ChotaNews Quick Feeds

'ఇండో-పసిఫిక్ సంబంధాలు కాపాడండి'

'ఇండో-పసిఫిక్ సంబంధాలు కాపాడండి'

ఇండో- పసిఫిక్ విషయంలో ఉభయ దేశాలూ సుస్థిరత, భద్రత, ప్రగతిపూర్వక సంబంధాలను కాపాడుకోవాలని భారత విదేశాంగ శాఖ మంత్రిం డా.ఎస్. జైశంకర్ అమెరికాకు సూచించారు. అమెరికా పర్యటనకు విచ్చేసిన జైశంకర్ కు యూఎస్ రక్షణ కార్యదర్శి లాయిడ్ జె ఆస్టిన్ పెంటగాన్ లో ఘనస్వాగతం పలికారు. పాకిస్తాన్‌తో చేసుకుంటున్న ఒప్పందాలు అమెరికన్ల ప్రయోజనాలను కాపాడలేవని ఆస్టిన్ కు జైశంకర్ ఈ సందర్భంగా తేల్చిచెప్పారు.

‘దళితులపై దాడుల పథకం అమలవుతోంది’

‘దళితులపై దాడుల పథకం అమలవుతోంది’

AP: తాడిపత్రిలో టీడీపీ కౌన్సిలర్ విజయ్‌కుమార్‌పై వైసీపీ గూండాల దాడి హేయమని టీడీపీ స్టేట్ చీఫ్ అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడితే దాడులు చేస్తారా?అని ప్రశ్నించారు. రెండురోజుల క్రితం ఇదే తాడిపత్రిలో టీడీపీ కౌన్సిలర్ మల్లిఖార్జునపై దాడి జరిగిందన్నారు. దళితులపై సీఎం జగన్ కక్ష కట్టారని ఆరోపించారు. రాష్ట్రంలో దళితులపై వైఎస్సార్ దాడుల కానుక పథకం అమలవుతోందని అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

ఘనంగా షింజో అబే అంత్యక్రియలు

ఘనంగా షింజో అబే అంత్యక్రియలు

జపాన్ మాజీ ప్రధాని షింజో అబే అంత్యక్రియలు ఘనంగా జరిగాయి. ప్రధాని మోదీ సహా వివిధ దేశాలకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. టోక్యోలోని బుడోకాన్ హాల్‌లోకి ఆయన భార్య అకీ చితాభస్మాన్నితీసుకు వచ్చారు. ఈ సందర్భంగా 19 తుపాకులతో గాల్లోకి కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించారు. నివాళ్లు అర్పించేందుకు వచ్చిన ప్రముఖులంతా నల్లటి కిమో ధరించారు.