ChotaNews Quick Feeds

సుప్రీం విచారణలు.. ఇక  లైవ్‌లో

సుప్రీం విచారణలు.. ఇక లైవ్‌లో

సుప్రీంకోర్టులో జరిగే కేసుల విచారణను సామాన్య పౌరులూ వీక్షించవచ్చు. మంగళవారం నుంచి విచారణల లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చింది. రాజ్యాంగ ధర్మాసనం జరిపే విచారణలు యూట్యూబ్‌లో చూడవచ్చు. https://main.sci.gov.in/display-board లేదా https://webcast.gov.in/scindia/ లింకుల్లో విచారణ ప్రసారం అవుతుంది. త్వరలోనే దీని కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు.

తాడిపత్రిలో జేసీ వర్సెస్ డీఎస్పీ

తాడిపత్రిలో జేసీ వర్సెస్ డీఎస్పీ

అనంతపురం: తాడిపత్రిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ కౌన్సిలర్లపై దాడి విషయంలో డీఎస్పీ చైతన్య తీరుపై మున్సిపల్ చైర్‌పర్సన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి మండిపడ్డారు. పోలీసుల తీరును నిరసిస్తూ పట్టణంలో మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు మౌన ప్రదర్శన చేపట్టి, స్టేషన్ ముందు బైఠాయించారు. సేవ్ తాడిపత్రి, డీఎస్పీ డౌన్‌డౌన్ అంటూ నినదించారు. టీడీపీ శ్రేణుల నిరసనను అడ్డుకున్న పోలీసులతో జేసీ ప్రభాకర్‌రెడ్డి వాగ్వాదానికి దిగారు.

దూకుడు పెంచిన ఎన్ఐఏ

దూకుడు పెంచిన ఎన్ఐఏ

PFI కేసు విచారణలో NIA అధికారులు దూకుడు పెంచారు. మధ్యప్రదేశ్, కర్నాటక, అస్సాం, ఢిల్లీ, మహారాష్ట్ర, తెలంగాణ,యూపీలో రెండోసారి తనిఖీలు చేపట్టారు. వందమందికి పైగా అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇప్పటివరకు 247 మందిని ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. ప్రధాని మోదీ, బీజేపీ, నాగ్‌పూర్ ఆరెస్సెస్ కార్యాలయం అగ్రనేతలపై దాడులు చేసేందుకు PFI కుట్ర పన్నినట్టుగా ఆరోపణలు వచ్చాయి.