shape

Business ChotaNews

రేపు ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపు?

రేపు ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపు?

ఆర్‌బీఐ ద్రవ్య విధాన సమావేశం రేపు జరగనుంది. ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ సమావేశంలో కీలక వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందని అంటున్నారు. అటు హోల్‌సేల్‌, ఇటు రిటైల్‌ ధరల సూచీలు రికార్డు స్థాయిలకు చేరిన నేపథ్యంలో వడ్డీరేట్ల పెంపు ఆర్బీఐకి అనివార్యంగా మారుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

శుభవార్త.. వడ్డీ పెంపు!

శుభవార్త.. వడ్డీ పెంపు!

చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో మదుపుచేసే వారికి కేంద్రం గుడ్‌న్యూస్‌ చెప్పింది. పోస్టాఫీస్‌ టైమ్‌ డిపాజిట్‌, సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌, కిసాన్‌ క్రెడిట్‌కార్డు, కిసాన్‌ వికాస్‌ పత్ర వంటి పథకాలపై 30 బేసిస్‌ పాయింట్ల వరకు వడ్డీరేట్లను పెంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి ఈ వడ్డీ రేట్లు వర్తిస్తాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

అక్టోబరు 1 నుంచి NPSలో కొత్త మార్పు

అక్టోబరు 1 నుంచి NPSలో కొత్త మార్పు

జాతీయ పింఛన్‌ పథకం (NPS) ఈ-నామినేషన్‌కు సంబంధించి అక్టోబర్‌ 1 నుంచి కొత్త మార్పు రాబోతోంది. సబ్‌స్క్రైబర్లు ఇ-నామినేషన్‌ చేపట్టినప్పుడు నోడల్‌ ఆఫీసర్‌ దాన్ని ఆమోదించొచ్చు లేదంటే తిరస్కరించొచ్చు. అయితే, ఒకవేళ 30 రోజుల్లోగా సంబంధిత నోడల్‌ ఆఫీసర్‌ ఎలాంటి నిర్ణయమూ తీసుకోకపోతే సీఆర్‌ఏ సిస్టమ్‌లో ఆటోమేటిక్‌గా ఇ-నామినేషన్‌ ఆమోదం పొందుతుంది.

నష్టాల్లో ముగిసిన సూచీలు

నష్టాల్లో ముగిసిన సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ స్వల్ప నష్టాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 183 పాయింట్లు నష్టపోయి 56,415 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 40 పాయింట్ల నష్టంతో 16,818 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకపు విలువ రూ.81.85 వద్ద ఉంది. ఏషియన్ పెయింట్స్, టీసీఎస్, విప్రో షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

కొన్నిబ్యాంకులే ముద్దు: SBI మాజీ చీఫ్‌

కొన్నిబ్యాంకులే ముద్దు: SBI మాజీ చీఫ్‌

ప్ర‌భుత్వ బ్యాంకుల ప్రైవేటీక‌ర‌ణ‌పై SBI మాజీ చీఫ్ అరుంధ‌తీ భ‌ట్టాచార్య కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. దేశానికి కొన్ని బ‌ల‌మైన ప్ర‌భుత్వ రంగ బ్యాంకులు చాలనీ, చిన్న బ్యాంకులను ప్రైవేటీక‌రించ‌డ‌మో, విలీనం చేయ‌డ‌మో చేయాల‌ని సూచించారు. ప్ర‌భుత్వ‌రంగ బ్యాంకులను ప్రైవేటీక‌ర‌ణ చేయటానికి బదులు.. వాటిని బలోపేతం చేయటం మీద దృష్టి పెట్టాలని సూచించారు.

స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో హీరో నయా బైక్

స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో హీరో నయా బైక్

పండుగ సీజన్‌ సందర్భంగా హీరో మోటోకార్ప్ కొత్త బైక్‌ను రిలీజ్‌ చేసింది. ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ స్టీల్త్ 2.0 పేరుతో కొత్త ఎడిషన్‌ బైక్‌ను భారత మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. దీని ధర రూ. 1.29 లక్షలుగా ఉంచింది. హీరో తీసుకొచ్చిన ఈ కొత్త ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ స్టెల్త్ 2.0 బైక్‌కు స్మార్ట్‌ఫోన్ క‌నెక్టివిటీ టెక్నాల‌జీ కూడా ఉంది.

ఎయిర్‌టెల్ మైక్రో ఏటీఎంలు

ఎయిర్‌టెల్ మైక్రో ఏటీఎంలు

ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ మైక్రో ఏటీఎంలు ఏర్పాటు చేయ‌నుంది. దీని ద్వారా క‌స్ట‌మ‌ర్లు ఒక్కో లావాదేవీకి గ‌రిష్టంగా రూ. 10వేల న‌గ‌దు తీసుకోవ‌చ్చు. అన్ని బ్యాంకుల‌కు చెందిన డెబిట్ కార్డుల ద్వారా ఈ సేవ‌లు పొంద‌వ‌చ్చు. 2023 మార్చి నాటికి 1.5 ల‌క్ష‌ల మైక్రో ఏటీఎంలు అందుబాటులోకి తేనున్నట్లు సంస్థ తెలిపింది.

టయోటా కొత్త కారు.. ధర ఎంతంటే!

టయోటా కొత్త కారు.. ధర ఎంతంటే!

ప్ర‌ముఖ వాహన తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్ తన ఎస్‌యూవీ మోడల్ అర్బన్ క్రూజర్ హైరైడర్ కారును మార్కెట్లో విడుదల చేసింది. దీని ధరను రూ. 10.48 లక్షల నుంచి రూ. 18.99 లక్షల(ఎక్స్‌షోరూమ్) మధ్య నిర్ణయించినట్టు కంపెనీ ప్రకటించింది. దీనిని తమ అధికారిక వెబ్‌సైట్ నుంచి, స్థానిక డీలర్ల నుంచి కూడా బుక్ చేసుకోవచ్చని వెల్లడించింది.

