పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా
పార్లమెంటులో బడ్జెట్ సెషన్ ప్రారంభమైన కాసేపటికే ఉభయ సభలు ఈరోజు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. ఈ సెషన్లో అదానీ గ్రూప్ సమస్యపై చర్చలు జరగాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు వరుసగా వాయిదా నోటీసులను ప్రవేశపెట్టాయి. ఈ నేపథ్యంలో లోక్‌సభను మధ్యాహ్నం 2గంటల వరకు , రాజ్యసభను 2:30గంటలకు వరకు వాయిదా వేశారు.