shape

All News ChotaNews

గాంధీలు లేని కాంగ్రెస్‌ శూన్యం: దిగ్విజయ్

గాంధీలు లేని కాంగ్రెస్‌ శూన్యం: దిగ్విజయ్

కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్న దిగ్విజయ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘చాలాసార్లు పార్టీలో చీలికలు వచ్చాయి. అయితే 99 శాతం మంది కాంగ్రెస్‌ వాదులు నెహ్రూ-గాంధీ కుటుంబీకులను సమర్థించారు. నెహ్రూ-గాంధీ కుటుంబం లేకుండా కాంగ్రెస్‌కు గుర్తింపే లేదు. రాజస్థాన్‌లో తలెత్తిన దురదృష్టకర పరిస్థితులతో అశోక్‌ గెహ్లాట్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం లేదు’’ అని తెలిపారు.

ఒక్క ఇన్‌స్టా పోస్ట్‌కు రూ. 9 కోట్లు!

ఒక్క ఇన్‌స్టా పోస్ట్‌కు రూ. 9 కోట్లు!

సోషల్ మీడియాలో టీమిండియా క్రికెటర్ కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కోహ్లీకి ఇన్‌స్టాగ్రామ్‌లో 215 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌‌లో కోహ్లీ ఏదైనా వ్యాపార ప్రచారం కోసం చేసే ఒక్కో పోస్టుకు రూ. 8.9 కోట్లు తీసుకుంటాడని Hopperhq.com సైట్ వెల్లడించింది. ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో ఒక్కో పోస్టుకు రూ. 19 కోట్లు తీసుకుంటున్నట్లు పేర్కొంది.

పాత సామన్ల పేరుతో హవాలా వ్యాపారం

పాత సామన్ల పేరుతో హవాలా వ్యాపారం

TS: హైదరాబాద్‌లో రూ. 1.24 కోట్ల హవాలా డబ్బును పోలీసులు పట్టుకున్నారు. మాసబ్‌ట్యాంక్‌ పరిధిలో షోయబ్‌ అనే వ్యక్తి వద్ద ఈ డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌‌లోని మీరట్‌‌ నుంచి షోయబ్‌ హైదరాబాద్‌ వచ్చి పాత సామాను సేకరించే వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు. బంధువు కామిల్‌ సూచన మేరకు హవాలా డబ్బు తీసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

అక్టోబర్ 15 నుంచి 5వ విడత యాత్ర

అక్టోబర్ 15 నుంచి 5వ విడత యాత్ర

TS: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రను అక్టోబర్ 15 నుంచి ప్రారంభించనున్నారు. నిర్మల్ జిల్లా బాసర అమ్మవారిని దర్శించుకుని భైంసా నుంచి కరీంనగర్‌ వరకు యాత్ర కొనసాగిస్తారు. బండి సంజయ్ ఇప్పటి వరకు నాలుగు విడతల్లో 48 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1,260 కిలోమీటర్ల మేర పాదయాత్రను పూర్తి చేశారు.

ఘనంగా 36వ జాతీయ క్రీడలు ప్రారంభం

ఘనంగా 36వ జాతీయ క్రీడలు ప్రారంభం

36వ జాతీయ క్రీడా ప్రారంభోత్సవ వేడుకలు గురువారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రధాని మోదీ టార్చ్‌ను వెలిగించి క్రీడలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, పీవీ సింధు, నీరజ్‌ చోప్రా పాల్గొన్నారు. అక్టోబర్‌ 10 వరకు జరిగే ఈ క్రీడల్లో మొత్తం ఏడువేల మంది క్రీడాకారులు పోటీపడనున్నారు. మొత్తం 36 ఈవెంట్స్‌లో పతకాల కోసం పోటీలుంటాయి.

రన్నింగ్‌లో రోబో గిన్నిస్ రికార్డ్

రన్నింగ్‌లో రోబో గిన్నిస్ రికార్డ్

అమెరికాలో ఓ రోబో రన్నింగ్ రేసులో పాల్గొని రికార్డ్ సృష్టించింది. ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీ 2017లో కాస్సీ అనే రోబోను తయారు చేసింది. తాజాగా ఈ రోబోకు బైపెడల్‌ను అమర్చడంతో 100 మీటర్ల పరుగును కేవలం 24.73 సెకన్లలోనే పూర్తి చేసి గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించుకుంది. కాగా ఈ రోబో 2021లో 5 కి.మీ దూరాన్ని కేవలం 53 నిమిషాల్లోనే చుట్టి వచ్చింది.

రేపు ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపు?

రేపు ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపు?

