shape

National ChotaNews

Blog Image

గాంధీలు లేని కాంగ్రెస్‌ శూన్యం: దిగ్విజయ్

కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్న దిగ్విజయ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘చాలాసార్లు పార్టీలో చీలికలు వచ్చాయి. అయితే 99 శాతం మంది కాంగ్రెస్‌ వాదులు నెహ్రూ-గాంధీ కుటుంబీకులను సమర్థించారు. నెహ్రూ-గాంధీ కుటుంబం లేకుండా కాంగ్రెస్‌కు గుర్తింపే లేదు. రాజస్థాన్‌లో తలెత్తిన దురదృష్టకర పరిస్థితులతో అశోక్‌ గెహ్లాట్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం లేదు’’ అని తెలిపారు.

Blog Image

కోడి ఈకలతో కోట్లల్లో ఆదాయం

కోడి ఈకలతో కోట్లలో లాభాలు వస్తున్నాయి. రాజస్థాన్‌‌లోని జైపూర్‌కు చెందిన ముదిత, రాధేష్ అనే దంపతులు 2010లో కోడి ఈకలతో దుస్తులు తయారు చేయడం ప్రారంభించారు. మొదట వాళ్లను చూసి నవ్విన వారే.. ఇప్పుడు వాళ్ల సక్సెస్‌ చూసి షాక్ అవుతున్నారు. ప్రస్తుతం వాళ్ల వార్షిక టర్నోవర్ 2.5 కోట్లుగా ఉంది. దాదాపు 1,200 మందికి ఉపాధి కల్పిస్తున్నారు.

Blog Image

‘భారత్‌ ఇస్లామిక్ దేశంగా మార్చే కుట్ర’

భారత్‌ను ఇస్లామిక్ దేశంగా మార్చేందుకు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కుట్రలు చేసిందని మహారాష్ట్ర యాంటి టెర్రరిజయ్ స్క్వాడ్ చీఫ్ వినీత్ అగర్వాల్ తెలిపారు. పీఎఫ్ఐ భారత్‌కు స్లో పాయిజన్ వంటిదన్నారు. దానిపై నిషేధం విధించడం మంచి నిర్ణయమని చెప్పారు. లేదంటే 2047 కల్లా దేశంలో పరిస్థితులు మరోలా ఉండేవని చెప్పారు.

Blog Image

హ్యాట్సాఫ్‌: ఫ్రీ అంటే ఒప్పుకోని బామ్మ!

తమిళనాడు ప్రభుత్వం ఆర్డినరీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించేందుకు వీలు కల్పించింది. అయితే కోయంబత్తూరులో ఓ వృద్ధురాలు మాత్రం బస్సులో ఉచిత ప్రయాణం చేయనని, తనకు టికెట్‌ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టింది. దీంతో కండక్టర్ చేసేదేమీ లేక టికెట్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ హ్యాట్సాఫ్‌ బామ్మ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Blog Image

పాదయాత్రకు ఆదరణ.. పోస్టర్ల చించివేత!

కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన ‘భారత్‌ జోడో పాదయాత్ర’ శుక్రవారం కర్ణాటకలోకి ప్రవేశించనుంది. ఈ నేపథ్యంలో రాహుల్‌కు ఆహ్వానం పలుకుతూ కర్ణాటకలోని చామరాజనగర్‌ జిల్లాలో ఏర్పాటు చేసిన పోస్టర్లను చించివేయడం కలకలం రేపింది. ఇది బీజేపీ సర్కార్ పనేనని కాంగ్రెస్‌ ఆరోపించింది. ‘భారత్ జోడో యాత్ర’కు వస్తున్న ఆదరణను తట్టుకోలేకే ఇలాంటి దుశ్చర్యలకు దిగుతున్నారని విమర్శించారు.

Blog Image

గెహ్లాట్ వెనకడుగుపై బీజేపీ కామెంట్

కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి పోటీ నుంచి వెనకడుగు వేస్తున్నట్లు అశోక్‌ గెహ్లాట్ ప్రకటించడంపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. గెహ్లాట్‌ను సంపూర్ణ రాజకీయనాయకుడిగా అభివర్ణిస్తూ.. ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవడానికి ‘రబ్బరు స్టాంపు’ పదవిని వదులుకున్నారని ఎద్దేవా చేశారు. సీఎం పదవి ఆశించిన సచిన్‌పైలట్‌‌కు అధిష్ఠానం మళ్లీ ‘చెక్‌’ పెట్టిందన్నారు. వచ్చేసారి రాజస్థాన్‌లో తామే అధికారంలోకి వస్తామని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేశారు.

Blog Image

పేద జనాభా ఉన్న ధనిక దేశం మనది: గడ్కరీ

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘భారత్ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం. 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం. అయినప్పటికీ ఆకలి చావులు, నిరుద్యోగం, పేదరికం, కులతత్వం, అంటరానితనం వంటి సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి’’ అని వ్యాఖ్యానించారు. భారత్ పేద జనాభా ఉన్న ధనిక దేశమని అభిప్రాయపడ్డారు.

