సూర్యనారాయణ ముందస్తు బెయిల్ విచారణ వాయిదా
AP: ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విజయవాడ 7వ ఏడీజే కోర్టు విచారించింది. ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 13వ తేదీకి వాయిదా వేసింది. కాగా ప్రభుత్వ ఆదాయానికి నష్టం చేకూర్చారనే ఆరోపణలతో ఐదుగురు ఉద్యోగులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో ఏ5గా సూర్యనారాయణ పేరును చేర్చారు.