shape

Entertainment ChotaNews

 జేక్‌ ఫ్రేజర్‌ జోరు.. ముంబైకి చుక్కలు

జేక్‌ ఫ్రేజర్‌ జోరు.. ముంబైకి చుక్కలు

IPL: అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ, ముంబై మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో జేక్‌ ఫ్రేజర్‌ తన బ్యాట్‌తో ముంబై బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 15 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ సాధించాడు. దీంతో పవర్‌ ప్లేలో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన మూడో బ్యాటర్‌గా ఫ్రేజర్ నిలిచాడు. చివరకు 84 వ్యక్తిగత పరుగుల వద్ద పీయూశ్‌ చావ్లా బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు.

 ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు

ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు

దేశంలోని ప్రధాన ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య నానాటికీ క్షీణిస్తోంది. సాధారణంగా ఐటీలో ఎప్పుడూ ఉద్యోగుల సంఖ్య పెరగడమే కానీ తగ్గడం అరుదు. అలాంటిది ఒక్క హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ మినహా మిగిలిన ప్రధాన ఐటీ కంపెనీల్లో ఇదే ధోరణి కనిపిస్తోంది. 2023-24ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 69వేల మేరకు ఉద్యోగుల సంఖ్య క్షీణించింది. ఆశించిన స్థాయిలో డిమాండ్‌ లేకపోవడమే దీనికి కారణమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

 సుందర్ పిచాయ్ ఎమోషనల్ పోస్ట్

సుందర్ పిచాయ్ ఎమోషనల్ పోస్ట్

గూగుల్ CEO సుందర్ పిచాయ్ ఉద్యోగంలో చేరి రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ చేశారు. ‘‘గూగుల్ కంపెనీలో 2004 ఏప్రిల్ 26 నా మొదటి రోజు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మార్పులు వచ్చాయి. అద్భుతమైన కంపెనీలో పని చేయడం వల్ల చాలా థ్రిల్ పొందాను. నేను అదృష్టవంతుడిగా భావిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

 శివాలయ ప్రదక్షిణానికీ నియమాలున్నాయ్..!

శివాలయ ప్రదక్షిణానికీ నియమాలున్నాయ్..!

శివాలయ ప్రదక్షిణానికీ నియమాలున్నాయ్..!

 OTTలో ‘ఫ్యామిలీ స్టార్’..విజయ్‌పై దారుణమైన ట్రోల్స్

OTTలో ‘ఫ్యామిలీ స్టార్’..విజయ్‌పై దారుణమైన ట్రోల్స్

హీరో విజయ్ దేవరకొండను సినీ అభిమానులు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. తాజాగా 'ఫ్యామిలీ స్టార్' మూవీ ఓటీటీలోకి వచ్చింది. అయితే ఈ సినిమా చూసిన వారు నెగిటివ్ కామెంట్సే చేస్తున్నారు. మరీ ముఖ్యంగా హీరో దోశ వేసే సీన్ చూసి.. 'అవసరమైతే దోశలు తినడం మానేస్తాం గానీ ఇలాంటి దోశలు తినం బాబోయ్' అంటున్నారు. ప్రస్తుతం ఈ ట్రోల్స్ వైరల్ అవుతున్నాయి.

 సీఎం జగన్‌కు షర్మిల బహిరంగ లేఖ

సీఎం జగన్‌కు షర్మిల బహిరంగ లేఖ

సీఎం జగన్‌కు ఏపీసీసీ చీఫ్ షర్మిల బహిరంగ లేఖ రాశారు. ‘‘మీరు అధికారంలోకి వచ్చేదాకా కొనసాగుతున్న 28పథకాలను నిలిపేశారు. దళితులపై దాష్టీకాలు పెరుగుతున్నా పట్టనట్లే ఉన్నారు. దాడులు నివారించి వారిని కాపాడే చర్యలు లేవు. దాడులు చేసినవారిలో ఎక్కువమంది మీ పార్టీ వారే. ఎస్సీలకు మేలు చేయకపోగా కీడు చేస్తున్నారు. ఎస్సీ,ఎస్టీలకు జరిగిన అన్యాయానికి క్షమాపణలు కోరండి’’ అని షర్మిల లేఖలో పేర్కొన్నారు.

