ChotaNews Quick Feeds

మోదీ విదేశీ టూర్లపై కాంగ్రెస్ సెటైర్లు

మోదీ విదేశీ టూర్లపై కాంగ్రెస్ సెటైర్లు

ప్ర‌పంచ ప‌ర్యాట‌క దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీపై కాంగ్రెస్ పార్టీ సెటైర్లు వేసింది. ఆయన విదేశీ పర్యటనలను ప్రస్తావిస్తూ శుభాకాంక్ష‌లు తెలిపింది. ఖ‌రీదైన విమానంలో స‌ర‌దాగా, సురక్షితంగా ప్ర‌పంచం అంతా తిరిగి రండి అంటూ ట్వీట్ చేసింది. చాలా రోజులుగా ప్రధాని విదేశీ పర్యటనలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం చెబుతోంది. కాలక్షేపం కోసమే ఆయన విదేశీ టూర్లకు వెళ్తున్నారని విమర్శిస్తోంది.

విదేశీ వాణిజ్య ఒప్పందం పొడిగింపు

విదేశీ వాణిజ్య ఒప్పందం పొడిగింపు

ప్రస్తుతమున్న విదేశీ వాణిజ్య ఒప్పందాన్ని మరో ఆరు నెలల పాటు.. అంటే 2023 మార్చి వరకు పొడిగిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈనెల 30తో దీని గడువు ముగియాల్సి ఉంది. కానీ.. పరిశ్రమల సంఘాలు, ఎగుమతి ప్రోత్సాహకాల మండళ్ల నుంచి ప్రస్తుత విధానం కొనసాగింపుపై డిమాండ్లు వస్తున్నట్టు కేంద్ర వాణిజ్య శాఖ అదనపు సెక్రటరీ అమిత్‌ యాదవ్‌ తెలిపారు.

YS విజయమ్మకు జగ్గారెడ్డి సలహా ఇదే..

YS విజయమ్మకు జగ్గారెడ్డి సలహా ఇదే..

TS: షర్మిల ఎన్ని పాదయాత్రలు చేసినా జీవితంలో నాయకురాలు కాలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. షర్మిల తల్లి విజయమ్మకు తానో సలహా ఇస్తానని, షర్మిలను ముఖ్యమంత్రి చేయాలనుకుంటే జగన్‌కు నచ్చజెప్పి ఏపీ సీఎం సీటును షర్మిలకు ఇప్పించాలన్నారు. 3రాజధానులు కాదు.. 3రాష్ట్రాలు చేసుకొని తల్లీ,కొడుకు,కూతురు ముఖ్యమంత్రులు అయిపోండని వ్యాఖ్యానించారు. హామీల అమలులో కేసీఆర్ సర్కార్‌ విఫలమవుతోందని విమర్శించారు.

విజిట్ ఆంధ్రప్రదేశ్ 2023: సీఎం జగన్

విజిట్ ఆంధ్రప్రదేశ్ 2023: సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ పర్యాటక రంగానికి సంబంధించి వినూత్న నిర్ణయం తీసుకున్నారు. నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని వచ్చే ఏడాది "విజిట్ ఆంధ్రప్రదేశ్‌ 2023" గా ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభించారు. జియో పోర్టర్ ఆధారంగా పర్యాటక సమాచార వ్యవస్థను ప్రారంభించారు. అనంతరం రాష్ట్రంలోని వైవిధ్య ఉత్సవాల బ్రోచర్లను ఆవిష్కరించారు.