shape

Sports ChotaNews

Blog Image

ఒక్క ఇన్‌స్టా పోస్ట్‌కు రూ. 9 కోట్లు!

సోషల్ మీడియాలో టీమిండియా క్రికెటర్ కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కోహ్లీకి ఇన్‌స్టాగ్రామ్‌లో 215 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌‌లో కోహ్లీ ఏదైనా వ్యాపార ప్రచారం కోసం చేసే ఒక్కో పోస్టుకు రూ. 8.9 కోట్లు తీసుకుంటాడని Hopperhq.com సైట్ వెల్లడించింది. ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో ఒక్కో పోస్టుకు రూ. 19 కోట్లు తీసుకుంటున్నట్లు పేర్కొంది.

Blog Image

ఘనంగా 36వ జాతీయ క్రీడలు ప్రారంభం

36వ జాతీయ క్రీడా ప్రారంభోత్సవ వేడుకలు గురువారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రధాని మోదీ టార్చ్‌ను వెలిగించి క్రీడలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, పీవీ సింధు, నీరజ్‌ చోప్రా పాల్గొన్నారు. అక్టోబర్‌ 10 వరకు జరిగే ఈ క్రీడల్లో మొత్తం ఏడువేల మంది క్రీడాకారులు పోటీపడనున్నారు. మొత్తం 36 ఈవెంట్స్‌లో పతకాల కోసం పోటీలుంటాయి.

Blog Image

టీమిండియాకు ఏంటీ గాయాలు?

ఆటగాళ్ల గాయాలు టీమిండియాను ఇబ్బంది పెడుతున్నాయి. గత ప్రపంచకప్‌లో గ్రూప్‌ స్టేజ్‌కే పరిమితమైన భారత్‌.. ఈసారి ఎలాగైనా కప్‌ కొట్టాలనే కసితో ఉన్న సమయంలో గాయాలతో జడేజా, బుమ్రా జట్టుకు దూరం కావడం అభిమానులను కలవరపరుస్తోంది. ప్రపంచకప్‌ నాటికి ఇంకెంతమంది ఆటగాళ్లు గాయపడతారోనని ఆందోళనతో ఉన్నారు. ఏది ఏమైనాప్పటికీ ఆసియా కప్ మాదిరి కాకుండా విశ్వవిజేతగా భారత్ నిలవాలని కోరుకుంటున్నారు.

Blog Image

బుమ్రా ప్లేస్‌లో సిరాజ్‌ను ఎంపిక చేస్తారా?

టీమిండియా స్టార్ బౌలర్ బుమ్రా గాయంతో టీ20 వరల్డ్‌కప్ 2022 టోర్నీకి దూరమయ్యాడు. దీంతో ఓ సీనియర్ బౌలర్ అవసరం భారత జట్టుకి ఉంది. ఆస్ట్రేలియా పిచ్‌లపై స్పిన్నర్లు తక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో రెండేళ్ల క్రితం ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించిన మహ్మద్ సిరాజ్‌ను జట్టులోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

Blog Image

అనుష్కతో వీడియో కాల్‌.. డిస్టర్బ్ చేయొద్దు: కోహ్లీ

సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం టీమిండియా ఎయిర్‌పోర్టుకు వెళ్తుండగా కోహ్లీ ఫ్యాన్స్ బస్సు వద్దకు వచ్చి నినాదాలు చేశారు. అప్పుడు కోహ్లీ అనుష్కతో వీడియో కాల్ మాట్లాడుతున్నారు. ఫ్యాన్స్‌కు ఫోన్ చూపిస్తూ ‘‘అనుష్కతో వీడియో కాల్‌లో ఉన్నా.. డిస్టర్బ్ చేయకండి’’ అంటూ కోహ్లీ నవ్వాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి.

