సర్కారుపై దాడికి విపక్షాలు రెడీ
TS : అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రజా సమస్యలపై గళమెత్తేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్, BJP, MIMలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నాయి. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించేందుకు, ప్రభుత్వం నుంచి పరిష్కారాలు రాబట్టేందుకు వ్యూహ, ప్రతివ్యూహాలతో విపక్షాలు రెడీ అయ్యాయి. ఎన్నికల హామీల అమలు, నిరుద్యోగం, ధరణి, ధరల పెరుగుదల సహా వివిధ అంశాలను ప్రస్తావించేందుకు ఆ యా పార్టీల నేతలు సన్నద్ధమవుతున్నారు.