ChotaNews Quick Feeds

విదేశీ వాణిజ్య ఒప్పందం పొడిగింపు

విదేశీ వాణిజ్య ఒప్పందం పొడిగింపు

ప్రస్తుతమున్న విదేశీ వాణిజ్య ఒప్పందాన్ని మరో ఆరు నెలల పాటు.. అంటే 2023 మార్చి వరకు పొడిగిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈనెల 30తో దీని గడువు ముగియాల్సి ఉంది. కానీ.. పరిశ్రమల సంఘాలు, ఎగుమతి ప్రోత్సాహకాల మండళ్ల నుంచి ప్రస్తుత విధానం కొనసాగింపుపై డిమాండ్లు వస్తున్నట్టు కేంద్ర వాణిజ్య శాఖ అదనపు సెక్రటరీ అమిత్‌ యాదవ్‌ తెలిపారు.

YS విజయమ్మకు జగ్గారెడ్డి సలహా ఇదే..

YS విజయమ్మకు జగ్గారెడ్డి సలహా ఇదే..

TS: షర్మిల ఎన్ని పాదయాత్రలు చేసినా జీవితంలో నాయకురాలు కాలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. షర్మిల తల్లి విజయమ్మకు తానో సలహా ఇస్తానని, షర్మిలను ముఖ్యమంత్రి చేయాలనుకుంటే జగన్‌కు నచ్చజెప్పి ఏపీ సీఎం సీటును షర్మిలకు ఇప్పించాలన్నారు. 3రాజధానులు కాదు.. 3రాష్ట్రాలు చేసుకొని తల్లీ,కొడుకు,కూతురు ముఖ్యమంత్రులు అయిపోండని వ్యాఖ్యానించారు. హామీల అమలులో కేసీఆర్ సర్కార్‌ విఫలమవుతోందని విమర్శించారు.

స్వ‌లింగ సంప‌ర్కులు పెళ్లి చేసుకోవచ్చు!

స్వ‌లింగ సంప‌ర్కులు పెళ్లి చేసుకోవచ్చు!

క్యూబాలో కొత్త ఫ్యామిలీ చ‌ట్టానికి ఆమోద‌ముద్ర ప‌డింది. స్వ‌లింగ సంప‌ర్కులు వివాహం చేసుకునే వీలును క‌ల్పిస్తూ కొత్త చ‌ట్టాన్ని రూపొందించారు. పిల్ల‌ల్ని ద‌త్త‌త తీసుకునే అవ‌కాశాన్ని ఆ జంట‌ల‌కు క‌ల్పించారు. రెఫ‌రెండం నిర్వ‌హించి ఆ చ‌ట్టానికి ఓకే చెప్పారు. ప్ర‌జాభిప్రాయాన్ని 66.9శాతం ఓట్ల‌తో ఆమోద‌ముద్ర వేసిన‌ట్లు జాతీయ ఎన్నిక‌ల మండ‌లి తెలిపింది.