ChotaNews Quick Feeds

రవీంద్ర జడేజాకు లైన్ క్లియర్.. కానీ

రవీంద్ర జడేజాకు లైన్ క్లియర్.. కానీ

టీమిండియా ఆల్​రౌండర్ రవీంద్ర జడేజా ఆసీస్​తో టెస్టు సిరీస్​లో పాల్గొనేందుకు లైన్ క్లియర్ అయింది. నాగ్​పూర్​లో ఆసీస్​తో జరిగే మొదటి టెస్టు ఆడనున్నాడు. మరోవైపు శ్రేయస్ అయ్యర్ విషయంలో మాత్రం NCA ఇంకా ఎటువంటి రిపోర్ట్ ఇవ్వలేదు. జడ్డూ చాలా రోజుల నుంచి టీమిండియా తరఫున ఆడడం లేదు. ఈ 34ఏళ్ల ఆల్​రౌండర్ చివరిసారిగా ఇండియా తరఫున 2022లో బరిలోకి దిగాడు.

ట్యాపింగ్‌పై వివరణ ఇవ్వాలి : పవన్

ట్యాపింగ్‌పై వివరణ ఇవ్వాలి : పవన్

ఏపీలో ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్‌పై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని జనసేనాని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నేరుగా సీఎం కార్యాలయంపైనే విమర్శలు చేయడంపై జగన్ స్పందించాలని కోరారు. ఆనం రాంనారాయణ రెడ్డికి ఉద్దేశపూర్వకంగానే భద్రత తగ్గించారని ఆరోపించారు. ఆయన ప్రాణానికి ముప్పు వాటిల్లితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు.

పాక్ రుణ నిర్వహణ విధానం అవాస్తవికం: IMF

పాక్ రుణ నిర్వహణ విధానం అవాస్తవికం: IMF

పాకిస్థాన్ దేశ సవరించిన రుణ నిర్వహణ సర్క్యులర్ ప్లాన్‌ను అంతర్జాతీయ ద్రవ్య నిధి(#IMF) తిరస్కరించింది. ఇది అవాస్తవికంగా ఉందని పేర్కొంది. దీనిని తప్పుడు అంచనాల ఆధారంగా రూపొందించారని తెలిపింది. ‘‘2023ఆర్థికసంవత్సరానికి విద్యుత్‌కు ఇచ్చే అదనపు సబ్సిడీని PKR335 బిలియన్ల వద్ద పరిమితం చేయడానికి విద్యుత్ టారిఫ్‌ను 11-12.50/యూనిట్ పరిధిలో పెంచండి’’ అని ఐఎంఎఫ్.. పాక్ ప్రభుత్వానికి కోరింది.