shape

Education ChotaNews

TS CPGET-2022 కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్

TS CPGET-2022 కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్

TS CPGET-2022 కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్ అయింది. అభ్యర్థులు ఈ నెల 28 నుంచి అక్టోబర్ 10 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అక్టోబర్ 12 నుంచి 15 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. అక్టోబర్ 18న సీట్ల కేటాయింపు జరగనుంది. అక్టోబర్ 24 నుంచి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది.

ALERT: ఫలితాలు విడుదల

ALERT: ఫలితాలు విడుదల

ఉమ్మడి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష (సీయూఈటీ)-యూజీ ఫలితాలను ఎన్‌టీఏ సోమవారం సాయంత్రం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 27 కేంద్రీయ విశ్వవిద్యాలయాలతో పాటు మొత్తం 66 వర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షను నిర్వహించారు. సెప్టెంబర్‌ 1-12 వరకు పలు విడతలుగా నిర్వహించిన ఈ పరీక్షకు దాదాపు 3.34లక్షల మంది హాజరయ్యారు. విద్యార్థులు తమ ఫలితాలను https://cuet.nta.nic.in/ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు.

బీఎస్సీ నర్సింగ్ కోర్సు అడ్మిషన్లకు నోటిఫికేషన్

బీఎస్సీ నర్సింగ్ కోర్సు అడ్మిషన్లకు నోటిఫికేషన్

TS: బీఎస్సీ నర్సింగ్‌, పీబీ‌బీ‌ఎస్సీ నర్సింగ్‌, బీపీటీ డిగ్రీ కోర్సుల్లో ఆడ్మిషన్లకు కాళోజీ నారా‌య‌ణ‌రావు ఆరోగ్య విశ్వవి‌ద్యా‌లయం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేట్‌ కాలే‌జీల్లో కన్వీ‌నర్‌ కోటా సీట్లను భర్తీ చేయ‌ను‌న్నారు.అర్హు‌లైన అభ్యర్థులు ఈ నెల 23 నుంచి అక్టో‌బర్‌ 3లోపు ఆయా కోర్సు‌లకు ఆన్‌‌లై‌న్‌లో దర‌ఖాస్తు చేసు‌కో‌వా‌లని వర్సిటీ అధి‌కా‌రులు సూచించారు. వివ‌రా‌లకు www.knruhs.telangan.gov.inను వెబ్‌సైట్‌ను సంప్రదించండి.

FLASH: బ్యాంకింగ్ రిజల్ట్స్ వచ్చేశాయ్!

FLASH: బ్యాంకింగ్ రిజల్ట్స్ వచ్చేశాయ్!

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(IBPS)నిర్వహించిన RRB X ఫలితాలు విడుదలయ్యాయి. ఆఫీస్ అసిస్టెంట్, స్కేల్-I ఆఫీసర్ పోస్టులకు సంబంధించిన ఈ IBPS రిజర్వ్ జాబితాను IBPS విడుదల చేసింది. అలాగే IBPS క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితాలు కూడా విడుదలయ్యాయి. అభ్యర్థులు ibps.in ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

ALERT: ఫలితాలు విడుదల

ALERT: ఫలితాలు విడుదల

TS: రాష్ట్రవ్యాప్తంగా 8 యూనివర్సిటీలలో పీజీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన సీపీజీఈటీ-2022 ఫలితాలు విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్. లింబాద్రి, ఓయూ వీసీ డి. రవీందర్ ఈ ఫలితాలను విడుదల చేశారు. విద్యార్థులు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ https://pgecet.tsche.ac.in/లో చెక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

నిరుద్యోగులకు SBI గుడ్ న్యూస్

నిరుద్యోగులకు SBI గుడ్ న్యూస్

నిరుద్యోగులకు SBI గుడ్‌న్యూస్ చెప్పింది. దేశ వ్యాప్తంగా తమ బ్యాంకుల్లో జూనియర్ అసోసియేట్ పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ నిర్వహిస్తామని వెల్లడించింది. ఈ ఏడాది మొత్తం 5,008 ఖాళీలను భర్తీ చేస్తామని, sbi.co.inలో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దరఖాస్తులకు ఈ నెల 27వ తేదీ వరకు గడువు ఇచ్చింది. ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది.

21న TS PECET-2022 ఎగ్జామ్

21న TS PECET-2022 ఎగ్జామ్

TS: రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 21న టీఎస్ పీఈసెట్2022 ఎగ్జామ్ జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 6 సెంటర్లలో ఉదయం 7 గంటలకు పరీక్ష ప్రారంభం కానుంది. ఒకే రోజు పురుషులకు, మహిళలకు వేర్వేరుగా పరీక్షలు పూర్తి చేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్లతో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు.

రేపు CPGET 2022 ఫలితాలు

రేపు CPGET 2022 ఫలితాలు

TS: సీపీజీఈటీ-2022 ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ప్రొఫెసర్ లింబాద్రి మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఫలితాలను రిలీజ్ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జూలై 11 నుంచి 23 వరకు జరిగిన ఈ పరీక్షలకు 67,027 మంది విద్యార్థులు అప్లై చేసుకోగా.. 57,262 మంది హాజరయ్యారు.