 తొలిసారి ఎన్నికల బరిలో మాజీ సీఎం భార్య

తొలిసారి ఎన్నికల బరిలో మాజీ సీఎం భార్య

జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ భార్య కల్పనా సోరెన్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. గండీ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో ఆమె జేఎంఎం అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. సర్ఫరాజ్‌ అహ్మద్‌ రాజీనామాతో మే 20న ఉప ఎన్నిక జరగనుంది. అవినీతి ఆరోపణలతో హేమంత్‌ సోరెన్‌ జైలుకు వెళ్లడంతో పార్టీ బాధ్యతలు చూస్తున్న ఆమె తొలిసారి ఎన్నికల బరిలో కూడా నిలుస్తున్నారు.

 ఇంకా అదుపులోకి రాని మంటలు

ఇంకా అదుపులోకి రాని మంటలు

TG: అలెన్‌ హెర్బల్‌ పరిశ్రమలో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. దీంతో అలెన్‌ పరిశ్రమ పరిసరాల్లో ఉంటున్న వారిని పోలీసులు ఖాళీ చేయించారు. ప్రజలు ఖాళీ చేయడంతో ఆ ప్రాంతమంతా నిర్మానుష్యంగా మారింది. ఇంటి నుంచి బయటికి వెళ్లిన ఎల్లమ్మ కాలనీ వాసులు సమీపంలోని చెట్ల కింద కూర్చున్నారు. నిన్నటి నుంచి మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

 TDPకి బిగ్ పాక్..వైసీపీలో చేరిన యనమల

TDPకి బిగ్ పాక్..వైసీపీలో చేరిన యనమల

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. సీఎం ‌ జగన్‌ సమక్షంలో కాకినాడ జిల్లా టీడీపీ సీనియర్‌ నేత యనమల కృష్ణుడు వైసీపీలో చేరారు. యనమల కృష్ణుడితో పాటు టీడీపీ నేతలు పి.శేషగిరిరావు, పి.హరిక్రిష్ణ, ఎల్‌.భాస్కర్‌ వైసీపీలో చేరారు.

 కాళేశ్వరంపై ఫిర్యాదుల బాక్సులు ఇవే

కాళేశ్వరంపై ఫిర్యాదుల బాక్సులు ఇవే

కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై వివరాలను వెలికి తీసే పనిలో జస్టిస్ చంద్ర ఘోష్ కమిషన్ నిమగ్నమైంది. హైదరాబాద్‌లోని బూర్గుల రామకృష్ణారావు భవన్‌లోని ఎనిమిదో అంతస్తులో ఫిర్యాదుల బాక్సులను ఏర్పాటు చేశారు. మే 31 వరకు ప్రజలు నేరుగా వెళ్లి ఫిర్యాదులు, సలహాలు, అభిప్రాయాలు తెలపవచ్చు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టులకు వేర్వేరుగా బాక్సులను సిద్ధం చేశారు.

 అమేథీ, రాయ్‌బరేలీ అభ్యర్థిత్వాలపై వీడని ఉత్కంఠ

అమేథీ, రాయ్‌బరేలీ అభ్యర్థిత్వాలపై వీడని ఉత్కంఠ

ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌ కంచుకోటలుగా పేరొందిన రాయ్‌బరేలీ, అమేథీ లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల ఖరారుపై ఉత్కంఠ కొనసాగుతోంది. శనివారం పోటీదారుల పేర్లు ప్రకటించే అవకాశాలున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ.. దీనికి మరికొన్ని రోజుల సమయం పడుతుందని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఈ రెండు స్థానాలకు ఐదో విడతలో భాగంగా మే 20న పోలింగ్‌ జరగనుంది.

 అక్కడ ఎప్పటికైనా అవకాశం వస్తుంది: కత్రినా

అక్కడ ఎప్పటికైనా అవకాశం వస్తుంది: కత్రినా

బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘ఇటీవలే ఓ హాలీవుడ్‌ చిత్రంలో నటించే అవకాశం వస్తే కొన్ని కారణాల వల్ల తిరస్కరించాను. తిరిగి తప్పక ఆ అవకాశం వస్తుందని నమ్ముతున్నా. దాంతో నా సినీ జీవితం అనే పుస్తకంలో ఓ కొత్త పేజీ రూపుదిద్దుకుంటుందని భావిస్తున్నా’ అని కత్రినా తెలిపారు.

 చేనేత కుటుంబాలకు దీపాదాస్‌ మున్షీ పరామర్శ

చేనేత కుటుంబాలకు దీపాదాస్‌ మున్షీ పరామర్శ

TG: ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలను తెలంగాణ కాంగ్రెస్‌ రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌ దీపాదాస్ మున్షీ పరామర్శించారు. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లికి చెందిన చేనేత కార్మికుడు మల్లేశం ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో మల్లేశం కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.

