ChotaNews Quick Feeds

6 నెలలుగా జీతాల్లేవంటూ మహిళల నిరసన

6 నెలలుగా జీతాల్లేవంటూ మహిళల నిరసన

హైదరాబాద్ : ఎల్బీ స్టేడియంలో పని చేసే ఔట్ సోర్సింగ్ సిబ్బంది నిరసనకు దిగారు. ఆరు నెలలుగా తమకు జీతాలు చెల్లించడం లేదని ఆందోళన చేపట్టారు. పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని షాట్స్ ఛాంబర్ ముందు బాధితుల బైఠాయించారు. సెక్యూరిటీ, స్వీపింగ్ సహా ఇతర సిబ్బంది అంతా కలిసి దాదాపు 200 వందల మందికి జీతాలు చెల్లించడం లేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.