TS-ICET కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్

TS-ICET కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఐసెట్ ఎగ్జామ్‌కు సంబంధించి కౌన్సిలింగ్ షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. అక్టోబర్ 10 నుంచి 13 వరకు విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన జరగనుండగా.. అక్టోబర్ 10 నుంచి 15 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. 18న మొదటి విడత, 28న తుది విడత సీట్లను కేటాయిస్తారు.

25న నీట్ యూజీ కౌన్సెలింగ్ నోటిఫికేషన్

25న నీట్ యూజీ కౌన్సెలింగ్ నోటిఫికేషన్

మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి సంబంధించి నీట్ యూజీ ప్రవేశ పరీక్ష జూలై 17న నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నీట్ యూజీ కౌన్సెలింగ్ ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 25న విడుదల కానుందని ఎంసీసీ వర్గాలు వెల్లడించాయి. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే రిజస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని తెలిపాయి.

ఫలితాలు వచ్చేశాయి..

ఫలితాలు వచ్చేశాయి..

ఉమ్మడి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష యూజీ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను జాతీయ పరీక్షల మండలి విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 259పట్టణాల్లో 489పరీక్షా కేంద్రాలతో పాటు విదేశాల్లోని ఆరు నగరాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. 44సెంట్రల్‌ యూనివర్సిటీలు, 12స్టేట్‌ యూనివర్సిటీలు, 11డీమ్డ్‌ యూనివర్సిటీలు, 19ప్రయివేటు వర్సిటీలతో కలిపి దేశవ్యాప్తంగా 99విశ్వవిద్యాలయాల్లో గ్రాడ్యుయేషన్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం తొలిసారి ఈ పరీక్షను నిర్వహించారు.

ALERT: CUET ఫలితాలు నేడే

ALERT: CUET ఫలితాలు నేడే

దేశవ్యాప్తంగా సెంట్రల్ యూనివర్సిటీల్లో UG ప్రవేశాల కోసం నిర్వహించిన కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET-UG)ఫలితాలు ఈరోజు విడుదల కానున్నాయి. ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)గురువారం రాత్రి 10 గంటలలోపు ప్రకటిస్తుందని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఛైర్మన్ ఎం.జగదీష్ కుమార్ తెలిపారు. అభ్యర్థులు తమ ఫలితాలను https://cuet.samarth.ac.in/ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు.

ఆస్ట్రేలియా వెళ్లేవారికి గుడ్‌న్యూస్!

ఆస్ట్రేలియా వెళ్లేవారికి గుడ్‌న్యూస్!

ఆస్ట్రేలియాలో ఉన్నత విద్య కోసం వెళ్లేవారికి అక్కడి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఇక నుంచి చదవు ముగిసిన తర్వాత మూడేళ్ల పాటు ఉద్యోగం చేసుకునే వీలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిపుణుల కొరతతో సతమతమవుతున్న ఆస్ట్రేలియా విదేశీయులను ఆకర్షించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. నర్సింగ్, ఇంజినీరింగ్, ఐటీ రంగాల వారికి తొలి ప్రాధాన్యం ఉంటుందని సమాచారం.

నేను అలా చదవలేదు: JEE టాపర్

నేను అలా చదవలేదు: JEE టాపర్

JEE అడ్వాన్స్‌డ్- 2022 పరీక్షల్లో టాపర్‌గా నిలిచిన RK శిశిర్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. పరీక్షల కోసం తాను ఎప్పుడూ 12-14 గంటలు చదవలేదన్నాడు. సాధారణంగానే ప్రిపేర్ అయ్యానని చెప్పాడు. ఎంట్రెన్స్ ఎగ్జామ్స్‌‌లో మంచి మార్కులు రావాలంటే గంటల కొద్దీ చదవడం ముఖ్యం కాదని, విషయాన్ని ఎంతగా అర్థం చేసుకుంటున్నామనేదే ముఖ్యమని అభిప్రాయపడ్డాడు. తాజాగా ప్రకటించిన ఫలితాల్లో శిశిర్ 314/360 మార్కులు సాధించాడు.

నేడు JEE అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు

నేడు JEE అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు

ఐఐటీల్లో బీటెక్‌, బ్యాచులర్‌ ఆఫ్‌ సైన్స్‌ సీట్ల భర్తీకి నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు నేడు వెల్లడి కానున్నాయి. ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. 12వ తేదీ నుంచి IIT,NIT, ట్రిపుల్‌ఐటీ విద్యాసంస్థల్లో ప్రవేశానికి కౌన్సెలింగ్‌ ప్రారంభమవుతుంది. https://jeeadv.ac.in/ వెబ్‌సైట్‌ ద్వారా ఫలితాలను కూడా చెక్‌ చేసుకోవచ్చు.