ChotaNews Quick Feeds

‘ద్రవ్యోల్బణాన్ని అదుపు చేస్తాం’

‘ద్రవ్యోల్బణాన్ని అదుపు చేస్తాం’

ద్రవ్యోల్బణాన్ని సమర్థంగా అదుపు చేయడంలో భారత్‌ విజయం సాధిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ధీమా వ్యక్తంచేశారు. ఆహార పదార్థాల ధరల అదుపునకు సరఫరా అవరోధాలను అధిగమించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. వచ్చే ఏడాది మొదట్లో గానీ, వచ్చే ఏడాది మధ్య నాటికి ద్రవ్యోల్బణం దిగి వస్తుందని చెప్పారు. వచ్చే ఏడాదికి వృద్ధి పథంలో భారత్‌ దూసుకెళుతుందన్నారు.

ఆ వైరస్‌కి టీడీపీనే వ్యాక్సిన్: లోకేష్

ఆ వైరస్‌కి టీడీపీనే వ్యాక్సిన్: లోకేష్

AP: రాష్ట్రానికి పట్టిన 'జగనోరా' వైరస్‌ను తరిమికొట్టాలంటే టీడీపీ వ్యాక్సిన్ వేయాల్సిందేనని నారా లోకేష్ అన్నారు. వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి జగన్ గ్యాంగ్ మమ్మల్ని చంపుతామని బెదిరిస్తున్నారన్నారు. అయినా, అలాంటి బెదిరింపులకు భయపడేవారు ఎవరూ లేరని ఆయన తేల్చి చెప్పారు. ఆ హత్యతో తమకు ఎటువంటి సంబంధం లేదని ఇదివరకే తిరుపతిలో ప్రమాణం చేశానని గుర్తు చేశారు.

ముగిసిన 'లైగర్' విచారణ

ముగిసిన 'లైగర్' విచారణ

హీరో విజయ్ దేవరకొండకు లైగర్ మూవీతొ కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. లైగర్ సినిమా మనీ ల్యాండరింగ్ ఆరోపణలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈరోజు ఈడీ ఎదుట విచారణకు విజయ్ దేవరకొండ హాజరయ్యారు. 11 గంటలపాటు అతడిని ఈడీ అధికారులు ప్రశ్నించారు. లైగర్ పెట్టుబడులు ఎవరు పెట్టారు? సినిమాలో రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నారు? ట్రాన్సాక్షన్స్ ఏవిధంగా జరిగాయి? అనేదానిపై విజయ్‌ని ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

సెలవులే లేని బడి.. రోజుకు 12 గంటలు క్లాసులు!

సెలవులే లేని బడి.. రోజుకు 12 గంటలు క్లాసులు!

365 రోజుల పాటు ఒక్కరోజు సెలవు లేకుండా నడుస్తూ ఆదర్శంగా నిలుస్తోంది ఓ పాఠశాల. మహారాష్ట్రలోని హివాలి గ్రామంలో ఉన్న గవర్నమెంట్​ స్కూల్ ఉదయం 8గంటల నుంచి రాత్రి 8గంటల వరకు నడుస్తోంది. 1నుంచి 5వ తరగతి పిల్లలు ఎక్కాలను ఒకేసారి రెండు చేతులతో అవలీలగా రాసేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే స్కాలర్​షిప్​ ప్రవేశ పరీక్షల్లోను సత్తా చాటుతున్నారు ఇక్కడి విద్యార్థులు.