shape

Hyderabad ChotaNews

Blog Image

పాత సామన్ల పేరుతో హవాలా వ్యాపారం

TS: హైదరాబాద్‌లో రూ. 1.24 కోట్ల హవాలా డబ్బును పోలీసులు పట్టుకున్నారు. మాసబ్‌ట్యాంక్‌ పరిధిలో షోయబ్‌ అనే వ్యక్తి వద్ద ఈ డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌‌లోని మీరట్‌‌ నుంచి షోయబ్‌ హైదరాబాద్‌ వచ్చి పాత సామాను సేకరించే వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు. బంధువు కామిల్‌ సూచన మేరకు హవాలా డబ్బు తీసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

Blog Image

అక్టోబర్ 15 నుంచి 5వ విడత యాత్ర

TS: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రను అక్టోబర్ 15 నుంచి ప్రారంభించనున్నారు. నిర్మల్ జిల్లా బాసర అమ్మవారిని దర్శించుకుని భైంసా నుంచి కరీంనగర్‌ వరకు యాత్ర కొనసాగిస్తారు. బండి సంజయ్ ఇప్పటి వరకు నాలుగు విడతల్లో 48 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1,260 కిలోమీటర్ల మేర పాదయాత్రను పూర్తి చేశారు.

Blog Image

‘కేసీఆర్ కోసం ఎదురు చూస్తున్నారు’

HYD: సీఎం కేసీఆర్‌తో మహారాష్ట్ర రాజ్యసభ మాజీ సభ్యుడు విజయ్ దర్డా ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. ఈ భేటీలో జాతీయ రాజకీయాలు, తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, ఇతర అంశాలపై చర్చించారు. సీఎం కేసీఆర్ అనతికాలంలోనే రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టి దేశానికే ఆదర్శంగా నిలిచారని విజయ్ దర్డా కొనియాడారు. కేసీఆర్ నాయకత్వం కోసం దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు.

Blog Image

జాతీయ పార్టీపై కేసీఆర్‌కు నారాయణ సూచన

TS: సీఎం కేసీఆర్ ప్రకటించనున్న జాతీయ పార్టీని సీపీఐ నారాయణ స్వాగతించారు. రాజకీయ పోరాటంలో భాగంగా కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టడాన్ని సమర్థిస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్‌ ప్రకటించబోయే జాతీయ పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా పోటీ పడాల్సి ఉంటుందని, బీజేపీ వ్యతిరేక కూటమి బలపడే విధంగా టీఆర్‌ఎస్‌ జాతీయ పార్టీ అడుగులు వేస్తే మంచిదని సూచించారు.

Blog Image

వైఎస్‌కు కాంగ్రెస్ వెన్నుపోటు: షర్మిల

YSRTP అధినేత్రి వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడంలో వైఎస్ఆర్ కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. వైఎస్ఆర్‌కు కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచిందని విమర్శించారు. హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోతే కనీసం దర్యాప్తు చేయించలేదని, అంత గొప్ప నాయకుడిని కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదని ఆరోపించారు.

Blog Image

రూ. 80 కోట్లతో విమానం కొంటున్న కేసీఆర్‌!

త్వరలో సీఎం కేసీఆర్ ప్రత్యేక విమానాన్ని కొనుగోలు చేయబోతున్నారు. దసరా రోజు జాతీయ పార్టీ ప్రకటించిన తర్వాత విమానానికి ఆర్డర్ ఇవ్వనున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. 80 కోట్ల రూపాయలతో 12 సీట్ల సామర్థ్యం గల చార్టర్ ఫ్లైట్‌ను కేసీఆర్ కొనుగోలు చేయనున్నారు. ఈ మొత్తాన్ని టీఆర్ఎస్ విరాళాల రూపంలో సేకరించబోతోంది. మరోవైపు ప్రస్తుతం పార్టీ ఖజానాలో 865 కోట్ల రూపాయలు ఉన్నాయి.

Blog Image

నేను ప్రగతి భవన్‌లోనే ఉన్నా: ఎంపీ సంతోష్

ఈడీ దాడులకు బయపడి కనిపించకుండా వెళ్లాడంటూ తనపై జరగుతున్న ప్రచారంపై ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ స్పందించారు. అదంతా తప్పుడు ప్రచారం అని కొట్టిపారేశారు. తాను ఎక్కడికీ పోలేదని.. హైదరాబాద్‌లోనే ఉన్నానని స్పష్టం చేశారు. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తోనే ఉన్నానని చెప్పారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

Blog Image

TSRTC ఆసుపత్రి కూడా మనందరిది!

TSRTC ఎండీగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి సజ్జనార్ తన మార్క్ చూపిస్తున్నారు. ఇప్పటికే పలు నిర్ణయాలతో సామాన్య ప్రజల నుంచి ప్రశంసలు అందుకున్నారు. తాజాగా తార్నాకలోని TSRTC హాస్పిటల్‌లో ఇప్పుడు సామాన్య ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందించనున్నట్లు వెల్లడించారు. ‘ఇప్పుడు TSRTC బస్సే కాదు… ఆసుపత్రి కూడా మనందరిది’ అని సజ్జనార్ తెలిపారు.

