shape

Social Media ChotaNews

VIDEO: మనిషిని చూసి దాక్కున్న పులి

VIDEO: మనిషిని చూసి దాక్కున్న పులి

సాధారణంగా పులులను చూసి జంతువులు దాక్కుంటాయి. ఇక మనుషులైతే భయంతో పరుగులు తీస్తారు. కానీ ఓ పులి మాత్రం మనిషిని చూసి పొదల మధ్యలో దాక్కుంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత నంద ట్విట్టర్‌లో షేర్ చేశారు. అడవి జంతువులు వాటికి అపాయముందనుకున్నప్పుడే మనుషులపై దాడులు చేస్తాయని, లేనిపక్షంలో సైలెంట్‌గా ఉంటాయని సుశాంత తెలిపారు.

ఇలాంటి మందుల చీటీ చూశారా?

ఇలాంటి మందుల చీటీ చూశారా?

సాధారణంగా వైద్యులు రాసిన మందుల చీటీ కేవలం మెడికల్ షాపు సిబ్బందికి తప్ప మరెవరికీ అర్థం కాదు. అయితే కేరళకు చెందిన ఓ వైద్యుడు రాసిన మెడికల్ చీటీ మాత్రం ఎవరైనా సులువుగా చదవొచ్చు. పాలక్కాడ్ గవర్నమెంట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ నితిన్ నారాయణ ఓ రోగి ఆసుపత్రికి వెళ్లగా ఈ మందుల చీటీ రాశాడు. ప్రస్తుతం ఈ చీటీ నెట్టింట్లో వైరలవుతోంది.

ఫ్లిప్‌కార్ట్‌లో ల్యాప్‌టాప్ ఆర్డర్ చేస్తే ఏమొచ్చిందో తెలుసా?

ఫ్లిప్‌కార్ట్‌లో ల్యాప్‌టాప్ ఆర్డర్ చేస్తే ఏమొచ్చిందో తెలుసా?

పండగ సీజన్ కావడంతో ఫ్లిప్‌కార్ట్‌లో ల్యాప్‌టాప్ ఆర్డరిచ్చిన ఓ వ్యక్తికి ల్యాప్‌టాప్ బదులు డిటర్జెంట్ వచ్చింది. తాను లేని టైంలో డెలివరీ బాయ్ ఇంటికి రావడంతో ఇదంతా జరిగిందని యశస్వీ శర్మ అనే నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తన తండ్రికి ‘ఓపెన్ బాక్స్ డెలివరీ’ విధానం తెలియకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందని వాపోయాడు.

'నా డెత్ సర్టిఫికేట్ పోయింది.. దొరికితే ఇస్తారా!'

'నా డెత్ సర్టిఫికేట్ పోయింది.. దొరికితే ఇస్తారా!'

న్యూస్ పేపర్లలో ప్రతి రోజు ఎన్నో ప్రకటనలు చూస్తూ ఉంటాము. కానీ అస్సాంకు చెందిన రంజిత్ అనే వ్యక్తి విచిత్రంగా నా డెత్ సర్టిఫికేట్ పోయిందంటూ న్యూస్ పేపర్లో యూడ్ ఇచ్చాడు. ఈ నెల 7న ఉదయం 10 గంటలకు లుమ్డిండ్ బజార్ వద్ద డెత్ సర్టిఫికేట్ పోయిందని ప్రకటనలో తెలిపాడు. దానిని ఓ వ్యక్తి నెట్టింట్లో షేర్ చేయగా ఆ పోస్ట్ వైరలవుతోంది.

ఇన్‌స్టాగ్రామ్ సేవలకు అంతరాయం

ఇన్‌స్టాగ్రామ్ సేవలకు అంతరాయం

ఇన్‌స్టాగ్రామ్ సేవలకు గురువారం రాత్రి అంతరాయం ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్ యాప్ ఓపెన్ కాకపోవడంతో యూజర్లు తమ పోస్టులను అప్డేట్ చేయలేకపోయారు. దీంతో అసహనానికి గురైన ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు సోషల్‌మీడియా వేదికగా తీవ్రస్థాయిలో ఫిర్యాదులు చేస్తున్నారు. అలాగే #instagramdownagain అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్విట్టర్‌లో ట్రెండ్ అయ్యింది. యాప్‌లో కొత్త ఫీచర్‌ను టెస్టింగ్ చేస్తుండటం వల్ల అంతరాయం ఏర్పడినట్లు సమాచారం.

