుటుంబ‌స‌భ్యులు, స్నేహితుల‌తో వీడియో కాల్ కోసం కాల్‌లింక్ క్రియేట్ చేసుకోగ‌లిగే అవ‌కాశం ఉంటుంది. దీని కోసం యాప్ లేటెస్ట్ వెర్ష‌న్ అప్డేట్ చేసుకోవాలి.

ఫోన్ల అమ్మ‌కాల‌లో శాంసంగ్ రికార్డు!

ఫోన్ల అమ్మ‌కాల‌లో శాంసంగ్ రికార్డు!

ఫోన్ల అమ్మ‌కాల‌లో శాంసంగ్ రికార్డు సృష్టించింది. ప‌లు ఈ-కామ‌ర్స్ వెబ్‌సైట్ల ప్రత్యేక సేల్‌లో ఆదివారం ఒక్క‌రోజే సుమారు 12 ల‌క్ష‌ల శాంసంగ్ గెలాక్సీ ఫోన్లు అమ్ముడ‌య్యాయి. వీటి విలువ సుమారు రూ.వెయ్యి కోట్ల‌కు పైగా ఉంటుంద‌ని శాంసంగ్ సంస్థ తెలిపింది. అమెజాన్ గ్రేట్ ఇండియా సేల్‌లో శాంసంగ్ బ్రాండ్ తొలి స్థానంలో నిల‌వ‌గా.. ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ మార్కెట్ ప‌రిధి రెండింత‌లు పెరిగింది.

‘డార్ట్’ సక్సెస్‌ను కొత్తగా సెలబ్రేట్ చేసిన గూగుల్!

‘డార్ట్’ సక్సెస్‌ను కొత్తగా సెలబ్రేట్ చేసిన గూగుల్!

భూమిని ఢీకొట్టే ప్రమాదం ఉన్న గ్రహ శకలాలను ఢీ కొట్టి దారి మళ్లించేందుకు నాసా ప్రయోగించిన ‘డార్ట్’ వ్యోమనౌక ప్రయోగం సక్సెస్ పై యానిమేషన్ వచ్చేసింది. టెక్ దిగ్గజం గూగుల్ ఈ విజయాన్ని సెలబ్రేట్ చేస్తూ డార్ట్‌ను పోలి ఉన్న వ్యోమనౌక యానిమేషన్‌ను క్రియేట్ చేసింది. ‘DART Mission’ అని గూగుల్ సెర్చ్ చేయగానే గ్రహశకలాన్ని ఢీకొట్టిన అనుభూతి వచ్చేలా యానిమేషన్ రూపొందించింది.

నాసా స్పేస్ క్రాఫ్ట్ ప్రయోగం సక్సెస్

నాసా స్పేస్ క్రాఫ్ట్ ప్రయోగం సక్సెస్

భూమిపైకి దూసుకొచ్చే ఆస్టరాయిడ్స్‌ను దారిమళ్లించే లక్ష్యంతో నాసా తలపెట్టిన ‘డార్ట్‌ మిషన్‌’ సక్సెస్ అయ్యింది. మంగళవారం వేకువజామున 4.44 గంటలకు ‘డైమార్ఫస్‌’ అనే ఆస్టరాయిడ్‌ను డార్ట్‌ వ్యోమనౌక గంటకు 21,600 కిలోమీటర్ల వేగంతో ఢీకొట్టింది. భూమి నుంచి 11 మిలియన్ కి.మీ. దూరంలో, ఫుట్ బాల్ స్టేడియం అంత పరిమాణంలో ఆస్టరాయిడ్‌ను తాకింది. అది కక్ష్య మారేందుకు రెండు నెలల సమయం పడుతుందని నాసా తెలిపింది.

అక్టోబ‌ర్ 1 నుంచి కొత్త రూల్స్‌!

అక్టోబ‌ర్ 1 నుంచి కొత్త రూల్స్‌!

డెబిట్‌/క్రెడిట్‌ కార్డుతో చేసే చెల్లింపుల కోసం రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కొత్త నియమాలను తీసుకొచ్చింది. ఈ రూల్స్‌ అక్టోబర్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆన్‌లైన్‌, పాయింట్‌ ఆఫ్‌ సేల్‌, యాప్‌ లావాదేవీల్లో టోకనైజేషన్‌ విధానాన్ని అమలు చేయాలని ఆర్‌బీఐ సూచించింది. అక్టోబర్‌ 1 నుంచి కొత్త నియమాలు అమల్లోకి రానున్నాయి.

ఇన్‌స్టాలో మరో సరికొత్త ఫీచర్

ఇన్‌స్టాలో మరో సరికొత్త ఫీచర్

ఇన్‌స్టాగ్రామ్ యూజర్ల సౌకర్యార్ధం సరికొత్త ఫీచర్‌ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఇన్‌స్టా స్టోరీలో కేవలం 15 సెకన్ల వీడియోను మాత్రమే పెట్టుకోవడానికి అవకాశం ఉంది. దానిని 60 సెకన్లకు పొడిగిస్తున్నట్లు ఇన్‌స్టా తెలిపింది. ప్రస్తుతం టెస్టింగ్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలో తీసుకురానున్నట్లు వెల్లడించింది.

రూ.11 వేలకే మోటోరోలా స్మార్ట్ టీవీలు!

రూ.11 వేలకే మోటోరోలా స్మార్ట్ టీవీలు!

Lenovo యాజమాన్యంలోని కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ మోటోరోలా భారత మార్కెట్‌లో తమ స్మార్ట్ టీవీ సిరీస్‌ను లాంచ్ చేసింది. Motorola Revou2 పేరుతో విడుదలైన స్మార్ట్ టీవీ లైనప్‌లో వివిధ స్క్రీన్ పరిమాణాలు, రిజల్యూషన్‌లలో మొత్తం నాలుగు మోడల్‌లు ఉన్నాయి. ధరలు కేవలం రూ. 11వేల నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ టెలివిజన్లు ఫ్లిప్‌కార్ట్ నుండి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి.