చైనా తరహాలో అభివృద్ధి: నాగేశ్వరన్
భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిపై ప్రధాన ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్ స్పందించారు. మన ఆర్థిక వ్యవస్థ కేవలం మూడు లేదా ఐదు సంవత్సరాలు కాకుండా.. చైనా తరహాలో 10 నుంచి 15 ఏళ్లపాటు వృద్ధి చెందుతూనే ఉంటుందని తెలిపారు. 1979 నుంచి 2008 వరకు చైనా వృద్ధి రేటు చాలా ఎక్కువగా ఉంది. దాని గురించి నాగేశ్వరన్ వ్యాఖ్యానించారు.