‘టైమ్‌ 100 నెక్ట్స్‌’ జాబితాలో ఆకాశ్‌ అంబానీ

‘టైమ్‌ 100 నెక్ట్స్‌’ జాబితాలో ఆకాశ్‌ అంబానీ

అమెరికా న్యూస్‌ మ్యాగజైన్ టైమ్స్‌, ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలకు చెందిన 100 మంది వర్థమాన నాయకులతో రూపొందించిన జాబితాలో రిలయన్స్‌ జియో చైర్మన్‌ ఆకాశ్‌ అంబానీ (30) చోటు దక్కించుకున్నారు. ‘టైమ్‌ 100 నెక్ట్స్‌’ జాబితాలో స్థానం పొందిన భారతీయుడు ఆయన ఒక్కడే.

లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్

లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాల్లో ప్రారంభం అయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభమయ్యే సమయానికి సెన్సెక్స్‌ 511 పాయింట్ల లాభంతో 57,110 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 150 పాయింట్లు లాభపడి 17,008 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.81.61 వద్ద ట్రేడవుతోంది.

దసరా కానుకగా మోటో జీ72 రిలీజ్

దసరా కానుకగా మోటో జీ72 రిలీజ్

మోటోరోలా దసరా కానుకగా మోటో జీ72 స్మార్ట్‌ఫోన్‌ను అక్టోబర్ 3న లాంఛ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. మీడియా టెక్ హెలియో జీ99 ఎస్ఓసీ చిప్‌సెట్‌ను కలిగిన ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్‌తో పని చేస్తుంది. 108 ఎంపీ బ్యాక్, 16 ఎంపీ సెల్ఫీ కెమెరాలను దీనిలో అమర్చారు. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీతో వస్తున్న ఈ ఫోన్ ధర రూ.19,999గా ఉంది.

VI కస్టమర్లకు షాక్

VI కస్టమర్లకు షాక్

టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా భారీగా అప్పుల్లో కూరుకుపోయింది. ఆ సంస్థ ఇండస్ టవర్స్‌కు రూ.7000 కోట్లు బకాయిపడింది. ఈ బకాయిల్లో 80 శాతం వెంటనే చెల్లించాలని ఇండస్ టవర్స్ డైరెక్టర్ల బోర్డ్ వీఐకి లేఖ రాసింది. రుణాన్ని చెల్లించకపోతే నవంబర్ నాటికి టవర్ల వినియోగాన్ని నిలిపివేస్తామని హెచ్చరించింది. చెల్లింపు విషయంలో వొడాఫోన్ ఐడియా విఫలమైతే మొబైల్ నెట్‌వర్క్‌ ఆగిపోనుంది.

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 509.24 పాయింట్లు నష్టపోయి 56,598.28 వద్ద ముగిసింది. నిఫ్టీ 148.80 పాయింట్ల నష్టంతో 16,858.60 దగ్గర స్థిరపడింది. భారతీ ఎయిర్‌టెల్‌, ఎంఅండ్‌ఎం, పవర్‌గ్రిడ్‌, నెస్లే ఇండియా, డాక్టర్‌ రెడ్డీస్‌, ఏషియన్‌ పేయింట్స్‌ షేర్లు లాభపడగా.. యాక్సిస్‌ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, కోటక్‌ మహీంద్రా బ్యాంకు, హెచ్‌సీఎల్‌, విప్రో, ఐటీసీ షేర్లు నష్టపోయాయి.

టాటా టియాగో ఈవీ లాంఛ్

టాటా టియాగో ఈవీ లాంఛ్

టాటా మోటార్స్ టియాగో ఈవీని ఎట్టకేలకు మార్కెట్లో రిలీజ్ చేసింది. XE,XT,XZ+,XZ+టెక్ అనే నాలుగు ట్రిమ్‌లలో ఈ కారును తీసుకొచ్చింది. అక్టోబర్ 1 నుంచి ఈ కారును అడ్వాన్స్ బుక్ చేసుకోవచ్చని టాటా మోటార్స్ తెలిపింది. వచ్చే ఏడాది జనవరి నుంచి కారు డెలివరీలు చేస్తామని వెల్లడించింది. కారును బుక్ చేసుకున్న మొదటి 10 వేల మందికి రూ.8.49 లక్షలకు అందించనున్నట్లు చెప్పింది.

డాలర్‌ పెరుగుదల.. ప్రపంచానికి ముచ్చెమటలు!

డాలర్‌ పెరుగుదల.. ప్రపంచానికి ముచ్చెమటలు!

డాలర్‌ ఎన్నడూ లేని విధంగా బలపడుతోంది. ఆర్థికవేత్తలు డాలర్‌ పెరుగుదలను ‘డాలర్‌ స్మైల్‌’ థియరీతో అన్వయించి చూస్తున్నారు. దీని ప్రకారం అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నప్పుడు, అత్యంత బలహీనంగా ఉన్నప్పుడు, ప్రపంచ వృద్ధి మందగించినప్పుడు గానీ.. డాలర్‌ విలువ పెరుగుతుంది. ప్రస్తుతం అమెరికా 40ఏళ్లలోనే అతి తీవ్రమైన ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటోంది. డాలర్ విలువ పెరుగుదల ఆర్థిక మాంద్యానికి దారితీయోచ్చనే భయాలు ఉన్నాయి.