ChotaNews Quick Feeds

రవీంద్ర జడేజాకు లైన్ క్లియర్.. కానీ

రవీంద్ర జడేజాకు లైన్ క్లియర్.. కానీ

టీమిండియా ఆల్​రౌండర్ రవీంద్ర జడేజా ఆసీస్​తో టెస్టు సిరీస్​లో పాల్గొనేందుకు లైన్ క్లియర్ అయింది. నాగ్​పూర్​లో ఆసీస్​తో జరిగే మొదటి టెస్టు ఆడనున్నాడు. మరోవైపు శ్రేయస్ అయ్యర్ విషయంలో మాత్రం NCA ఇంకా ఎటువంటి రిపోర్ట్ ఇవ్వలేదు. జడ్డూ చాలా రోజుల నుంచి టీమిండియా తరఫున ఆడడం లేదు. ఈ 34ఏళ్ల ఆల్​రౌండర్ చివరిసారిగా ఇండియా తరఫున 2022లో బరిలోకి దిగాడు.

'కేసీఆర్‌కు గుణపాఠం తప్పదు'

'కేసీఆర్‌కు గుణపాఠం తప్పదు'

రాజన్నసిరిసిల్ల: రాష్ట్రప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిందని, అధికార పార్టీ ఎమ్మెల్యేలు కాంట్రాక్టుల పేరుతో వేల కోట్ల రూపాయలను పక్కదారి పట్టిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుభాష్ రావు, జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ ఆరోపించారు. వేములవాడ భీమేశ్వర గార్డెన్‌లో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో వారు మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు విశ్వసించరని, వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌కు గుణపాఠం తప్పదన్నారు.

ఆగ్రాలో గ్యాంగ్ రేప్

ఆగ్రాలో గ్యాంగ్ రేప్

ఆగ్రాకు చెందిన 15 సంవత్సరాల యువతిని ఆమె ప్రియుడు అమ్మేశాడు. తర్వాత ఓ మహిళ ఆమెను వేలం వేసింది. ఆ తర్వాత ఆ యువతి గ్యాంగ్​రేప్​నకు గురైంది. ఈ ఘటనతో సంబంధం ఉన్న ముగ్గురు మహిళలతో పాటుగా మొత్తం ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలు ఆ దుర్మార్గుల చెర నుంచి తప్పించుకుని ఒక మహిళ సాయంతో దగ్గర్లోని పోలీస్​ స్టేషన్​కు వెళ్లింది.