ChotaNews Quick Feeds

మార్చిలోనే ఏపీ బడ్జెట్ సమావేశాలు

మార్చిలోనే ఏపీ బడ్జెట్ సమావేశాలు

మార్చి 2వ వారంలోనే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించేందుకు రాష్ట్రప్రభుత్వం అన్నీ తయారు చేసుకుంటున్నట్లు సమాచారం. మార్చి 3,4 తేదీల్లో జరిగే గ్లోబల్ సమ్మిట్​ తర్వాతే బడ్జెట్ సమావేశాలు ఉండనున్నట్లు వినికిడి.

భారీగా గ్రూప్4 దరఖాస్తులు

భారీగా గ్రూప్4 దరఖాస్తులు

గ్రూప్ 4 పోస్టులకు దరఖాస్తు చేసుకునే నిరుదోగ్యుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. టీఎస్​పీఎస్సీ మరో 141 పోస్టులను చేర్చడంతో మొత్తం పోస్టుల సంఖ్య 8,180కి చేరుకుంది. 2018లో గ్రూప్​4 దరఖాస్తుల సంఖ్య 4.8 లక్షలు మాత్రమే. కానీ ఈ సారి ఆ సంఖ్య భారీగా పెరగడం విశేషం.

మరో రికార్డును ఖాతాలో వేసుకున్న పఠాన్

మరో రికార్డును ఖాతాలో వేసుకున్న పఠాన్

బాలీవుడ్ బాద్​షా షారూఖ్ ఖాన్ హీరోగా నటించిన పఠాన్ మూవీ కలెక్షన్ల సునామీ క్రియేట్ చేస్తుంది. రిలీజ్ అయిన వారాంతంలో అత్యధిక గ్రాస్ వసూలు చేసిన సినిమాగా పఠాన్ రికార్డు నెలకొల్పింది. ఇండియాలో రూ. 201 కోట్ల గ్రాస్, ఓవర్సీస్​లో రూ. 112 కోట్లు వసూలు చేసినట్లు యశ్ రాజ్ ఫిల్మ్స్ ప్రకటించింది.