shape

Andhra Pradesh ChotaNews

Blog Image

హరీశ్‌రావుకు బొత్స కౌంటర్

ఉపాధ్యాయుల పట్ల ఏపీ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోందంటూ తెలంగాణ మంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ‘‘హరీశ్‌రావు గారూ.. ఒక్కసారి ఏపీకి వచ్చి చూడండి. ఏపీలో ఉపాధ్యాయులందరూ ఎంత సంతోషంగా ఉన్నారో తెలుస్తుంది. ఏపీ, తెలంగాణ పీఆర్‌సీల్లో తేడా చూస్తే మీకే అర్థమవుతుంది’’ అని బొత్స కౌంటర్ ఇచ్చారు.

Blog Image

వాటి ఆధారంగా కలెక్టర్లకు మార్కులు: సీఎం

స్పందన కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. వర్చువల్‌గా జరిగిన ఈ సమావేశంలో నెలరోజుల్లో గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రధాన్యత పనులు చేయాలని, ఉపాధి హామీ కింద కనీస వేతనం రూ.240 అందేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఎస్‌డీఐ లక్ష్యాల సాధన ఆధారంగా కలెక్టర్లకు మార్కులు ఇస్తామన్నారు. ఎస్‌డీఐ లక్ష్యాలే కలెక్టర్ల పనితీరుకు ప్రామాణికమన్నారు.

Blog Image

శ్రీశైలంలో కులసత్రాలన్నీ దేవస్థానానివే: మంత్రి

శ్రీశైలంలోని కుల సత్రాలన్నింటినీ దేవస్థానం పరిధిలోకి తెస్తామని ఏపీ దేవదాయ శాఖా మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. రూముల కేటాయింపులు, సత్రాల సేవలపై దేవస్థానం పర్యవేక్షణ ఉండేలా ఓ విధానం తీసుకొస్తామన్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వపరంగా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించి కార్యాచరణ ప్రకటించనున్నట్లు మంత్రి తెలిపారు.

Blog Image

‘పోలవరం కట్టినా, కట్టక పోయినా తేడా ఉండదు’

పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంపై అధ్యయనం చేయిస్తామని కేంద్ర జలశక్తి శాఖ తెలిపింది. పోలవరం కట్టినా, కట్టక పోయినా వరద ముంపులో తేడా ఉండదని తెలిపింది. వచ్చే నెల 7న నాలుగు రాష్ట్రాల సాంకేతిక నిపుణులతో సమావేశం జరుపుతామని, అందులో నిపుణులు ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

Blog Image

మద్యపాన నిషేధం ఏదీ?: నక్కా

ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన సంపూర్ణ మద్యపాన నిషేధ హామీ ఏమైందని టీడీపీ సీనియర్ నేత నక్కా ఆనంద్‌బాబు ప్రశ్నించారు. రాష్ట్రంలో డిస్టలరీలను బలవంతంగా ఆక్రమించి ప్రభుత్వం సొంత బ్రాండ్లను ప్రజలపై రుద్దుతోందన్నారు. ముఖ్యమంత్రే తన అనుచరులతో మద్యం అమ్మిస్తున్న రాష్ట్రం మనదేనని ఎద్దేవా చేశారు. నమ్మి ఓట్లు వేసిన మహిళలను సీఎం జగన్ వంచించారన్నారు.

Blog Image

హైకోర్టులో ఏపీ సర్కార్‌కు ఎదురుదెబ్బ

AP: స్త్రీ శిశు సంక్షేమశాఖలో విస్తరణ అధికారుల ఉద్యోగ నియామకాల్లో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. విస్తరణ అధికారుల నియామకాలపై హైకోర్టు స్టే విధించింది. 560 మంది విస్తరణ అధికారుల నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్‌లో అవకతవకలు జరిగాయని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఒక్కో విస్తరణ అధికారి నియామకానికి రూ. పది లక్షలు వసూలు చేసినట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు.

Blog Image

స్మృతివనానికి రెండెకరాల స్థలం

రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతి తీరని లోటని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. ఆయన ప్రజల హృదయాల్లో సుస్థిరస్థానం సంపాదించుకున్నారని చెప్పారు. కృష్ణంరాజు పేరిట స్మృతివనం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రెండు ఎకరాల స్థలాన్ని కేటాయిస్తుందని మంత్రి వెల్లడించారు. మొగల్తూరులో జరిగిన కృష్ణంరాజు సంస్మరణ సభకు ఆయన హాజరయ్యారు.

