ChotaNews Quick Feeds

తెలంగాణను కేసీఆర్ అధోగతి పాలు చేశారు: భట్టి

తెలంగాణను కేసీఆర్ అధోగతి పాలు చేశారు: భట్టి

మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణను అధోగతి పలు చేశారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. వారిచ్చిన మూడెకరాల హామీ, డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇచ్చారా అని ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని, తెలంగాణలో వచ్చే ప్రతి రూపాయి.. తిరిగి ప్రజలకే పంచేందుకు ఈప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఖమ్మం ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురామిరెడ్డిని భారీ మెజార్జీతో గెలిపించాలని కోరారు.

మైనార్టీలకు అండగా ఉంటాం: పవన్‌ కల్యాణ్‌

మైనార్టీలకు అండగా ఉంటాం: పవన్‌ కల్యాణ్‌

మైనార్టీల అభ్యున్నతికి కూటమి మ్యానిఫెస్టో తోడ్పడుతుందని, వారికి అండగా ఉంటామని జనసేనాని పవన్‌ కల్యాణ్ భరోసా ఇచ్చారు. విజయవాడలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ..వైసీపీ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందని ప్రశ్నించారు. సీఎం ఇంటికి కూత వేటు దూరంలో యువతిపై అత్యాచారం జరిగితే నిందితులను ఇంకా పట్టుకోలేదన్నారు. సీపీఎస్‌ హామీని నిలబెట్టుకోలేని జగన్‌.. ముస్లిం రిజర్వేషన్లను కాపాడుతామంటున్నారని ఎద్దేవా చేశారు.

తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో RCB ఘన విజయం

తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో RCB ఘన విజయం

పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌లో రోసో(61), శశాంక్(37), బెయిర్‌స్టో మినహా ఎవరూ రాణించలేదు. దీంతో పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 181 పరుగులకే ఆలౌట్ అయ్యింది. RCB బౌలర్లలో సిరాజ్ 3, స్వప్నిల్, ఫెర్గుసన్, కర్ణ్ శర్మ తలో 2 వికెట్లు వికెట్ తీసుకున్నారు. ఈగెలుపుతో RCB తమ ప్లేఆప్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.