shape

Lifestyle ChotaNews

చికెన్‌ను స్కిన్‌తో పాటు తింటున్నారా?

చికెన్‌ను స్కిన్‌తో పాటు తింటున్నారా?

చాలా మంది చికెన్‌ను స్కిన్‌తో తినడానికి ఇష్టపడుతుంటారు. చికెన్‌లో దాదాపు 32 శాతం కొవ్వు ఉంటుంది. ఆ 32 శాతం కొవ్వులో మూడింట రెండొంతులు అసంతృప్త కొవ్వు ఉంటుంది. ఇది రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ మెరుగుపడటంలో సహాయపడుతుంది. మిగిలిన మూడో వంతు సంతృప్త కొవ్వు చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగేలా చేస్తుంది. చికెన్‌ను స్కిన్‌తో తింటే 50 శాతం కెలోరీలను పెంచుతున్నట్లేనని నిపుణులు చెబుతున్నారు.

Video : పనస కోసం ఏనుగు కష్టం చూడండి

Video : పనస కోసం ఏనుగు కష్టం చూడండి

చెట్టుపై ఉన్న పనసపండు తినేందుకు ఓ ఏనుగు చేసిన పని అందరినీ ఆకట్టుకుంటోంది. పనసపండు చూసిన ఏనుగు తన తొండంతో అందుకోవాలని ప్రయత్నించింది. కానీ ఫలితం లేకపోవడంతో దాని రెండు కాళ్లు చెట్టుపై పెట్టి అతి కష్టం మీద అందుకుంది. ఐఏఎస్ అధికారి సుప్రియా సాహు వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. పనస కోసం ఏనుగు చేసిన ప్రయత్నాన్ని అభినందించాలని ఆమె అభిప్రాయపడ్డారు.

ఎర్ర చీమల చట్నీతో ఆరోగ్యం

ఎర్ర చీమల చట్నీతో ఆరోగ్యం

సాధారణంగా చీమలను చూస్తే ఎక్కడ కుడుతాయోనని బయపడుతుంటాము. కానీ ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో ఎర్రచీమలను చట్నీగా చేసుకొని మరీ తింటారు. ఈ చీమల చట్నీని చాప్ డా అని పిలుస్తారు. ఈ చట్నీ మన శరీరానికి మంచి ఔషధంగా పని చేస్తుందట. జ్వరం, దగ్గు, జలుబు, కీళ్ల నొప్పులు వంటి సమస్యల నుంచి ఉపశమనం కలగడానికి ఈ చట్నీ ఉపయోగపడుతుందట.

ఎడమ వైపు తిరిగి పడుకుంటే ఎన్ని లాభాలో

ఎడమ వైపు తిరిగి పడుకుంటే ఎన్ని లాభాలో

ఎడమ వైపు తిరిగి పడుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలని నిపుణులు చెబుతున్నారు. ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ బాగా పని చేస్తుంది. రోగ నిరోధకతను బలోపేతం చేసే శోషరస వ్యవస్థ ఉత్తేజితం అవుతుంది. రక్త ప్రసరణ సులభం అవుతుంది. ఎడమవైపు పడుకోవడం వల్ల వెన్నెముక మీద ఒత్తిడి తగ్గి, నిద్ర బాగా పడుతుంది. శ్వాస వ్యవస్థ చక్కగా పని చేస్తుంది.

ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా 'మాష్రూమ్ మిక్స్'

ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా 'మాష్రూమ్ మిక్స్'

ప్లాస్టిక్‌ ప్యాకేజింగ్ ప్రజల ఆరోగ్యానికి పెద్ద ముప్పుగా మారింది. దీనికి చెక్‌ పెట్టేందుకు లండన్‌కు చెందిన మ్యాజికల్ మష్రూమ్ కంపెనీ ప్రయత్నిస్తోంది. ఈకో ఫ్రెండ్లీ ప్యాకేజింగ్‌తో ప్లాస్టిక్ ప్యాకేజింగ్‌ను భర్తీ చేసే పనిలో పడింది. వ్యవసాయ వ్యర్థాలను పుట్టగొడుగుల రూట్ స్ట్రక్చర్‌తో మిక్స్ చేసి ప్లాస్టిక్‌కు ఆల్టర్నేటివ్‌ను రూపొందిస్తోంది. ఈ మెటీరియల్ 45 రోజుల్లో సహజంగా విచ్ఛిన్నమవుతుంది. దీంతో పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదు.

