ChotaNews Quick Feeds

ఎలక్షన్స్ ఎఫెక్ట్.. ఖాళీ అవుతున్న హైదరాబాద్‌

ఎలక్షన్స్ ఎఫెక్ట్.. ఖాళీ అవుతున్న హైదరాబాద్‌

హైదరాబాద్ సహా తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డ ఆంధ్రప్రదేశ్ వాసులు సొంతూర్లకు పయనం అవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మే 13న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఏపీలో అసెంబ్లీ, లోక్‌స‌భ‌ ఎన్నికలను మొత్తం ఒకే విడతలో నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు, అంతకుముందు రెండు రోజులు వారాంతపు సెలవులు కూడా కావడంతో ఆంధ్రా ప్రజలు తమకు ఓటు హక్కు ఉన్న సొంతూర్లకు పయనం అవుతున్నారు.

ఎన్నికల ప్రచారంలో సినీ నటుడు శివాజీ

ఎన్నికల ప్రచారంలో సినీ నటుడు శివాజీ

AP: ప్రముఖ సినీ నటుడు శివాజీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తాళ్లపూడి మండలం గజ్జరంలో కూటమి అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు తరపున ప్రచారానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రసంగించారు. కూటమి అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

ప్ర‌పంచ యుద్ధంపై పుతిన్ కీలక వ్యాఖ్యలు‌

ప్ర‌పంచ యుద్ధంపై పుతిన్ కీలక వ్యాఖ్యలు‌

ప్ర‌పంచ యుద్ధాన్ని నివారించేందుకు ర‌ష్యా అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తుంద‌ని అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. విక్ట‌రీ డే మిలిట‌రీ ప‌రేడ్‌లో పాల్గొన్న ఆయ‌న దేశాన్ని ఉద్దేశించి ప్ర‌సంగించారు. త‌మ దేశం ఎటువంటి బెదిరింపుల‌ను స‌హించ‌బోద‌న్నారు. ర‌ష్యా మిలిట‌రీ అన్ని వేళ‌లా అప్ర‌మ‌త్తంగా ఉంటుంద‌ని, దేశ సార్వ‌భౌమ‌త్వాన్ని కాపాడేందుకు రెడీగా ఉన్న‌ట్లు పుతిన్ పేర్కొన్నారు.