ChotaNews Quick Feeds

జనసేనతో పొత్తుపై సోము సంచలన వ్యాఖ్య

జనసేనతో పొత్తుపై సోము సంచలన వ్యాఖ్య

జనసేనతో పొత్తులపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పొత్తు జనంతోనేనని చెప్పారు. కలిసి వస్తామంటే జనసేనతో ఉంటామని తెలిపారు. టీడీపీ, వైసీపీ రెండూ కుటుంబ పార్టీలేనని విమర్శించారు. దీంతో ఆయన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. దీనిపై జనసేన ఏ విధంగా స్పందిస్తుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

గవర్నర్ తమిళిసై ప్రసంగం.. ఎలా సాగిందంటే?

గవర్నర్ తమిళిసై ప్రసంగం.. ఎలా సాగిందంటే?

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్-2023 సమావేశాల్లో గవర్నర్ తమిళిసై ప్రసంగం ప్రశాంతంగా ముగిసింది. ఎటువంటి ఘర్షణలు, వాదనలు, విభేదాలు లేకుండా.. ప్రభుత్వం అందించిన ప్రసంగ కాపీని ఆమె చదివి వినిపించారు. ప్రసంగంలో కేంద్రంపై విమర్శల జోలికి వెళ్లకపోవడం గమనార్హం. దాదాపు రెండేళ్ల తర్వాత గవర్నర్ అసెంబ్లీలో ప్రసంగించడంపై.. ఏం జరుగుతుందోనన్న రాజకీయ నేతల, ప్రజల ఉత్కంఠకు నేటి పరిణామాలతో తెరపడింది.