'థండర్‌ మష్రూమ్స్‌' ఎందుకంత స్పెషల్?

'థండర్‌ మష్రూమ్స్‌' ఎందుకంత స్పెషల్?

మన దేశంలో నాలుగు ప్రాంతాల్లో మాత్రమే థండర్‌ మష్రూమ్స్‌ దొరుకుతాయి. అది కూడా ఉరుములు, మెరుపుతో కూడిన వర్షాలు పడే సమయాల్లోనే. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, వెస్ట్‌బెంగాల్ అటవీ ప్రాంతాల్లో, కర్ణాటకలోని తుళునాడులో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడ్డప్పుడు ఈ మష్రూమ్స్ పుడతాయి. గులకరాళ్లలా, చిన్నచిన్నగా ఈ మష్రూమ్స్ ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో థండర్‌ మష్రూమ్స్‌ అడుగులోతు మట్టిలో కూరుకుపోయి ఉంటాయి.

జ‌లుబుతో ముక్కు మూసుకుపోయిందా?

జ‌లుబుతో ముక్కు మూసుకుపోయిందా?

కొన్నిసార్లు దగ్గు, జలుబు, సైనస్‌ కారణంగా ముక్కు మూసుకుపోతుంది. ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు కొన్ని వంటింటి చిట్కాలు పాటిస్తే సరి. ఆవాల నూనెను వాసన చూడండి. ముక్కు దగ్గర ఆవాల నూనెతో మర్దనా చేస్తే.. ఆ ఘాటుకు ముక్కులోని శ్లేష్మం బయటికి వస్తుంది. యూకలిప్టస్‌ పూలను వేడినీటిలో వేసి, ఆవిరి పడితే త్వరగా ఉపశమనం లభిస్తుంది. ఉల్లిపాయను దంచి వాసన చూడండి.

నవ్వులు పూయించడంలో సౌతిండియన్లే ముందు!

నవ్వులు పూయించడంలో సౌతిండియన్లే ముందు!

ఆఫీసుల్లో జోకులు వేయడంలో, వర్క్ ప్లేస్‌ను ఆహ్లాదంగా మార్చుకోవడంలో సౌతిండియన్లే ముందు వరుసలో ఉంటారట. సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం లింక్డిన్ చేసిన అధ్యయనంలో వర్క్ ప్లేస్‌‌లో ఒత్తిడి లేకుండా పనిచేసుకుంటూనే నవ్వులు పూయించడంలో సౌతిండియన్లు ముందుంటారని తేలింది. ఆ తర్వాత పశ్చిమ, ఈశాన్య, ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారు తర్వాతి స్థానాల్లో ఉన్నారని లింక్డిన్ వెల్లడించింది.

ఎల్‌జీ రోలబుల్‌ టీవీ ధర రూ.75 లక్షలు!

ఎల్‌జీ రోలబుల్‌ టీవీ ధర రూ.75 లక్షలు!

ప్రపంచంలో మొట్టమొదటి రోలబుల్‌ ఓఎల్‌ఈడీ టీ4వీని ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ ఇండియా అందుబాటులోకి తీసుకువచ్చింది. 65 అంగుళాలు ఉండే ‘ఎల్‌జీ సిగ్నేచర్‌ ఓఎల్‌ఈడీ ఆర్‌’ టీవీ ధర రూ.75 లక్షలు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో ఉన్న ‘ఆడియో అండ్‌ బియాండ్‌’లో విక్రయిస్తున్నారు. టీవీ అవసరమైనప్పుడు బయటకు వచ్చి.. తర్వాత రోలవుతూ లోనికి వెళుతుంది. నగరాల్లోని ధనిక వర్గాల లైఫ్‌స్టైల్‌కు అనుగుణంగా దీన్ని రూపొందించినట్లు ఎల్‌జీ హోమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అధిపతి గిరీశన్‌ గోపి తెలిపారు.