Blog Image

ఆపరేషన్ రోప్.. ట్రాఫిక్ సమస్యలకు చెక్

HYD: త్వరలో బ్యాక్ సీటు బెల్ట్ పెట్టుకోవడం తప్పనిసరి చేస్తామని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఫ్రంట్ సీటుతో పాటు బ్యాక్ సీటులో కూర్చున్న వారు కూడా సీటు బెల్టు పెట్టుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. ‘ఆపరేషన్ రోప్’ పేరుతో కొత్త కార్యచరణ అమలు చేస్తున్నామన్నారు. రోడ్డుకు అడ్డుగా ఉన్న ఎటువంటి నిర్మాణాలను అయినా తొలగించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Blog Image

ముగిసిన రాజాసింగ్ విచారణ

HYD: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పీడీ యాక్ట్‌పై అడ్వైజరీ బోర్డు విచారణ ముగిసింది. చర్లపల్లి జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయనను విచారించారు. ఈ విచారణలో పోలీసులతో పాటు రాజాసింగ్ కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. పీడీ యాక్ట్ ప్రయోగంపై రాజాసింగ్ అభ్యంతరాలను అడ్వైజరీ బోర్డు తెలుసుకుంది. రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ ఎత్తివేయాలంటే అడ్వైజరీ బోర్డు నిర్ణయం కీలకం కానుంది.

Blog Image

‘కేసీఆర్‌ది పూటకోమాట’: లక్ష్మణ్

సీఎం కేసీఆర్‌ జాతీయ పార్టీపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ స్పందించారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోచుకుంటోందని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దేశాన్ని దోచుకోవటానికే.. కేసీఆర్ జాతీయ పార్టీ అంటున్నారన్నారు. తెలంగాణలో ఏ వర్గమూ సంతోషంగా లేరన్న ఎంపీ.. కేసీఆర్ ఒకసారి థర్డ్‌ఫ్రంట్, మరోసారి ఫోర్త్‌ఫ్రంట్, ఇంకోసారి బీజేపీయేతర కూటమంటారని ఎద్దేవా చేశారు.

Blog Image

అక్టోబర్ 1న రాష్ట్రానికి సునీల్ బన్సల్

TS: బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ బన్సల్ అక్టోబర్ 1న రాష్ట్రానికి రానున్నారు. మునుగోడు ఉపఎన్నిక స్టీరింగ్ కమిటీతో భేటీకానున్నారు. ఆ తర్వాత మండల ఇంచార్జులు, మండల సమన్వయ కమిటీలతో సమావేశం కానున్నారు. మునుగోడు ఉపఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాలపై వారితో చర్చించనున్నారు. అలాగే హైదరాబాద్‌లో పలువురు పార్టీ సీనియర్ నేతలతో కూడా సమావేశం అవుతారని తెలుస్తోంది.

Blog Image

మునుగోడులో సర్వేలు.. పార్టీల వ్యూహాలు

TS: మునుగోడు ఉపఎన్నికలో గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తున్నాయి. బైపోల్ షెడ్యూల్ రాకముందే ఓవైపు ప్రచారం మొదలుపెట్టిన పార్టీలు.. మరోవైపు జనం నాడిని పసిగట్టేందుకు వివిధ సంస్థలతో సర్వేలు చేయిస్తున్నాయి. పార్టీ పరిస్థితి, అభ్యర్థి బలాబలాలు, జనం ఎటువైపు ఉన్నారు? తదితర అంశాలపై సర్వే టీమ్స్ సమాచారం సేకరిస్తున్నాయి. ఈ సర్వేల ఆధారంగా పార్టీలు ముందుకెళ్తున్నాయి.

Blog Image

ఆ విషానికి విరుగుడు కేసీఆర్: కమలాకర్

టీఆర్ఎస్ నేత, మంత్రి గంగుల కమలాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అభివృద్ధిని చూసి కాంగ్రెస్, బీజేపీ నేతల కళ్ళు మండుతున్నాయన్నారు. కాంగ్రెస్, బీజేపీ అధికారంలోకి వస్తే నీళ్ళు, కరెంట్ ఎత్తుకుపోతారన్నారు. ఢిల్లీ పార్టీలు తెలంగాణపై విషం చిమ్ముతున్నారన్నారు. ఆ విషానికి విరుగుడు సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు.కేసీఆర్ నాయకత్వాన్ని కాపాడుకోవాలన్నారు. కేసీఆర్ లేకుంటే భవిష్యత్ తరాల జీవితాలు అంధకారంగా మారుతాయన్నారు.

Blog Image

నవంబర్‌లో మునుగోడు ఉపఎన్నిక?

TS: మునుగోడు ఉప ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. నవంబర్ 2వ వారంలో మునుగోడు ఉపఎన్నిక జరగనున్నట్లు సమాచారం. దసరా తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్నట్లు తెలుస్తోంది. పోలింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారులను ఈసీ ఆదేశించింది. దీంతో నల్గొండ జిల్లా కలెక్టర్, అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.