అసెంబ్లీకి బయల్దేరిన బీజేపీ ఎమ్మెల్యేలు
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్-2023 సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యేల రఘునందన్‌రావు, రాజాసింగ్, ఈటల రాజేందర్లు అసెంబ్లీకి బయల్దేరి వెళ్లారు. సమావేశాల్లో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని వారన్నారు. అక్రమ కేసులు, నిరుద్యోగం, రైతుల సమస్యలను ప్రస్తావిస్తామని చెప్పారు. 2022 బడ్జెట్ సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.