Blog Image

మా లక్ష్యం అదే: మంత్రి పెద్దిరెడ్డి

ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయానికి నాణ్యమైన కరెంట్ ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇప్పటి వరకు 41 వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చామని, మరో 77 వేల కనెక్షన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. 2023 మార్చి నాటికి వందశాతం వ్యవసాయ కనెక్షన్‌లకు స్మార్ట్ మీటర్లు బిగిస్తామని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు.

Blog Image

స్మార్ట్‌ మీటర్లపై అపోహలొద్దు: పెద్దిరెడ్డి

AP: వ్యవసాయ బావుల వద్ద స్మార్ట్ మీటర్ల ఏర్పాటుపై ఎలాంటి అపోహలొద్దని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. స్మార్ట్ మీటర్ల వల్ల రైతులు నష్టపోయేది ఏమీ లేదన్నారు. వీటి ఏర్పాటు వల్ల 30శాతం మేర సబ్సిడీ చెల్లింపులో ప్రభుత్వానికి ఆదా అవుతోందని, పైలట్ ప్రాజెక్టుగా చేసిన శ్రీకాకుళం జిల్లాలో ఇది నిరూపితమైందని తెలిపారు. స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటుపై విపక్షాలు అపోహలు సృష్టిస్తున్నాయని మండిపడ్డారు.

Blog Image

ఇల్లు కట్టుకున్నారు.. రాజధానిని మరిచారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకపోవడం విచారకరమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. గతంలో సీఎంలు వివిధ పేర్లతో రూ.7 కోట్లు ఖర్చుచేశారని ఆయన గుర్తు చేశారు. సీఎం జగన్ సొంత ఇల్లు కట్టుకున్నారు కానీ రాజధాని కట్టలేదని విమర్శించారు. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించడం తప్పుడు చర్య అన్నారు. ప్రజల కష్టాల్ని దోచుకొని పథకాల పేరుతో తిరిగి ఇస్తున్నారన్నారు.

Blog Image

వైసీపీ ప్రభుత్వంపై అచ్చెన్న ఫైర్

టీడీపీ నేత అచ్చెన్నాయుడు వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. కనీస సమాచారం ఇవ్వకుండా బీసీల అభ్యుదయ సారధి బిపి మండల్ విగ్రహ దిమ్మె కూల్చివేయడం సిగ్గుచేటన్నారు. సీఎం అహంకారానికి బీసీలేే సమాధి కట్టబోతున్నారని అన్నారు. బిపి మండల్ విగ్రహ దిమ్మె కూల్చివేతతో బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలను జగన్ రెడ్డి అవమానించారని మండిపడ్డారు.

Blog Image

'సరైన సమయంలో జగన్‌కు చెక్’

AP: కడప జిల్లా యర్రగుంట్లలో బీజేపీ చేపట్టిన ప్రజాపోరులో పాల్గొన్న మాజీ మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసు బలంతో ప్రత్యర్థుల మీద అక్రమ కేసులు పెడుతున్న జగన్‌కు.. కేంద్రం స‌రైన స‌మ‌యంలో చెక్ పెడుతుంద‌న్నారు. వివేకా హ‌త్య కేసులో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కింగ్ పిన్ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందని.. త్వరలోనే ఈ కేసులో జగన్ బండారం బయటపడుతుందన్నారు.

Blog Image

జనామోదంతో వారసులూ రావొచ్చు: బొత్స

ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.‘‘రాజకీయాల్లో ఎవరైనా వారసుల్ని దింపొచ్చు, కానీ ప్రజలు ఆమోదించాలి. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాలూ గెలవాలనుకోవటం అత్యాశ కాదు. ఒకటి పోయినా పర్వాలేదనుకుంటే క్షేత్రస్థాయిలో అది.. పది అవుతుంది. రాజకీయాల్లో ఏ రాజకీయ పార్టీకైనా అంతిమ లక్ష్యం గెలుపు’’ అని అన్నారు.

Blog Image

పేరు మార్పుపై దేవినేని ఉమ నిరసన

హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు మార్పుపై మాజీ మంత్రి దేవినేని ఉమ నిరసన దీక్ష చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లాలోని రెడ్డిగూడెంలో నిరసన దీక్షకు దిగిన ఆయన.. కుట్రపూరితంగానే ఎన్టీఆర్ పేరు తొలగించారని మండిపడ్డారు. జగన్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే తుగ్లక్ పనులు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు వైసీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారన్నారు.