ChotaNews Quick Feeds

BREAKING: సిరీస్ మనదే

BREAKING: సిరీస్ మనదే

ఉప్పల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 187 పరుగుల లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో ఛేధించింది. సూర్యకుమార్ యాదవ్ (69), కోహ్లీ (63) పరుగులతో రాణించారు.

రాజస్థాన్ కాంగ్రెస్‌లో రాజుకున్న కుంపటి

రాజస్థాన్ కాంగ్రెస్‌లో రాజుకున్న కుంపటి

రాజస్థాన్‌లో సీఎం అశోక్ గెహ్లాట్ రాజీనామా అనంతరం తదుపరి ముఖ్యమంత్రి ఎన్నిక విషయంలో రాజకీయ సంక్షోభం దిశగా అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సచిన్ పైలట్‌ను సీఎంగా ఎన్నుకుంటే 92 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారని గెహ్లాట్ వర్గీయులు కాంగ్రెస్ అధిష్ఠానానికి తేల్చిచెప్పారు. మరోవైపు అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు ఈనెల 28న నామినేషన్ వేసేందుకు సిద్ధం అవుతున్నారు.

కేంద్రం ఆఫర్‌‌కు ముకుల్‌ రోహత్గీ నో!

కేంద్రం ఆఫర్‌‌కు ముకుల్‌ రోహత్గీ నో!

సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గి మరోసారి అటార్నీ జనరల్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నారంటూ వస్తోన్న వార్తలపై ఆయన స్పందించారు. తదుపరి ఏజీగా బాధ్యతలు చేపట్టాలంటూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్‌ని తిరస్కరించినట్టు వెల్లడించారు. ఈ నిర్ణయం వెనుక ప్రత్యేక కారణమేమీ లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఏజీగా కొనసాగుతున్న కేకే వేణుగోపాల్‌ (91) పదవీ కాలం ఈ నెల 30తో ముగియనుంది.

ఉప్పల్‌లో మరోసారి రెచ్చిపోయిన కోహ్లీ

ఉప్పల్‌లో మరోసారి రెచ్చిపోయిన కోహ్లీ

హైదరాబాద్‌ అభిమానుల్లో జోష్ పెంచుతూ కోహ్లీ ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో అర్థశతకం సాధించాడు. 37 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ఇందులో మూడు ఫోర్లు, మూడు సిక్సులు ఉన్నాయి. ఉప్పల్ స్టేడియంలో అత్యధిక పరుగులు చేసిన రికార్డ్ కోహ్లీ పేరు మీద ఉంది. గతంలో విండీస్‌పై టీ20 మ్యాచ్‌లో 94 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.