క్రియేటర్లకు యూట్యూబ్‌ గుడ్ న్యూస్!

క్రియేటర్లకు యూట్యూబ్‌ గుడ్ న్యూస్!

కంటెంట్ క్రియేటర్లకు యూట్యూబ్‌‌ గుడ్ న్యూస్ చెప్పింది. షార్ట్ వీడియో క్రియేటర్లు ఇకపై డబ్బులు సంపాదించవచ్చు. గూగుల్ యాజమాన్యంలోని స్ట్రీమింగ్ సర్వీస్ తన వీడియో ఫీచర్ షార్ట్‌లపై ప్రకటనలను పరిచయం చేస్తోందని, తద్వారా ఆదాయంలో 45 శాతం డబ్బును క్రియేటర్లకు ఇస్తామని ప్రకటించింది. దీంతో యూజర్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

వెడ్డింగ్ ఫొటోషూట్‌తో మంచి మెసేజ్ ఇచ్చింది!

వెడ్డింగ్ ఫొటోషూట్‌తో మంచి మెసేజ్ ఇచ్చింది!

కేరళకు చెందిన ఓ యువతి వినూత్నంగా ఆలోచించింది. పెళ్లికూతురుగా ముస్తాబై రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఫొటోషూట్ చేయించుకుంది. అయితే, సదరు యువతి ఫొటో షూట్‌.. రోడ్డుపై ఉన్న గుంతలను చూపిస్తూ తీసుకుంది. వాహనదారుల ఇబ్బందులను స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. వధువు ఫొటో షూట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ ఆమెను ప్రశంసిస్తున్నారు.

కొబ్బరి చెట్టుపై చిరుత పులుల కొట్లాట

కొబ్బరి చెట్టుపై చిరుత పులుల కొట్లాట

రెండు చిరుత పులులు కొబ్బరి చెట్టుపైకి ఎక్కి కొట్లాడుకున్న ఘటన మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో జరిగింది. సాంగ్వీ అనే గ్రామంలో పంట పొలాల మధ్యలో ఉన్న కొబ్బరి చెట్టుపైకి మొదట ఒక చిరుత ఎక్కింది. అది కిందికి దిగేందుకు ప్రయత్నించగా మరో చిరుత దానిపై దాడి చేస్తూ చెట్టుపైకి ఎక్కింది. తర్వాత రెండూ అక్కడి నుంచి వెళ్లిపోయాయి. ఈ వీడియో వైరల్‌గా మారింది.

వరుడు కావలెను.. వాళ్లయితే వద్దు!

వరుడు కావలెను.. వాళ్లయితే వద్దు!

ఓ న్యూస్ పేపర్‌లో వచ్చిన పెళ్లి ప్రకటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. 24 ఏళ్ల వయసున్న అమ్మాయికి వరుడు కావలెను అని పేపర్‌లో యాడ్ ఇచ్చారు. అదే ప్రకటనలో దయచేసి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు కాల్ చేయెద్దని స్పష్టం చేశారు. దీనిని వ్యాపారవేత్త సమీర్ అరోరా ట్విట్టర్‌లో షేర్ చేయగా నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

VIDEO: స్నేక్ బోట్ రేసులో రాహుల్ గాంధీ

VIDEO: స్నేక్ బోట్ రేసులో రాహుల్ గాంధీ

భారత్ జోడో యాత్రలో భాగంగా కేరళలో పర్యటిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పున్నమాడ లేక్‌లో నిర్వహించిన స్నేక్ బోట్ రేసులో పాల్గొన్నారు. ఈ రేసులో మూడు బోట్లు పాల్గొనగా.. రాహుల్ గాంధీ ఉన్న బోటే విజయం సాధించింది. ప్రస్తుతం ఈ రేసుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

రైలు వెంట పరుగెత్తి మరీ డెలివరీ

రైలు వెంట పరుగెత్తి మరీ డెలివరీ

మనం ఆర్డర్ చేసిన వస్తువులను, ఆహారాన్ని తగిన సమయానికి డెలివరీ చేయడానికి డెలివరీ బాయ్స్ పడే కష్టం అంతా ఇంతా కాదు. తాజాగా ఓ యువతి డంజోలో గ్రోసరీస్ ఆర్డర్ చేసింది. అప్పటికే సమయం దాటి పోవడంతో తాను వెళ్లే రైలు ఎక్కింది. రైలు కదులుతుండంతో డెలివరీ బాయ్ పరుగెత్తి మరీ డెలివరీ చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరలవుతోంది.