 హాలీవుడ్‌లో ఎన్నో కష్టాలు పడ్డా: ప్రియాంక చోప్రా

హాలీవుడ్‌లో ఎన్నో కష్టాలు పడ్డా: ప్రియాంక చోప్రా

హాలీవుడ్‌కు వెళ్లిన తొలినాళ్లలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నట్లు నటి ప్రియాంక చోప్రా తన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘భారత్‌లో ఉన్నప్పుడు హాలీవుడ్‌ ప్రముఖ మ్యాగజైన్‌ల కవర్‌పై నా ఫొటో ఆరు సార్లు వచ్చింది. విదేశాలకు వచ్చాక ఎవ్వరూ కనీసం నాతో ఒక మీటింగ్‌ కూడా నిర్వహించలేదు. ఎన్నో ఎదురుదెబ్బలు, తిరస్కరణలు అనుభవించాను’ అని చెప్పారు.

 పదో తరగతి ఫలితాల విడుదలకు సర్వం సిద్ధం

పదో తరగతి ఫలితాల విడుదలకు సర్వం సిద్ధం

తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 30న ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ కార్యాలయంలో పరీక్షల ఫలితాలను ఆ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5 లక్షల మందికి పైగా విద్యార్థులు పదోతరగతి పరీక్షలు రాసిన విషయం తెలిసిందే.

 మల్లారెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ రియాక్షన్

మల్లారెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ రియాక్షన్

బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మ‌ల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల గెలుస్తారని ఇటీవల వ్యాఖ్యానించారు. ఆయన మాటలపై కేటీఆర్ స్పందించారు. ‘‘మ‌ల్లారెడ్డి రాజ‌కీయం అనుభవంతోనే ఆ కామెంట్స్ చేశారు. ఆయన ఎవరినైనా పొగడ్తలతో మునగచెట్టు ఎక్కించగలరు. మల్లారెడ్డి మాటలతో గెలుపుపై ధీమాతో ఈటల ఇంట్లో ఉంటారు. మేం ప్రచారం చేసి గెలుస్తాం. అందుకే అలా అన్నారు’’ అని చెప్పారు.

 లారీని ఢీ కొట్టిన కారు.. ముగ్గురు మృతి

లారీని ఢీ కొట్టిన కారు.. ముగ్గురు మృతి

AP: అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నక్కపల్లి మండలం వెదుళ్లపాలెం వద్ద కారు అదుపు తప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ముంబయి

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ముంబయి

ఐపీఎల్‌-17 సీజన్‌లో భాగంగా మరికాసేపట్లో ముంబయి, దిల్లీ జట్లు తలపడనున్నాయి. టాస్‌ గెలిచిన ముంబయి బౌలింగ్‌ ఎంచుకుంది. ఇప్పటి వరకు దిల్లీ 9 మ్యాచ్‌లు ఆడి.. నాలుగింట విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. 8 మ్యాచ్‌లు ఆడిన ముంబయి.. మూడింట గెలుపొంది తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది.

 అయోధ్య పర్యటన కాంగ్రెస్‌ కొత్త నాటకం: స్మృతి ఇరానీ

అయోధ్య పర్యటన కాంగ్రెస్‌ కొత్త నాటకం: స్మృతి ఇరానీ

ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక అయోధ్య పర్యటనకు సిద్ధమవుతున్నారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికై కేంద్రం పంపిన ఆహ్వానాన్ని కాంగ్రెస్‌ తిరస్కరించిందని గుర్తు చేశారు. అప్పుడు రాని వారు ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. పర్యటన పేరుతో కాంగ్రెస్‌ కొత్త నాటకానికి తెర లేపుతోందని మండిపడ్డారు.

 వరల్డ్ కప్‌లో చోటు దక్కకపోతే బాధపడతా: గిల్

వరల్డ్ కప్‌లో చోటు దక్కకపోతే బాధపడతా: గిల్

టీ20 ప్రపంచ కప్‌ కోసం భారత జట్టును ప్రకటించే సమయం దగ్గరపడింది. ఈ నేపథ్యంలో తన ఎంపికపై శుభమన్ గిల్ స్పందించాడు. గత ఐపీఎల్ సీజన్‌లో దాదాపు 900 పరుగులు చేశానని.. తప్పకుండా జట్టుకు ఎంపికవుతానని విశ్వాసం వ్యక్తం చేశారు. ఒకవేళ సెలక్ట్‌ కాకపోతే నిరుత్సాహానికి గురవుతానన్నారు. తాను ఎంపిక కాకపోయినా భారత జట్టు విజయం సాధించాలని కోరుకుంటానని తెలిపారు.

