ChotaNews Quick Feeds

కోహ్లీని దాటేసిన రోహిత్ శ‌ర్మ‌

కోహ్లీని దాటేసిన రోహిత్ శ‌ర్మ‌

ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్ కైవ‌సం చేసుకోవ‌డం ద్వారా టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ మ‌రో రికార్డును అందుకున్నాడు. ధోనీ (42 విజ‌యాలు) త‌ర్వాత టీ20ల్లో ఎక్కువ విజ‌యాలు సాధించిన కెప్టెన్‌గా రోహిత్ నిలిచాడు. ఈ క్ర‌మంలోనే కోహ్లీ (32 విజ‌యాలు)ని దాటేశాడు. రోహిత్ శ‌ర్మ కెప్టెన్సీలో టీమిండియా 33 టీ20ల్లో విజ‌యం సాధించింది. ఇక‌పోతే టీ20ల్లో రోహిత్ శ‌ర్మ విన్నింగ్ 78.57శాతంగా ఉంది.

భక్తులకు టీటీడీ కీలక సూచన

భక్తులకు టీటీడీ కీలక సూచన

బ్రహ్మోత్సవాల్లో పాల్గొనే భక్తులకు టీటీడీ కీలక సూచన చేసింది. స్వామివారికి మాడ వీధుల్లో వాహనసేవలు నిర్వహించే సమయంలో నాణేలు, వస్తువులు విసరవద్దని ఈవో ధర్మారెడ్డి కోరారు. దీని వల్ల అర్చకులు, వాహనదారులకు ఇబ్బంది కలుగుతుందన్నారు. ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని సూచించారు. తిరుమలలో ప్లాస్టిక్ నిషేధించినందున గాజులు లేదా స్టీల్ వాటర్ బాటిళ్లను మాత్రమే వెంట తెచ్చుకోవాలని చెప్పారు.

మోదీ విదేశీ టూర్లపై కాంగ్రెస్ సెటైర్లు

మోదీ విదేశీ టూర్లపై కాంగ్రెస్ సెటైర్లు

ప్ర‌పంచ ప‌ర్యాట‌క దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీపై కాంగ్రెస్ పార్టీ సెటైర్లు వేసింది. ఆయన విదేశీ పర్యటనలను ప్రస్తావిస్తూ శుభాకాంక్ష‌లు తెలిపింది. ఖ‌రీదైన విమానంలో స‌ర‌దాగా, సురక్షితంగా ప్ర‌పంచం అంతా తిరిగి రండి అంటూ ట్వీట్ చేసింది. చాలా రోజులుగా ప్రధాని విదేశీ పర్యటనలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం చెబుతోంది. కాలక్షేపం కోసమే ఆయన విదేశీ టూర్లకు వెళ్తున్నారని విమర్శిస్తోంది.

జగన్.. అలా ప్రమాణం చేస్తారా?: లోకేశ్

జగన్.. అలా ప్రమాణం చేస్తారా?: లోకేశ్

AP: మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసుతో.. తనకు, తన కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని టీడీపీ నేత నారా లోకేశ్‌ ట్వీట్‌ చేశారు. ‘‘గతేడాది కలియుగ ఆరాధ్యదైవం వెంకటేశ్వరస్వామి సాక్షిగా ప్రమాణం చేశాను. బాబాయ్‌ హత్యతో సంబంధం లేదని శ్రీవారిసాక్షిగా ప్రమాణం చేసేందుకు సీఎం జగన్‌ సిద్ధమా? ప్రమాణం చేయకపోతే గొడ్డలిపోటు జగనాసుర రక్తచరిత్ర అని ఒప్పుకుంటారా?’’ అని లోకేశ్‌ ప్రశ్నించారు.