ఆర్‌బీఐ ద్రవ్య విధాన సమావేశం రేపు జరగనుంది. ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ సమావేశంలో కీలక వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందని అంటున్నారు. అటు హోల్‌సేల్‌, ఇటు రిటైల్‌ ధరల సూచీలు రికార్డు స్థాయిలకు చేరిన నేపథ్యంలో వడ్డీరేట్ల పెంపు ఆర్బీఐకి అనివార్యంగా మారుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

కోడి ఈకలతో కోట్లల్లో ఆదాయం

కోడి ఈకలతో కోట్లల్లో ఆదాయం

కోడి ఈకలతో కోట్లలో లాభాలు వస్తున్నాయి. రాజస్థాన్‌‌లోని జైపూర్‌కు చెందిన ముదిత, రాధేష్ అనే దంపతులు 2010లో కోడి ఈకలతో దుస్తులు తయారు చేయడం ప్రారంభించారు. మొదట వాళ్లను చూసి నవ్విన వారే.. ఇప్పుడు వాళ్ల సక్సెస్‌ చూసి షాక్ అవుతున్నారు. ప్రస్తుతం వాళ్ల వార్షిక టర్నోవర్ 2.5 కోట్లుగా ఉంది. దాదాపు 1,200 మందికి ఉపాధి కల్పిస్తున్నారు.

‘భారత్‌ ఇస్లామిక్ దేశంగా మార్చే కుట్ర’

‘భారత్‌ ఇస్లామిక్ దేశంగా మార్చే కుట్ర’

భారత్‌ను ఇస్లామిక్ దేశంగా మార్చేందుకు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కుట్రలు చేసిందని మహారాష్ట్ర యాంటి టెర్రరిజయ్ స్క్వాడ్ చీఫ్ వినీత్ అగర్వాల్ తెలిపారు. పీఎఫ్ఐ భారత్‌కు స్లో పాయిజన్ వంటిదన్నారు. దానిపై నిషేధం విధించడం మంచి నిర్ణయమని చెప్పారు. లేదంటే 2047 కల్లా దేశంలో పరిస్థితులు మరోలా ఉండేవని చెప్పారు.

హ్యాట్సాఫ్‌: ఫ్రీ అంటే ఒప్పుకోని బామ్మ!

హ్యాట్సాఫ్‌: ఫ్రీ అంటే ఒప్పుకోని బామ్మ!

తమిళనాడు ప్రభుత్వం ఆర్డినరీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించేందుకు వీలు కల్పించింది. అయితే కోయంబత్తూరులో ఓ వృద్ధురాలు మాత్రం బస్సులో ఉచిత ప్రయాణం చేయనని, తనకు టికెట్‌ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టింది. దీంతో కండక్టర్ చేసేదేమీ లేక టికెట్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ హ్యాట్సాఫ్‌ బామ్మ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

పాదయాత్రకు ఆదరణ.. పోస్టర్ల చించివేత!

పాదయాత్రకు ఆదరణ.. పోస్టర్ల చించివేత!

కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన ‘భారత్‌ జోడో పాదయాత్ర’ శుక్రవారం కర్ణాటకలోకి ప్రవేశించనుంది. ఈ నేపథ్యంలో రాహుల్‌కు ఆహ్వానం పలుకుతూ కర్ణాటకలోని చామరాజనగర్‌ జిల్లాలో ఏర్పాటు చేసిన పోస్టర్లను చించివేయడం కలకలం రేపింది. ఇది బీజేపీ సర్కార్ పనేనని కాంగ్రెస్‌ ఆరోపించింది. ‘భారత్ జోడో యాత్ర’కు వస్తున్న ఆదరణను తట్టుకోలేకే ఇలాంటి దుశ్చర్యలకు దిగుతున్నారని విమర్శించారు.

‘కేసీఆర్ కోసం ఎదురు చూస్తున్నారు’

‘కేసీఆర్ కోసం ఎదురు చూస్తున్నారు’

HYD: సీఎం కేసీఆర్‌తో మహారాష్ట్ర రాజ్యసభ మాజీ సభ్యుడు విజయ్ దర్డా ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. ఈ భేటీలో జాతీయ రాజకీయాలు, తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, ఇతర అంశాలపై చర్చించారు. సీఎం కేసీఆర్ అనతికాలంలోనే రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టి దేశానికే ఆదర్శంగా నిలిచారని విజయ్ దర్డా కొనియాడారు. కేసీఆర్ నాయకత్వం కోసం దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు.

గెహ్లాట్ వెనకడుగుపై బీజేపీ కామెంట్

గెహ్లాట్ వెనకడుగుపై బీజేపీ కామెంట్

కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి పోటీ నుంచి వెనకడుగు వేస్తున్నట్లు అశోక్‌ గెహ్లాట్ ప్రకటించడంపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. గెహ్లాట్‌ను సంపూర్ణ రాజకీయనాయకుడిగా అభివర్ణిస్తూ.. ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవడానికి ‘రబ్బరు స్టాంపు’ పదవిని వదులుకున్నారని ఎద్దేవా చేశారు. సీఎం పదవి ఆశించిన సచిన్‌పైలట్‌‌కు అధిష్ఠానం మళ్లీ ‘చెక్‌’ పెట్టిందన్నారు. వచ్చేసారి రాజస్థాన్‌లో తామే అధికారంలోకి వస్తామని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేశారు.