ChotaNews Quick Feeds

సుప్రీం విచారణలు.. ఇక  లైవ్‌లో

సుప్రీం విచారణలు.. ఇక లైవ్‌లో

సుప్రీంకోర్టులో జరిగే కేసుల విచారణను సామాన్య పౌరులూ వీక్షించవచ్చు. మంగళవారం నుంచి విచారణల లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చింది. రాజ్యాంగ ధర్మాసనం జరిపే విచారణలు యూట్యూబ్‌లో చూడవచ్చు. https://main.sci.gov.in/display-board లేదా https://webcast.gov.in/scindia/ లింకుల్లో విచారణ ప్రసారం అవుతుంది. త్వరలోనే దీని కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు.

దూకుడు పెంచిన ఎన్ఐఏ

దూకుడు పెంచిన ఎన్ఐఏ

PFI కేసు విచారణలో NIA అధికారులు దూకుడు పెంచారు. మధ్యప్రదేశ్, కర్నాటక, అస్సాం, ఢిల్లీ, మహారాష్ట్ర, తెలంగాణ,యూపీలో రెండోసారి తనిఖీలు చేపట్టారు. వందమందికి పైగా అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇప్పటివరకు 247 మందిని ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. ప్రధాని మోదీ, బీజేపీ, నాగ్‌పూర్ ఆరెస్సెస్ కార్యాలయం అగ్రనేతలపై దాడులు చేసేందుకు PFI కుట్ర పన్నినట్టుగా ఆరోపణలు వచ్చాయి.

'ఇండో-పసిఫిక్ సంబంధాలు కాపాడండి'

'ఇండో-పసిఫిక్ సంబంధాలు కాపాడండి'

ఇండో- పసిఫిక్ విషయంలో ఉభయ దేశాలూ సుస్థిరత, భద్రత, ప్రగతిపూర్వక సంబంధాలను కాపాడుకోవాలని భారత విదేశాంగ శాఖ మంత్రిం డా.ఎస్. జైశంకర్ అమెరికాకు సూచించారు. అమెరికా పర్యటనకు విచ్చేసిన జైశంకర్ కు యూఎస్ రక్షణ కార్యదర్శి లాయిడ్ జె ఆస్టిన్ పెంటగాన్ లో ఘనస్వాగతం పలికారు. పాకిస్తాన్‌తో చేసుకుంటున్న ఒప్పందాలు అమెరికన్ల ప్రయోజనాలను కాపాడలేవని ఆస్టిన్ కు జైశంకర్ ఈ సందర్భంగా తేల్చిచెప్పారు.