Blog Image

అభిమానికి రూ. 500 పంపిన క్రికెటర్

సోష‌ల్ మీడియాలో టీమిండియా మాజీ క్రికెట‌ర్ అమిత్ మిశ్రా యాక్టివ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌కు రిప్లై ఇస్తుంటాడు. తాజాగా.. సురేష్ రైనా ప‌ట్టిన క్యాచ్‌ను అభినందిస్తూ ట్వీట్ చేయ‌గా.. ‘‘సార్ రూ. 300 పంపించండి. ల‌వ‌ర్‌తో బ‌య‌ట‌కు వెళ్లాలి’’ అని ఓ నెటిజ‌న్ రిప్లై ఇచ్చాడు. మిశ్రా రూ. 500 పంపించి ‘గ‌ర్ల్‌ఫ్రెండ్‌తో డేట్‌కు వెళ్లు.. ఆల్ ది బెస్ట్’ అని ట్వీట్ చేశాడు.

Blog Image

ఫైనల్లో అడుగుపెట్టిన ఇండియా లెజెండ్స్‌

రోడ్‌సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌లో ఇండియా లెజెండ్స్‌ ఫైనల్లో అడుగుపెట్టింది. ఆస్ట్రేలియా లెజెండ్స్‌తో జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో ఇండియా లెజెండ్స్‌ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియాను నమన్‌ ఓజా (90 నాటౌట్‌), ఇర్ఫాన్‌ పఠాన్‌ (37నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి గెలిపించారు.

Blog Image

డ‌కౌట్ల‌లో రోహిత్‌దే మొద‌టి స్థానం

సౌతాఫ్రికాతో జ‌రిగిన తొలి టీ20లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ డ‌కౌట్ కావ‌డం అభిమానుల‌ను నిరాశ‌ప‌రిచింది. అయితే టీ20ల్లో అత్య‌ధికంగా డ‌కౌటైన ప్లేయ‌ర్స్‌లో రోహిత్ శర్మే ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. ఇప్ప‌టివ‌ర‌కు 9 సార్లు డ‌కౌట్ అయ్యాడు. రోహిత్ త‌ర్వాత రాహుల్ (5), కోహ్లీ (4) ఉన్నారు.

Blog Image

సంజూ శాంస‌న్‌పై గంగూలీ కామెంట్స్‌

కొన్నాళ్లుగా సంజూ శాంస‌న్ అద్భుత‌మైన ఆట‌తీరుతో ఆక‌ట్టుకుంటున్నాడ‌ని బీసీసీఐ చీఫ్ గంగూలీ ప్ర‌శంస‌లు కురిపించారు. అత‌డు త‌మ ప్ర‌ణాళిక‌ల్లో ఉన్నాడ‌ని, టీమిండియాలో క‌చ్చితంగా రెగ్యుల‌ర్ ఆట‌గాడు అవుతాడ‌ని కితాబిచ్చారు. దుర‌దృష్ట‌వ‌శాత్తు ప్ర‌పంచ‌క‌ప్ జ‌ట్టులో చోటు ద‌క్క‌లేద‌ని తెలిపారు. కేర‌ళలో ప్ర‌తిభ‌గ‌ల ఆట‌గాళ్ల‌కు కొదువ లేద‌ని గంగూలీ అన్నారు.

Blog Image

‘పంత్‌కు అవకాశం కష్టమే!’

ఆస్ట్రేలియా వేదికగా వచ్చే నెల నుంచి టీ20 ప్రపంచకప్‌ ప్రారంభం కాబోతోంది. అయితే టీమిండియా జట్టులో దినేశ్ కార్తీక్, రిషభ్ పంత్ మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ సెలెక్టర్ సబా కరీం కీలక వ్యాఖ్యలు చేశారు. దినేశ్ కార్తీక్ వైపే టీమ్ మేనేజ్‌మెంట్ మొగ్గు చూపడం కరెక్ట్ అని చెప్పారు. ఇప్పటికే టీమిండియాకు మంచి కాంబినేషన్ దొరికిందన్నారు.

