ChotaNews Quick Feeds

సూర్య అదుర్స్

సూర్య అదుర్స్

ఉప్పల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ చెలరేగిపోయాడు. 36 బంతుల్లో 69 పరుగులు చేశాడు. సూర్య ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లు, ఐదు సిక్సులు ఉన్నాయి. 14 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోర్ 134/4.

రేపటి నుంచి శరన్నవరాత్రులు

రేపటి నుంచి శరన్నవరాత్రులు

AP: బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ శరన్నవరాత్రి మహోత్సవాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. అమ్మవారిని 10రోజుల్లో వివిధ అవతారాల్లో అలంకరిస్తారు. తొలిరోజున అమ్మవారు శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి అవతారంలో దర్శనం ఇస్తారు. తొలి దర్శనం గవర్నర్ హరిచందన్‌, మంత్రి కొట్టు సత్యనారాయణ చేసుకుంటారు. తదనంతరం సాధారణ భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. మరోవైపు శ్రీశైలంలో కూడా రేపటి నుంచి దసరా మహోత్సవాలు నిర్వహించనున్నారు.

అఫ్ఘాన్‌కు నాటోయేతర మిత్రదేశం హోదా రద్దు

అఫ్ఘాన్‌కు నాటోయేతర మిత్రదేశం హోదా రద్దు

అఫ్ఘనిస్తాన్‌కు నాటోయేతర మిత్రదేశం హోదాను అమెరికా రద్దు చేసింది. తాలిబన్లు అఫ్ఘాన్‌ను హస్తగతం చేసుకున్న ఏడాది తర్వాత అమెరిగా ఈ నిర్ణయం తీసుకోవడం ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈమేరకు ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో అమెరికా తన నిర్ణయాన్ని ప్రకటించింది.

దూకుడు పెంచిన భారత బ్యాటర్లు

దూకుడు పెంచిన భారత బ్యాటర్లు

కీలకమైన మూడో టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా నిర్దేశించిన 187 పరుగల లక్ష్యాన్ని ఛేదించేందుకు భారత బ్యాటర్లు దూకుడు పెంచారు.10 ఓవర్లు ముగిసే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. క్రీజులో కోహ్లీ (35), సూర్యకుమార్ యాదవ్ (31) పరుగులతో ఉన్నారు.