U20 అథ్లెట్లకి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని
20వ ఆసియా U20 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్న క్రీడాకారులను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ఈ టోర్నీలో 6 స్వర్ణాలతో సహా 19 పతకాలను భారత్ సాధించింది. దీంతో 45 దేశాలలో మూడో స్థానంలో నిలిచింది. వారి విజయంతో దేశంలో సంబరాలు జరుగుతున్నాయని, ఆ టోర్నీలో ఆడిన అథ్లెట్లు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు ప్రధాని ట్వీట్ చేశారు.