ChotaNews Quick Feeds

భారత్-ఆసీస్ టెస్టు మ్యాచ్ వీక్షించనున్న మోదీ

భారత్-ఆసీస్ టెస్టు మ్యాచ్ వీక్షించనున్న మోదీ

భారత్-ఆస్ట్రేలియా జట్లు నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ నాగ్‌పూర్ వేదికగా ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో ఆఖరి టెస్టు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌ను ప్రధాని మోదీతో పాటు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ప్రత్యక్షంగా వీక్షించనున్నట్లు సమాచారం.

జగన్‌ పేరు విని పారిపోతున్న కంపెనీలు: లోకేశ్

జగన్‌ పేరు విని పారిపోతున్న కంపెనీలు: లోకేశ్

AP: టీడీపీ యువనేత నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్రలో భాగంగా పలమనేరు క్లాక్ టవర్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగసభలో లోకేశ్ పాల్గొన్నారు. సీఎం జగన్‌ను చూసి రాష్ట్రంలో ఉన్న కంపెనీలు పక్క రాష్ట్రాలకు తరలిపోయాయన్నారు. రాష్ట్రంలో ఒక్క కొత్త కంపెనీ వచ్చిందా? ఒక్కరికైనా ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందా అని ప్రశ్నించారు. టమోటా, పట్టు రైతులకు గిట్టుబాటు ధర అందిస్తామని హామీ ఇచ్చారు.

బడ్జెట్‌తో దిగుమతులు తగ్గుతాయి: గడ్కరీ

బడ్జెట్‌తో దిగుమతులు తగ్గుతాయి: గడ్కరీ

ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌ దేశాన్ని ఆత్మనిర్బర్‌వైపు నడిపిస్తుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ‘‘బడ్జెట్.. సమాజంలోని ప్రతి వర్గానికి అభివృద్దిని చేరుస్తుంది. దేశాన్ని కొత్తతరం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో సన్నద్ధం చేస్తుంది. దిగుమతులను తగ్గిస్తుంది. దేశ ఇంధన రంగాన్ని బలోపేతం చేస్తుంది’’ అని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ ప్రయత్నాలు దేశ ప్రజలకు మెరుగైన జీవనాన్ని అందిస్తాయని ఆయన పేర్కొన్నారు.