ChotaNews Quick Feeds

ఆనంపై నేదురుమల్లి ఫైర్

ఆనంపై నేదురుమల్లి ఫైర్

AP: ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డిపై వెంకటగిరి వైసిపీ ఇంఛార్జ్ నేదురుమల్లి రాంకుమార్ విమర్శలు గుప్పించారు. మున్సిపాలిటీలో కోట్ల రూపాయాల పనులన్నీ ఆనం తన అనుచరులకు, తన పీ.ఏ కోడుకుకే ఇచ్చారన్నారు. రెండు సంవత్సరాల క్రితం నుంచే ఆనం ప్రభుత్వంపై, జిల్లా అధికారులపై విమర్శలు చేయడం మొదలుపెట్టారని తెలిపారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అని గాలిమాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

తెలంగాణ దేశానికే ఆదర్శం: గవర్నర్‌

తెలంగాణ దేశానికే ఆదర్శం: గవర్నర్‌

తెలంగాణ దేశానికి ఆదర్శంగా మారిందని గవర్నర్‌ తమిళిసై అన్నారు. ఒకప్పుడు కరెంట్ కోతలతో సతమతమైన రాష్ట్రం ఇప్పుడు 24 గంటలు కరెంట్ ఇచ్చే స్థాయికి చేరిందని చెప్పారు. దేశానికే అన్నం పెట్టే స్థాయికి అభివృద్ధి చెందిందని తెలిపారు. ఎన్నో సవాళ్లను అధిగమించి బలీయమైన ఆర్థికశక్తిగా ఎదిగిందని వెల్లడించారు. రైతుబంధు పథకం ప్రపంచవ్యాప్త ప్రశంసలు అందుకుంటోందని అన్నారు.