గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాల గడువు పొడిగింపు
TS: 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలకు సంబంధించి గడువును ఈనెల 15 వరకు పొడిగించారు. గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలకు కామన్ ఎంట్రన్స్‌ను నిర్వహించడంతోపాటు అర్హత సాధించిన విద్యార్థుల మొదటి జాబితాను ఇటీవలే విడుదల చేశారు.ఈనెల 10లోగా కేటాయించిన గురుకులాల్లో అడ్మిషన్ రిపోర్ట్ చేయాలని సూచించగా..తాజాగా ఆ గడువును 15వరకు పొడిగించారు.