ChotaNews Quick Feeds

నెల్లూరు రూరల్ YCP ఇంచార్జి ప్రకటన

నెల్లూరు రూరల్ YCP ఇంచార్జి ప్రకటన

నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి వైసీపీ కొత్త ఇంచార్జిని ప్రకటించింది. ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి సీఎం జగన్ బాధ్యతలు అప్పగించారు. ఆయనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. కాగా, ఇప్పటి వరకు ఇంచార్జిగా ఉన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్ అధిష్టానంపై దిక్కార స్వరం వినిపించడంతో ఆయన్ను బాధ్యతల నుంచి తప్పించారు.

ఈడీ చార్జిషీట్‌పై కేజ్రీవాల్ కామెంట్

ఈడీ చార్జిషీట్‌పై కేజ్రీవాల్ కామెంట్

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు రెండో చార్జిషీట్‌లో తన పేరును చేర్చడంపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఈడీ చార్జిషీట్ కల్పితమని ఆరోపించారు. ప్రభుత్వాలను కూల్చడానికే కేంద్రం ఈడీని ప్రయోగిస్తోందని అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా పని చేయాల్సిన ఈడీ అధికార పార్టీ కోసం పని చేస్తోందని మండిపడ్డారు.

వికెట్​కీపర్​ను కొట్టినంత పని చేసిన అలీ

వికెట్​కీపర్​ను కొట్టినంత పని చేసిన అలీ

క్రికెట్‌లో స్కూప్​ షాట్లు, రివర్స్ స్లాప్​ షాట్లు సహజం. వాటిని ఆడే సమయంలో ఏ మాత్రం తప్పిదం జరిగినా కీపర్​ తల పగిలిపోతుంది. ఇంగ్లండ్-సౌతాఫ్రికా మధ్య జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్ ఆల్​రౌండర్ మొయిన్ అలీ సఫారీ స్పిన్నర్ తబ్రాజ్ షంసీ బౌలింగ్​లో రివర్స్ స్లాప్​ షాట్​లో వికెట్​ కీపర్​ను కొట్టినంత పని చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.