ChotaNews Quick Feeds

స్వ‌లింగ సంప‌ర్కులు పెళ్లి చేసుకోవచ్చు!

స్వ‌లింగ సంప‌ర్కులు పెళ్లి చేసుకోవచ్చు!

క్యూబాలో కొత్త ఫ్యామిలీ చ‌ట్టానికి ఆమోద‌ముద్ర ప‌డింది. స్వ‌లింగ సంప‌ర్కులు వివాహం చేసుకునే వీలును క‌ల్పిస్తూ కొత్త చ‌ట్టాన్ని రూపొందించారు. పిల్ల‌ల్ని ద‌త్త‌త తీసుకునే అవ‌కాశాన్ని ఆ జంట‌ల‌కు క‌ల్పించారు. రెఫ‌రెండం నిర్వ‌హించి ఆ చ‌ట్టానికి ఓకే చెప్పారు. ప్ర‌జాభిప్రాయాన్ని 66.9శాతం ఓట్ల‌తో ఆమోద‌ముద్ర వేసిన‌ట్లు జాతీయ ఎన్నిక‌ల మండ‌లి తెలిపింది.

భారత్, పాక్ రెండూ ముఖ్యమే : అమెరికా

భారత్, పాక్ రెండూ ముఖ్యమే : అమెరికా

ఇటీవల పాకిస్తాన్ ఎఫ్‌-16 యుద్ధ విమానాలకు అవసరమైన కీలక పరికరాలను అమెరికా సరఫరా చేయడాన్ని సరఫరా భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ తప్పుబట్టారు. దీనిపై అమెరికా విదేశాంగ ప్రతినిధి నెడ్‌ ప్రైస్‌ స్పందించారు. భారత్ -పాక్ రెండూ తమకు ముఖ్యమేనని అన్నారు. వేర్వేరు అంశాల ఆధారంగా వేటికవే ప్రత్యేక భాగస్వాములని చెప్పారు. రెండు దేశాలతో పరస్పర అంశాల్లో కలిసి పనిచేస్తామని తెలిపారు.

ఎక్కడ కూల్చారో.. అక్కడే ఆవిష్కరించాం: కేటీఆర్

ఎక్కడ కూల్చారో.. అక్కడే ఆవిష్కరించాం: కేటీఆర్

TS: కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా మంత్రి కేటీఆర్ ఆయనకు నివాళులర్పించారు. హైదరాబాద్‌లోని జలదృశ్యం వద్ద ఆయన విగ్రహాన్ని కేటీఆర్ ఆవిష్కరించారు. అనంతరం కేటీఆర్ భావోద్వేగపూరితంగా ట్వీట్‌ చేశారు. ‘‘ఏ జలదృశ్యమైతే అవమానకరంగా భావించి అప్పటి ప్రభుత్వం కూల్చివేసిందో.. ఈరోజు అక్కడే కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్నిఆవిష్కరించాం.. తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని ఎగురవేశాం’’ అంటూ కేటీఆర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.