shape

Crime ChotaNews

బైక్‌ను ఢీకొని 4 కి.మీలు ఈడ్చుకెళ్లిన కారు!

బైక్‌ను ఢీకొని 4 కి.మీలు ఈడ్చుకెళ్లిన కారు!

ఢిల్లీకి చెందిన అంజలి అనే యువతిని కారు ఢీకొని 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన తరహా మరో ఘటన హర్యానాలో వెలుగు చూసింది. బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులను వేగంగా వస్తున్న కారు ఢీకొని నాలుగు కిలోమీటర్లు మేర ఈడ్చుకుని వెళ్లింది. ఈ ప్రమాదం నుంచి ఇద్దరు యువకులు త్రుటిలో తప్పించుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

యూఎస్ కౌన్సిల్ సభ్యురాలి దారుణ హత్య

యూఎస్ కౌన్సిల్ సభ్యురాలి దారుణ హత్య

యూఎస్‌లోని న్యూజెర్సీ బరోకు చెందిన కౌన్సిల్ఉమన్ యునిస్ డ్వమ్‌ఫోర్ దారుణ హత్యకు గురయ్యారు. ఆమెను ఆమె నివాసం ఎదుటే SUV కారులో ఉండగా పలు రౌండ్లు గన్నుతో కాల్చడంతో అక్కడిక్కడే మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

విలేకరిపై కాల్పుల కలకలం

విలేకరిపై కాల్పుల కలకలం

అన్నమయ్య జిల్లా రాయచోటి శివాలయం కూడలి వద్ద ఓ టీవీఛానల్‌ విలేకరిపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పీలేరులో పనిచేస్తున్న పర్వతరెడ్డి(45) గత నెల 31న చిత్తూరు రింగ్‌రోడ్డు నుంచి రాయచోటికి బైక్‌పై వెళ్తుండగా శివాలయం కూడలి వద్ద గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు జరిపాడని టౌన్ సీఐ సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదుతో ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఆగ్రాలో గ్యాంగ్ రేప్

ఆగ్రాలో గ్యాంగ్ రేప్

ఆగ్రాకు చెందిన 15 సంవత్సరాల యువతిని ఆమె ప్రియుడు అమ్మేశాడు. తర్వాత ఓ మహిళ ఆమెను వేలం వేసింది. ఆ తర్వాత ఆ యువతి గ్యాంగ్​రేప్​నకు గురైంది. ఈ ఘటనతో సంబంధం ఉన్న ముగ్గురు మహిళలతో పాటుగా మొత్తం ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలు ఆ దుర్మార్గుల చెర నుంచి తప్పించుకుని ఒక మహిళ సాయంతో దగ్గర్లోని పోలీస్​ స్టేషన్​కు వెళ్లింది.

ఆప్.. ఎన్నికల్లో ఆ డబ్బే వినియోగించింది: ఈడీ

ఆప్.. ఎన్నికల్లో ఆ డబ్బే వినియోగించింది: ఈడీ

ఢిల్లీ లిక్కర్‌స్కామ్‌లో మరో ట్విస్ట్‌ వెలుగులోకి వచ్చింది. ఈ స్కామ్‌ ద్వారా వచ్చిన డబ్బునే ఆమ్‌ఆద్మీ పార్టీ గోవా ఎన్నికల ప్రచారానికి ఖర్చు పెట్టిందని ఈడీ వెల్లడించింది. రెండో చార్జ్‌షీట్‌లోఈ విషయాన్ని ఈడీ స్పష్టంచేసింది. ఈడీ చెప్పిన వివరాల ప్రకారం.. ఆప్‌ సర్వే టీమ్‌లకు దాదాపు రూ.70లక్షలు చెల్లించిందని, పార్టీ కమ్యూనికేషన్ ఇన్‌ఛార్జ్ విజయ్ నాయర్‌.. ప్రచారంలో పాల్గొన్న వాళ్లకు డబ్బులిచ్చారని తెలిపింది.

కదులుతున్న కార్లోనే గర్భవతి సజీవదహనం

కదులుతున్న కార్లోనే గర్భవతి సజీవదహనం

కేరళలోని కన్నూర్ ప్రాంతంలో దారుణ ఘటన జరిగింది. కదులుతున్న కారులో మంటలు చెలరేగడంతో ఓ గర్భవతి, ఆమె భర్త సజీవదహనం అయ్యారు. ఆసుపత్రికి వెళ్తున్న సమయంలో కారులో షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయని, వెనుక సీట్లో కూర్చున్న ముగ్గురు చుట్టుపక్కల ఉన్నవారి సహాయంతో తప్పించుకోగలిగారని పోలీసులు తెలిపారు. కానీ ముందు సీట్లో ఉన్న వారు సీట్‌బెల్ట్‌లో ఇరుక్కుపోవడంతో సజీవదహనం అయ్యారని తెలిపారు.

నడిరోడ్డుపై ఇద్దరు యువకుల దారుణ హత్య

నడిరోడ్డుపై ఇద్దరు యువకుల దారుణ హత్య

AP: కడపలో ఇద్దరు యువకులు దారుణహత్యకు గురయ్యారు. పట్టణానికి చెందిన రేవంత్(27) , అభిలాష్‌(29) బుధవారం రాత్రి నగరంలోని రఘు బార్‌లో మద్యం సేవించి తిరిగి వెళ్తుండగా.. నలుగురు యువకులు వారిపై కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో రేవంత్ అక్కడికక్కడే మృతిచెందగా, తీవ్రంగా గాయపడిన అభిలాష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నేడు మరణించాడు. పాత గొడవలే హత్యలకు కారణమని భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.