 కేజ్రీవాల్ ఆరోగ్యంగానే ఉన్నారు: ఎయిమ్స్

కేజ్రీవాల్ ఆరోగ్యంగానే ఉన్నారు: ఎయిమ్స్

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టు అయిన సీఎం కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆప్ ఆందోళ వ్యక్తం చేసింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు ఎయిమ్స్‌కు చెందిన ఐదుగురు సభ్యుల మెడికల్ బోర్డు శనివారం వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు ధ్రువీకరించారు. కేజ్రీవాల్‌ ప్రస్తుతం ఉపయోగిస్తున్న మందులనే కొనసాగించాలని మెడికల్‌ బోర్డు సూచించింది.

 కాసేపట్లో సీఎం రేవంత్ ప్రెస్‌మీట్

కాసేపట్లో సీఎం రేవంత్ ప్రెస్‌మీట్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం 5 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. లోక్‌సభ ఎన్నికల అంశంపై స్పందించనున్నారని తెలుస్తోంది. మరోవైపు బీజేపీ, బీఆర్ఎస్ విధానాలపై కౌంటర్ ఇవ్వనున్నారని సమాచారం. రైతు రుణమాఫీతో పాటు కాంగ్రెస్ పార్టీ హామీలను వివరించనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

 కాంగ్రెస్‌ వైఫల్యం వల్లే పీవోకే చేజారింది: లక్ష్మణ్

కాంగ్రెస్‌ వైఫల్యం వల్లే పీవోకే చేజారింది: లక్ష్మణ్

కాంగ్రెస్ పార్టీపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తీవ్ర విమర్శలు చేశారు. ఆ పార్టీ వల్లే పీవోకే పాక్ అధీనంలోకి వెళ్లిందన్నారు. అయోధ్య నిర్మాణాన్ని కాంగ్రెస్ అడుగడుగునా అడ్డుకుందని మండిపడ్డారు. సోమనాథ్‌ ఆలయ పునరుద్ధరణను ఆనాడు కాంగ్రెస్‌ వ్యతిరేకించిందని గుర్తు చేశారు. సీఏఏను మతంతో ముడిపెట్టి ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహించారు.

 నవరత్నాలు: అప్పుడు, ఇప్పుడు!

నవరత్నాలు: అప్పుడు, ఇప్పుడు!

వైసీపీ చీఫ్ జగన్ తన పార్టీ మేనిఫెస్టోను ప్రకటించారు. నవరత్నాల పేరుతో గతంలోని కొన్ని హామీలను కొనసాగించారు. అయితే నవరత్నాల లోగోలో స్వల్ప మార్పులు చేశారు.

 ఫ్యాన్స్‌పై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు!

ఫ్యాన్స్‌పై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు!

నటి సమంత తన అభిమానులపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘‘ఇంతమంది అభిమానులను సొంతం చేసుకోవడం చిన్న విషయం కాదు. నా ఫ్యాన్స్‌లో చాలా మందికి వినోదం, ఫ్యాషన్‌, మేకప్‌పై ఆసక్తి ఎక్కువ. వాళ్లను చూసి ఎన్నో విషయాలపై నా అభిప్రాయాన్ని మార్చుకున్నాను. కొత్త అంశాలపై అవగాహన వచ్చింది. నా మాటలు కొద్దిమందిపై ప్రభావం చూపినా ఆనందమే’’ అని చెప్పారు.

 సీఎం మమతకు గాయం

సీఎం మమతకు గాయం

ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీకి మరోసారి గాయమైంది. హెలికాప్ట‌ర్ సీటులో కూర్చోబోయి హఠాత్తుగా కింద‌ప‌డ్డారు. దీంతో కాలుకు స్వ‌ల్ప‌ంగా గాయం అయింది. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది ఆమెను పైకి లేపారు. బ‌ర్ద‌మాన్ జిల్లాలోని దుర్గాపూర్ వ‌ద్ద జ‌రిగింది. ఆ తర్వాత ఎన్నికల ప్రచారం కోసం అస‌న్‌సోల్‌లోని ప్రచార సభకు బయల్దేరి వెళ్లారు. ఇటీవలే నుదిటి భాగంలో ఆమెకు గాయమై కోలుకున్నారు.