ChotaNews Quick Feeds

సచివాలయం వద్ద హైడ్రామా!

సచివాలయం వద్ద హైడ్రామా!

తెలంగాణ నూతన సచివాలయంలో అగ్ని ప్రమాదంపై హైడ్రామా కొనసాగుతోంది. అది కేవలం మాక్ డ్రిల్ అంటూ అధికారులు చెబుతున్నారు. అయితే మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాత్రం స్వల్ప ప్రమాదమని వ్యాఖ్యానించారు. మరోవైపు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న కాంగ్రెస్ నేతలు సచివాలయం వైపు బయల్దేరారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. సచివాలయం నిర్మాణంలో ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు.

అయ్యో పాపం.. అదానీ!

అయ్యో పాపం.. అదానీ!

ప్రపంచ కుబేరుల్లో మూడో స్థానంలో ఉన్న అదానీ ఏకంగా 21వ స్థానానికి పడిపోయాడు. ప్రస్తుతం 61.3 బిలియన్ డాలర్ల సంపదతో 21వ స్థానంలో కొనసాగుతున్నాడు. హిండెన్ బర్గ్ నివేదిక ఎఫెక్ట్‌తో అదానీ గ్రూపు‌నకు చెందిన అన్ని కంపెనీల షేర్లు పతనమవుతున్నాయి. ప్రపంచ విపణిలో జెట్ స్పీడ్‌తో దూసుకెళ్లి.. అంతే వేగంగా రోజురోజుకీ పతనం అవుతుండటంతో మార్కెట్ దిగ్గజాలు అవాక్కవుతున్నాయి.