గర్భవతులు నోటి శుభ్రతను పాటిస్తున్నారా?

గర్భవతులు నోటి శుభ్రతను పాటిస్తున్నారా?

గర్భవతులు నోటి శుభ్రతకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలి. లేదంటే ‘ప్రెగ్నెన్సీ జింజివైటిస్‌’ అనే చిగుర్ల వ్యాధి వచ్చే అవకాశం ఉందట. రెండో నెలలోనే ఈ వ్యాధి లక్షణాలైన చిగుళ్ల వాపు, నోటిలో పుండ్లు, గడ్డలు వంటివి బయటపడతాయి. ఈ వ్యాధి కారణంగా నోటిలోని హానికరమైన బ్యాక్టీరియా పిండం వద్దకు చేరి ప్రీ- మెచ్యూర్ డెలివరీ, తక్కువ బరువుతో పిల్లలు పుట్టేలా ప్రభావితం చేస్తోందని పలు పరిశోధనల్లో వెల్లడైంది.

స్మార్ట్ గాగుల్స్ ...అదుర్స్!

స్మార్ట్ గాగుల్స్ ...అదుర్స్!

స్మార్ట్‌‌వాచెస్‌కి తోడుగా స్మార్ట్‌ గాగుల్స్‌ కూడా రంగంలోకి దిగాయి. ఇండియాకి చెందిన నాయిస్‌ సంస్థ తొలిసారిగా స్మార్ట్‌ గ్లాసెస్‌ని ఐ వేర్‌ ఐ1 పేరుతో రిలీజ్‌ చేసింది. లెటెస్ట్‌ టెక్నాలజీతో ఇవి స్మార్ట్‌ఫోన్‌తో అనుసంధానం అవుతాయి. ఫోన్‌తో సంబంధం లేకుండానే కాల్స్‌ను ఆపరేట్‌ చేసుకునే వీలుంది. బ్లూటూత్‌ 5.0 ద్వారా మొబైల్‌తో కనెక్ట్‌ అవుతాయి. దీంతో ఇయర్‌ఫోన్స్‌ లేకుండా సౌకర్యవంతంగా కాల్స్‌ను మాట్లాడుకునే వీలుంది. చక్కని మ్యూజిక్‌ కూడా వినొచ్చు.

బీచ్‌లో భర్తకు అనసూయ లిప్‌లాక్!

బీచ్‌లో భర్తకు అనసూయ లిప్‌లాక్!

సినిమాలు,యాంకరింగ్‌తోపాటు సోషల్‌‌మీడియాలో కూడా ఫుల్‌‌యాక్టివ్‌గా ఉంటుంది అనసూయ. గ్లామరస్‌ ఫొటోలతోపాటు కుటుంబంతో ఆడిపాడే క్షణాలను రంగమ్మత్త పోస్ట్‌ల రూపంలో పంచుకుంటుంది. తాజాగా తనభర్త సుశాంక్‌ భరద్వాజ్‌‌తో బీచ్‌లో సందడి చేసిన వీడియోను షేర్‌ చేసింది. అనసూయ, సుశాంక్‌ ఒకరినొకరు ప్రేమగా హత్తుకుని, లిప్‌లాక్‌, రొమాంటిక్‌ ఫొజులతో ఈ వీడియో నిండిపోయింది. తమ 12వ వెడ్డింగ్‌ యాన్నివర్సరీ సందర్భంగా భర్తతో పకృతి ఒడిలో సముద్రం ఒడ్డున నీటి అలల మధ్య గడిపింది.