కింగ్ కోబ్రాతోనే ఆటలు.. షాకింగ్ వీడియో!

కింగ్ కోబ్రాతోనే ఆటలు.. షాకింగ్ వీడియో!

సాధారణంగా పాములను చూడగానే భయంతో పరుగుతీస్తుంటాము. కానీ ఒడిశాకు చెందిన ఆరిఫ్ మాత్రం కింగ్ కోబ్రాలను సైతం సింపుల్‌గా పట్టుకొని వాటితో ఆడుతుంటాడు. అంతేకాకుండా పాములతో విన్యాసాలు చేస్తూ వీడియోలు తీసి యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తుంటాడు. ఇటీవల బాలాసోర్‌లోని ఓ రైతు ఇంట్లోకి కింగ్ కోబ్రా చొరబడగా దానిని ఆరిఫ్ బంధించి దగ్గర్లోని అడవిలో వదిలిపెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరలవుతోంది.

యూట్యూబ్‌ యూజర్లకు బిగ్ షాక్‌

యూట్యూబ్‌ యూజర్లకు బిగ్ షాక్‌

యూట్యూబ్ యూజర్లకు షాకింగ్ న్యూస్ అందుతోంది. యూట్యూబ్‌ త్వరలో అన్‌ స్కిపబుల్‌ యాడ్స్‌ సంఖ్యను పెంచనుంది. యూట్యూబ్‌ ఫ్రీ వెర్షన్‌ వాడుతున్న యూజర్లకు వీడియో ప్రారంభంలో 5 యాడ్స్‌ రాబోతున్నాయి. త్వరలో రాబోతున్న అన్‌ స్కిపబుల్‌ యాడ్స్‌లో ఒక్కో యాడ్‌ 6 సెకన్లు ఉంటుందని యూట్యూబ్ వెల్లడించింది . అయితే ప్రీమియం యూజర్లకు మాత్రం ఎలాంటి యాడ్స్‌ ఉండవని స్పష్టం చేసింది.

Divorce ఆహ్వాన ప్రతిక చూశారా!

Divorce ఆహ్వాన ప్రతిక చూశారా!

ఇటీవల కాలంలో విడాకులు అనేవి సాధారణంగా మారిపోయాయి. తాజాగా విడాకులను కూడా సెలబ్రెట్‌ చేసుకుంటామంటూ సోషల్‌ మీడియాలో పెట్టిన ఇన్విటేషన్‌ తెగ వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌ శివారులోని బిల్ఖిరియాలోని రిసార్ట్‌లో సెప్టెంబర్ 18న ఈ కార్యక్రమం తలపెట్టారు. భాయి వెల్ఫేర్ సొసైటీ అనే ఎన్జీవో ఆధ్వర్యంలో ‘వివాహ రద్దు’ను వేడుకగా చేసుకోవాలని నిర్ణయించారు.

Viral Video: హృదయ విదారక దృశ్యం

Viral Video: హృదయ విదారక దృశ్యం

దేశంలో చాలామంది ఒకపూట అన్నం కోసం పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అలా వచ్చిన ఫుడ్.. ఒకవేళ వారికి నోటి దాకా అందకపోతే.. ఆ బాధ వర్ణనాతీతం. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. పైనుంచి కుండపోత వర్షం కురుస్తున్నప్పటికీ, ఓ వ్యక్తి స్కూటర్‌కు దగ్గరగా కూర్చుని భోజనం చేస్తున్నాడు. ఈవీడియో చూసి నెటిజన్లు బరువెక్కిన హృదయాలతో కామెంట్స్ చేస్తున్నారు.