ChotaNews Quick Feeds

జర్మనీకి ఆర్థికమాంద్యం ఎఫెక్ట్

జర్మనీకి ఆర్థికమాంద్యం ఎఫెక్ట్

యూరప్‌లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న జర్మనీని ఆర్థికమాంద్యం భయాలు వెంటాడుతున్నాయి. అక్కడి వ్యాపార వృద్ధి సూచీ సెప్టెంబర్‌లో 84 శాతానికి పడిపోయింది. ఆగస్టులో ఇది 88.5 శాతం ఉండగా ఈ నెలలో 2008 నాటి ప్రపంచ ఆర్థికమాంద్యం స్థాయికి కుంగిపోయింది. పారిశ్రామిక ఉత్పత్తులకు డిమాండ్ లేక కంపెనీలు భారీగా నష్టపోతున్నాయి. ఇది యూరప్ అంతా విస్తరించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

కోహ్లీని దాటేసిన రోహిత్ శ‌ర్మ‌

కోహ్లీని దాటేసిన రోహిత్ శ‌ర్మ‌

ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్ కైవ‌సం చేసుకోవ‌డం ద్వారా టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ మ‌రో రికార్డును అందుకున్నాడు. ధోనీ (42 విజ‌యాలు) త‌ర్వాత టీ20ల్లో ఎక్కువ విజ‌యాలు సాధించిన కెప్టెన్‌గా రోహిత్ నిలిచాడు. ఈ క్ర‌మంలోనే కోహ్లీ (32 విజ‌యాలు)ని దాటేశాడు. రోహిత్ శ‌ర్మ కెప్టెన్సీలో టీమిండియా 33 టీ20ల్లో విజ‌యం సాధించింది. ఇక‌పోతే టీ20ల్లో రోహిత్ శ‌ర్మ విన్నింగ్ 78.57శాతంగా ఉంది.

సూర్యపై పాక్ మాజీ క్రికెట‌ర్ ప్ర‌శంస‌లు

సూర్యపై పాక్ మాజీ క్రికెట‌ర్ ప్ర‌శంస‌లు

టీ20ల్లో అద్భుత‌మైన ఫామ్‌లో ఉన్న టీమిండియా బ్యాట‌ర్ సూర్య‌కుమార్ యాద‌వ్‌పై పాక్ మాజీ క్రికెట‌ర్ డానిష్ క‌నేరియా ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించాడు. ‘‘ప్రపంచ అత్యుత్తమ బ్యాటర్లలో సూర్యకుమార్ ఒకడు. కోహ్లీ, బాబర్ ఆజాం వంటి స్టార్ క్రికెటర్లను అధిగమిస్తాడు. సూర్య క్రీజులో ఉంటే ప్రత్యర్థి బౌలర్లలో వణుకు పుడుతుంది. అతని స్టైల్ ఇతర బ్యాటింగ్ దిగ్గజాలందర్నీ మర్చిపోయేలా చేస్తుంది’’ అని అన్నాడు.

భక్తులకు టీటీడీ కీలక సూచన

భక్తులకు టీటీడీ కీలక సూచన

బ్రహ్మోత్సవాల్లో పాల్గొనే భక్తులకు టీటీడీ కీలక సూచన చేసింది. స్వామివారికి మాడ వీధుల్లో వాహనసేవలు నిర్వహించే సమయంలో నాణేలు, వస్తువులు విసరవద్దని ఈవో ధర్మారెడ్డి కోరారు. దీని వల్ల అర్చకులు, వాహనదారులకు ఇబ్బంది కలుగుతుందన్నారు. ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని సూచించారు. తిరుమలలో ప్లాస్టిక్ నిషేధించినందున గాజులు లేదా స్టీల్ వాటర్ బాటిళ్లను మాత్రమే వెంట తెచ్చుకోవాలని చెప్పారు.