ChotaNews Quick Feeds

శాంసంగ్‌ S23 సిరీస్ ధరలు ఇలా!

శాంసంగ్‌ S23 సిరీస్ ధరలు ఇలా!

శాంసంగ్ తాజాగా తన ఎస్23 సిరీస్ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లు విడుదల చేసింది. వీటి ధరలు వరుసగా.. ‘గెలాక్సీ S23’ 8జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ.74,999గా, 8జీబీ+256జీబీ ధర రూ.79,999గా నిర్ణయించారు. ‘గెలాక్సీ S23+’ మోడల్‌ 8జీబీ+256జీబీ ధర రూ.94,999గా, 8జీబీ+512జీబీ ధర రూ.1,04,999గా నిర్ణయించింది. అలాగే ‘గెలాక్సీ S23అల్ట్రా’ 12జీబీ +256జీబీ ధర రూ.1,24,999గా, 12జీబీ+512జీబీను రూ.1,34,999గా, 12జీబీ+1టీబీను రూ.1,54,999గా నిర్ణయించింది.

అది అందరూ నేర్చుకోవాలి: తమిళిసై

అది అందరూ నేర్చుకోవాలి: తమిళిసై

TS: ప్రతి ఒక్కరు సీపీఆర్ (కార్డియోపల్మనరీ రీససిటేషన్‌) నేర్చుకోవాలని గవర్నర్ తమిళిసై అన్నారు. రాజ్ భవన్ కమ్యూనిటీ హాల్‌లో గాంధీ మెడికల్ కాలేజ్‌కు చెందిన వైద్యులతో సీపీఆర్‌పై అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. సామాన్య ప్రజలకు సీపీఆర్ తెలియాలనే ఉద్దేశంతోనే ఈ ట్రైనింగ్ ఇస్తున్నామని తెలిపారు. సీపీఆర్ లైఫ్ సేవింగ్ ప్రోగ్రాం అని..టీవీల్లో చూసైనా నేర్చుకోవాలని సూచించారు.

రవీంద్ర జడేజాకు లైన్ క్లియర్.. కానీ

రవీంద్ర జడేజాకు లైన్ క్లియర్.. కానీ

టీమిండియా ఆల్​రౌండర్ రవీంద్ర జడేజా ఆసీస్​తో టెస్టు సిరీస్​లో పాల్గొనేందుకు లైన్ క్లియర్ అయింది. నాగ్​పూర్​లో ఆసీస్​తో జరిగే మొదటి టెస్టు ఆడనున్నాడు. మరోవైపు శ్రేయస్ అయ్యర్ విషయంలో మాత్రం NCA ఇంకా ఎటువంటి రిపోర్ట్ ఇవ్వలేదు. జడ్డూ చాలా రోజుల నుంచి టీమిండియా తరఫున ఆడడం లేదు. ఈ 34ఏళ్ల ఆల్​రౌండర్ చివరిసారిగా ఇండియా తరఫున 2022లో బరిలోకి దిగాడు.