shape

Telangana ChotaNews

Blog Image

పాత సామన్ల పేరుతో హవాలా వ్యాపారం

TS: హైదరాబాద్‌లో రూ. 1.24 కోట్ల హవాలా డబ్బును పోలీసులు పట్టుకున్నారు. మాసబ్‌ట్యాంక్‌ పరిధిలో షోయబ్‌ అనే వ్యక్తి వద్ద ఈ డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌‌లోని మీరట్‌‌ నుంచి షోయబ్‌ హైదరాబాద్‌ వచ్చి పాత సామాను సేకరించే వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు. బంధువు కామిల్‌ సూచన మేరకు హవాలా డబ్బు తీసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

Blog Image

జైలు నుంచి మాజీ సీఐ విడుదల

HYD: చర్లపల్లి జైలు నుంచి మాజీ సీఐ నాగేశ్వరరావు విడుదల అయ్యారు. హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో ఆయన ఇవాళ జైలు నుంచి బయటకు వచ్చారు. ఓ వివాహితపై అత్యాచారం, కిడ్నాప్ కేసులో చర్లపల్లి సెంట్రల్ జైలులో నాగేశ్వరరావు అండర్ ట్రైల్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.

Blog Image

ఆర్ఐని చితకబాదిన జనం

ముషీరాబాద్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ముషీరాబాద్ ఆర్ఐ విజయ్‌ని స్థానికులు చితకొట్టారు. సర్టిఫికెట్ కోసం ఓ యువతి తన తల్లిదండ్రులతో కలిసి వెళ్లింది. సర్టిఫికెట్ కావాలంటే ఒంటరిగా రావాలని ఆ యువతి తల్లిదండ్రుల ముందే ఆర్ఐ అన్నాడు. దీంతో ఎంఆర్ఓ ఎదుటే ఆర్ఐ విజయ్‌ను స్థానికులు, యువతి తల్లిదండ్రులు చితకబాదారు. సమాచారమందుకున్న గాంధీనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు.

Blog Image

పబ్‌లో చిన్నారితో డ్యాన్స్..!

హైదరాబాద్‌లో పబ్‌ల తీరు మారడం లేదు. హై కోర్టు ఆదేశాలు జారీ చేసినా చిన్న కదలిక కూడా రావడం లేదు. తాజాగా రోస్ట్ అండ్ టోస్ట్ పబ్‌ నిర్వహకులు 8 ఏళ్ల చిన్నారిని పబ్‌లోకి అనుమతించి ఆ చిన్నారితో డ్యాన్స్ చేయించారు. సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర పబ్ నిర్వహకులను హెచ్చరించన రోజే ఈ ఘటన జరిగడం గమనార్హం.

Blog Image

ట్యాంక్‌బండ్‌పై గిరిజన నేతల ఆందోళన

గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ల జీవో ఇవ్వాలంటూ గిరిజన నేతలు హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద డిమాండ్ చేశారు. ‘వారంలో జీవో ఇస్తానన్న సీఎం గారూ.. మా జీవో ఎక్కడ’ అంటూ నినాదాలు చేశారు. రిజర్వేషన్ల అమలు లోపంతో పలువురు గిరిజన విద్యార్థులు,ఉద్యోగులు నష్టపోతున్నారని వాపోయారు. తక్షణం జీవో విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

Blog Image

హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం

హైదరాబాద్‌లోని ఎల్బీనగర్, ఉప్పల్, హయత్‌నగర్, మలక్‌పేట్, దిల్‌సుఖ్‌నగర్, సికింద్రాబాద్, ఖైరతాబాద్, లక్డీకాపూల్, తార్నాక, నాగోల్, పంజాగుట్ట ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో 2 గంటల్లో నగరంలో భారీ వర్షం పడే ప్రమాదం ఉందని, ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావొద్దని అధికారులు సూచించారు.

Blog Image

హోం మంత్రితో బిర్యానీ పంచాయితీ

హైదరాబాద్‌లోని పాతబస్తీలో బిర్యానీ కోసం పెద్ద వివాదమే జరిగింది. ఓ వ్యక్తి అర్ధరాత్రి హోంమంత్రి మహమూద్ అలీకి ఫోన్‌ చేశాడు. ఏదైనా సీరియస్ విషయమై ఉంటుందని మంత్రి స్పందించారు. ఫోన్ చేసిన వ్యక్తి బిర్యానీ హోటళ్లు ఎంత వరకు తెరచి ఉంచాలో చెప్పాలని కోరాడు. ఇలాంటి విషయాలకు తనకు ఫోన్ చేయడం ఏంటని హోం మంత్రి అసహనం వ్యక్తం చేశారు.

Blog Image

మహేష్ బాబు ఇంట్లో చోరీకి యత్నం

సినీ నటుడు మహేష్ బాబు ఇంటిలో ఓ దుండగుడు చోరీకి ప్రయత్నించాడు. మంగళవారం రాత్రి మహేష్ బాబు ఇంటి గోడ దూకి లోపలికి ప్రవేశించాడు. గోడ ఎత్తు 30 అడుగులు ఉండడంతో అతడికి తీవ్రగాయాలయ్యాయి. అక్కడి సిబ్బంది దొంగని పట్టుకుని జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించగా, చికిత్స కోసం ఉస్మానియా అసుపత్రికి తరలించారు. నిందితుడు ఒడిశా వాసిగా గుర్తించారు.