Blog Image

విరాట్ మెసేజ్‌పై ఫెద‌ర‌ర్ రియాక్ట్‌

స్టార్‌ టెన్నిస్ ప్లేయ‌ర్ రోజ‌ర్ ఫెద‌ర‌ర్ ఇటీవ‌ల రిటైర్ అయిన విష‌యం తెలిసిందే. ఫెద‌ర‌ర్‌కు విషెస్‌ చెబుతూ క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ ఓ వీడియో సందేశం చేశారు. అయితే ఆ మెసేజ్‌కు ఫెద‌ర‌ర్ రియాక్ట్ అయ్యారు. కోహ్లీ ఇచ్చిన మెసేజ్‌కు ఫెద‌ర‌ర్ థ్యాంక్స్ చెప్పారు. త‌ర్వ‌లోనే భారత్‌కు వస్తానని తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఫెద‌ర‌ర్ త‌న మెసేజ్‌ను పోస్టు చేశారు.

Blog Image

టీమిండియాకు ప్ర‌పంచ‌క‌ప్ సాధ్య‌మేనా!?

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు గాయం కార‌ణంగా టీమిండియా ఆల్ రౌండ‌ర్ జ‌డేజా దూరం కాగా.. తాజాగా యార్క‌ర్ కింగ్ బుమ్రా కూడా గాయం కార‌ణంగానే దూర‌మ‌య్యాడు. ఇద్ద‌రు బెస్ట్ బౌల‌ర్లు లేక‌పోవ‌డంతో ఫ్యాన్స్ ఆందోళ‌న చెందుతున్నారు. ఇక టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఇండియాకు రావ‌డం డౌటే అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తుండ‌గా.. మ‌రికొంద‌రు భార‌త్‌కు వ‌ర‌ల్డ్ క‌ప్ సాధ్య‌మేనా? అని ట్వీట్లు చేస్తున్నారు.

Blog Image

అమెరికాలో పికిల్‌బాల్‌‌కు మస్త్ క్రేజ్‌!

అమెరికాలో పికిల్‌బాల్‌ అనే క్రీడకు యమా క్రేజ్‌ ఉంది. పికిల్‌బాల్‌ చూడడానికి టెన్నిస్‌ ఆటలాగే ఉన్నప్పటికీ ఇందులో ఉండే రూల్స్‌ వేరు. బంతి కొట్టే విధానం నుంచి బ్యాట్‌ పట్టుకునే విధానం వరకు.. షాట్స్‌, సర్వ్‌ చేసే తీరులో చాలా మార్పులు ఉన్నాయి. పాడిల్ రూపంలో రాకెట్.. బంతి చుట్టూ హోల్స్ ఉంటాయి. పికిల్‌బాల్ కోర్ట్ డబుల్స్ బ్యాడ్మింటన్ కోర్టుతో సమానంగా ఉంటుంది.

Blog Image

టీమిండియాకు భారీ షాక్‌.. బుమ్రా దూరం.!

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు అంతా సిద్ధ‌మ‌వుతున్న వేళ టీమిండియా నుంచి బుమ్రా దూర‌మైన‌ట్లు తెలుస్తోంది. వెన్నెముక ఫ్రాక్చ‌ర్ కార‌ణంగా బుమ్రా టీ20 ప్ర‌పంచ‌క‌ప్ నుంచి దూర‌మ‌య్యాడు. ఈ గాయానికి స‌ర్జ‌రీ అవ‌స‌రం లేకున్నా.. 4 నుంచి 6 నెల‌ల విశ్రాంతి త‌ప్ప‌నిస‌రి అని డాక్ట‌ర్లు సూచించారు. ఈ స‌మ‌యంలో బుమ్రా ఎలాంటి ప్ర‌యాణాలు చేయ‌కూడ‌ద‌ని డాక్ట‌ర్లు పేర్కొన్నారు. దీనిపై బీసీసీఐ స్పందించాల్సి ఉంది.

Blog Image

ధోనీ రికార్డ్ బ్రేక్ చేసిన రోహిత్

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ధోనీ రికార్డును టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్రేక్ చేశాడు. ఒకే ఏడాదిలో అత్యధిక టీ20ల్లో జట్టును విజేతగా నిలిపిన కెప్టెన్‌గా రికార్డ్ క్రియేట్ చేశాడు. అయితే 2016లో ధోని 15 టీ20ల్లో భారత జట్టును విజేతగా నిలపగా.. రోహిత్ శర్మ ఈ ఏడాది 16 మ్యాచుల్లో విజేతగా నిలిపారు.