ChotaNews Quick Feeds

నేడే రెండో టీ20..

నేడే రెండో టీ20..

నేడే న్యూజిలాండ్​తో రెండో టీ20 జరగనుంది. మొదటి టీ20లో ఓడిపోయిన హార్దిక్ సేన నేడు గెలిచి టీ20 సిరీస్​లో పట్టు సాధించాలని చూస్తోంది. నేడు ఇండియా ఓడిపోతే న్యూజిలాండ్ 2–0 తేడాతో సిరీస్​ను కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. మరి హార్దిక్ సేన ఏం చేస్తుందో వేచి చూడాలి.

నాందేడ్​లో బీఆర్​ఎస్ సభకు ఏర్పాట్లు

నాందేడ్​లో బీఆర్​ఎస్ సభకు ఏర్పాట్లు

నాందేడ్​లో బీఆర్​ఎస్ బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు చకాచకా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగానే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నాందేడ్ జిల్లాలో పర్యటించారు. తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ రాష్ట్రాల్లో ప్రజలు తెలంగాణ మోడల్ సంక్షేమాన్ని కోరుకుంటున్నారని మంత్రి తెలిపారు.

నిఖత్ జరీన్​కు సువర్ణావకాశం

నిఖత్ జరీన్​కు సువర్ణావకాశం

NMDC బ్రాండు అంబాసిడర్​గా బాక్సింగ్ చాంపియన్, తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ వ్యవహరించనుంది. దేశ నిర్మాణంలో కీ రోల్ పోషిస్తున్న NMDC బ్రాండును ముందుకు తీసుకెళ్లేందుకు నిఖత్ జరీన్ దోహదపడుతుందని ఆశిస్తున్నట్లు సంస్థ సీఎండీ సుమిత్ దేబ్ తెలిపారు. వచ్చే ఒలంపిక్ పోటీల్లో ఇండియాకు ప్రాతినిధ్యం వహించే నిఖత్​కు అన్ని విధాలా మద్దతు ఇస్తామని ఆయన పేర్కొన్నారు.