Blog Image

మేడ్చల్ హైవేపై ప్రమాదం

హైదరాబాద్‌లోని మేడ్చల్ రహదారిపై ప్రమాదం జరిగింది. వివేకానంద విగ్రహం వద్ద లారీని స్కూటీ ఢీకొట్టింది . ఈ ప్రమాదంలో మేడ్చల్‌కు చెందిన మోర్ ప్రియ అనే మహిళ దుర్మరణం చెందింది. మృతురాలు కండ్లకోయ రిలయన్స్ కంపెనీలో విధులకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

Blog Image

HYDలో దంచికొడుతున్న వాన

HYD: నగరంలో మరోసారి వాన దంచికొడుతోంది. హ‌య‌త్‌న‌గ‌ర్‌, పెద్ద అంబ‌ర్‌పేట్, స‌రూర్‌న‌గ‌ర్, చంపాపేట్, సైదాబాద్, వ‌నస్థ‌లిపురం, ఎల్బీన‌గ‌ర్‌, నాగోల్‌లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడుతోంది. ప‌లు చోట్ల రోడ్ల‌పై వ‌ర్ష‌పు నీరు నిలిచిపోవ‌డంతో వాహ‌న‌దారులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. మ‌రో రెండు గంట‌ల పాటు వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని, అవ‌స‌ర‌మైతేనే ప్ర‌జ‌లు నివాసాల నుంచి బ‌య‌ట‌కు రావాల‌ని అధికారులు సూచించారు.

Blog Image

అక్టోబ‌ర్ 1న బోనస్ చెల్లిస్తాం: శ్రీధర్

హైద‌రాబాద్: సింగ‌రేణి కార్మికుల‌కు అక్టోబ‌ర్ 1న ద‌స‌రా బోన‌స్ చెల్లిస్తామ‌ని సీఎండీ శ్రీధ‌ర్ వెల్ల‌డించారు. 2021-22లో సింగ‌రేణి మొత్తం ట‌ర్నోవ‌ర్ రూ.26,607 కోట్లు అని తెలిపారు. సింగ‌రేణి నిక‌ర లాభాలు రూ.1,227 కోట్లు అని సీఎండీ పేర్కొన్నారు. లాభాల్లో బోన‌స్‌గా కార్మికుల‌కు రూ.368 కోట్లు కేటాయిస్తున్న‌ట్లు సీఎండీ శ్రీధ‌ర్ తెలిపారు. సింగ‌రేణి కార్మికుల‌కు సీఎం కేసీఆర్ ద‌స‌రా కానుక ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

Blog Image

చంచల్‌గూడకు నయీం అనుచరుడు శేషన్న

గ్యాంగ్ స్టర్ నయీం ప్రధాన అనుచరుడు శేషన్నకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. శేషన్నను చంచల్‌గూడ జైలుకు తరలించాలని ఆదేశించింది. శేషన్నపై హత్యకేసుతో పాటు ఆయుధాల చట్టం కింద కేసులు నమోదు అయ్యాయి. షేక్‌పేటలో నిన్న వాహనాలు తనిఖీలు చేస్తుండగా శేషన్న పోలీసులకు చిక్కాడు. అతనిపై మొత్తం ఆరు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Blog Image

కేబుల్ బ్రిడ్జిపై షాకింగ్ ఘటన

HYD: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పర్యాటకంగానే కాదు.. ఆత్మహత్యలకు స్పాట్‌గా మారింది. తాజాగా ఓ యువతి తన బ్యాగు, చెప్పులను బ్రిడ్జిపై వదిలేసి చెరువులోకి దూకింది. పోలీసులు స్పీడ్ బోట్ సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. యువతి బ్యాగ్‌లో కేర్ ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకున్న రిపోర్టులు లభ్యమయ్యాయి. అనారోగ్యం కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Blog Image

‘ప్రాణదాత చింతచెట్టు’ కింద స్మారకసభ

HYDలో మూసీ వరదలు సంభవించి సరిగ్గా నేటితో 114 ఏళ్లు. 1908 సెప్టెంబర్ 28న వరదలు వచ్చిన సమయంలో ఉస్మానియా ఆసుపత్రిలోని చింత చెట్టు 150 మంది ప్రాణాలను కాపాడింది. ఆ చెట్టుకు ‘ప్రాణదాత చింతచెట్టు’ అని పేరు పెట్టారు. ఇవాళ ఫోరమ్ ఫర్ బెటర్ హైదరాబాద్ సొసైటీ ఆధ్వర్యంలో ఆ చెట్టు కింద వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి స్మారకసభ నిర్వహించారు.

Blog Image

భార్య నుంచి కాపాడండి!

హైదరాబాద్: తన భార్య నుంచి ప్రాణహాని ఉందని నల్గొండ జిల్లా బొత్తలపాలెంకు చెందిన నిమ్మల రవీందర్ అనే వ్యక్తి మానవ హక్కుల కమిషన్‌కు(హెచ్ఆర్‌సీ) ఫిర్యాదుచేశాడు. రవీందర్‌కు స్వరూప అనే మహిళతో 2010లో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే ఆస్తికోసం తనను చంపాలని పలుమార్లు యత్నించిందని, ఇటీవలే 498ఏ కేసుపెట్టి వేధిస్తున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. భార్య నుంచి రక్షించాలని రవీందర్ వేడుకున్నాడు.