Blog Image

ఫ్లోరిడాలో భయానకంగా హరికేన్

అట్లాంటిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఇయన్ హరికేన్ అమెరికాను అతలాకుతలం చేస్తోంది. ఫ్లోరిడాలో పరిస్థితి భయానకంగా మారింది. పలు ప్రాంతాల్లో పెనుగాలులకు ఇళ్లు కొట్టుకుపోయాయి. వీధులు, షాపింగ్ మాల్స్‌లోకి సొరచేపలు రావడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రజలు మరో 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని అక్కడి అధికారులు సూచించారు.

Blog Image

మలేరియా వ్యాక్సిన్ ఎగుమతులకు గ్రీన్ సిగ్నల్

దేశంలో ఉత్పత్తి చేసిన మలేరియా వ్యాక్సిన్‌ను యూకే‌కు ఎగుమతి చేసేందుకు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా(DCGI) అనుమతులిచ్చింది. యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫోర్డ్ శాస్త్రవేత్తల సహకారంతో సీరం సంస్థ అభివృద్ది చేసిన మలేరియా వ్యాక్సిన్‌కు డీసీజీఐ అనుమతించిందని కేంద్ర అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 27న సీరం డైరెక్టర్ ప్రకాష్ కుమార్ అనుమతులు కోరిన తర్వాత ఈ నిర్ణయం వచ్చిందని తెలిపారు.

Blog Image

అత్యాచార బాధితులకు ఆ పరీక్ష చేయండి: DCW

ఢిల్లీ మహిళా కమిషన్ రాజధానిలో ఉన్న ఆసుపత్రులకు కీలక సూచనలు జారీ చేసింది. అత్యాచార బాధితులకు తప్పనిసరిగా హెచ్ఐవీ టెస్ట్ చేయాలని సూచించింది. అలాగే అత్యాచారానికి గురైన మహిళలు మూడు/ఆరు నెలలకోసారి ఆసుపత్రికి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకునేలా ప్రత్యేక చొరవ చూపించాలని తెలిపింది. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వ ఆరోగ్య విభాగానికి నోటీసులు పంపించింది.

Blog Image

కాంగ్రెస్ శ్రేణులకు అధిష్ఠానం వార్నింగ్

ఓ వైపు కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాలని రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తుంటే.. మరోవైపు పలు రాష్ట్రాల్లో పార్టీలో అంతర్గత తగాదాలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ అంతర్గత విషయాలు బహిరంగంగా చెప్పడం మానుకోవాలని నేతలకు సూచించింది. ఇకపై పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Blog Image

‘కండోమ్‌’ వ్యాఖ్యలపై సీఎం సీరియస్‌

‘ఫ్రీగా వస్తే కండోములు కూడా అడుగుతారేమో’ అని శానిటరీ పాడ్‌లపై ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు ఐఏఎస్‌ అధికారి హర్‍జోత్‌ కౌర్‌ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి. ఆమె వ్యాఖ్యలను నితీశ్ సర్కార్ సీరియస్‌గా తీసుకుంది. ఆమె వ్యాఖ్యలపై దర్యాప్తు చేపట్టేందుకు ఆదేశాలు జారీ అయ్యాయని సీఎం నితీశ్‌కుమార్ వెల్లడించారు. మరోవైపు తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెబుతున్నట్లు హర్‌జోత్ కౌర్ లేఖ విడుదల చేశారు.

Blog Image

ఎన్నికల వేళ కేంద్రం కీలక నిర్ణయం

గుజరాత్‌, హిమాచల్‌‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 22వ విడత ఎలక్ట్రోరల్‌ బాండ్ల విక్రయాలు అక్టోబర్‌ 1నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. SBIకు చెందిన 29 శాఖల్లో అక్టోబర్‌ 10 వరకు ఈ బాండ్లను కొనుగోలు చేయొచ్చని పేర్కొంది. పార్టీలకు చెల్లించే నిధుల్లో పారదర్శకత ఉండాలనే ఉద్దేశంతో 2018లో మోదీ ప్రభుత్వం ఎలక్ట్రోరల్ బాండ్లను ప్రవేశపెట్టింది.

Blog Image

సూరత్‌పై ఆధారపడని రాష్ట్రమే లేదు: మోదీ

ఐకమత్యానికి, ప్రజల భాగస్వామ్యానికి సూరత్ నగరం అద్భుతమైన ఉదాహరణ అని ప్రధాని మోదీ అన్నారు. రెండు రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా ఇవాళ సూరత్ చేరుకున్న మోదీ రూ. 3400 కోట్లతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. శ్రమను గౌరవించే నగరం సూరత్ అని, సూరత్‌పై ఆధారపడని రాష్ట్రాలు దేశంలో ఉండవని తెలిపారు.

Blog Image

ముకేశ్ అంబానీకి భద్రత పెంపు

ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీకి భద్రతను పెంచుతూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. జెడ్ కేటగిరీ నుంచి జడ్ ప్లస్ కేటగిరీకి భద్రతను పెంచింది. ఇకపై ముకేశ్ అంబానీకి 55 మంది సిబ్బంది భద్రత కల్పించనున్నారు. నిఘా సంస్థలు ఇచ్చిన నివేదిక ఆధారంగానే భద్రతను పెంచామని కేంద్ర హోంశాఖ వెల్లడించింది.