ChotaNews Quick Feeds

రాజస్థాన్ కాంగ్రెస్‌లో రాజుకున్న కుంపటి

రాజస్థాన్ కాంగ్రెస్‌లో రాజుకున్న కుంపటి

రాజస్థాన్‌లో సీఎం అశోక్ గెహ్లాట్ రాజీనామా అనంతరం తదుపరి ముఖ్యమంత్రి ఎన్నిక విషయంలో రాజకీయ సంక్షోభం దిశగా అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సచిన్ పైలట్‌ను సీఎంగా ఎన్నుకుంటే 92 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారని గెహ్లాట్ వర్గీయులు కాంగ్రెస్ అధిష్ఠానానికి తేల్చిచెప్పారు. మరోవైపు అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు ఈనెల 28న నామినేషన్ వేసేందుకు సిద్ధం అవుతున్నారు.

ఉప్పల్‌లో మరోసారి రెచ్చిపోయిన కోహ్లీ

ఉప్పల్‌లో మరోసారి రెచ్చిపోయిన కోహ్లీ

హైదరాబాద్‌ అభిమానుల్లో జోష్ పెంచుతూ కోహ్లీ ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో అర్థశతకం సాధించాడు. 37 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ఇందులో మూడు ఫోర్లు, మూడు సిక్సులు ఉన్నాయి. ఉప్పల్ స్టేడియంలో అత్యధిక పరుగులు చేసిన రికార్డ్ కోహ్లీ పేరు మీద ఉంది. గతంలో విండీస్‌పై టీ20 మ్యాచ్‌లో 94 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

సూర్య అదుర్స్

సూర్య అదుర్స్

ఉప్పల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ చెలరేగిపోయాడు. 36 బంతుల్లో 69 పరుగులు చేశాడు. సూర్య ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లు, ఐదు సిక్సులు ఉన్నాయి. 14 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోర్ 134/4.

రేపటి నుంచి శరన్నవరాత్రులు

రేపటి నుంచి శరన్నవరాత్రులు

AP: బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ శరన్నవరాత్రి మహోత్సవాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. అమ్మవారిని 10రోజుల్లో వివిధ అవతారాల్లో అలంకరిస్తారు. తొలిరోజున అమ్మవారు శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి అవతారంలో దర్శనం ఇస్తారు. తొలి దర్శనం గవర్నర్ హరిచందన్‌, మంత్రి కొట్టు సత్యనారాయణ చేసుకుంటారు. తదనంతరం సాధారణ భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. మరోవైపు శ్రీశైలంలో కూడా రేపటి నుంచి దసరా మహోత్సవాలు నిర్వహించనున్నారు.