అది అందరూ నేర్చుకోవాలి: తమిళిసై
TS: ప్రతి ఒక్కరు సీపీఆర్ (కార్డియోపల్మనరీ రీససిటేషన్) నేర్చుకోవాలని గవర్నర్ తమిళిసై అన్నారు. రాజ్ భవన్ కమ్యూనిటీ హాల్లో గాంధీ మెడికల్ కాలేజ్‌కు చెందిన వైద్యులతో సీపీఆర్‌పై అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. సామాన్య ప్రజలకు సీపీఆర్ తెలియాలనే ఉద్దేశంతోనే ఈ ట్రైనింగ్ ఇస్తున్నామని తెలిపారు. సీపీఆర్ లైఫ్ సేవింగ్ ప్రోగ్రాం అని..టీవీల్లో చూసైనా నేర్చుకోవాలని సూచించారు.