ChotaNews Quick Feeds

ఆ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం!

ఆ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం!

మినీ రత్న కంపెనీ-సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ .. ఛత్తీస్‌గఢ్ మధ్యప్రదేశ్‌లోని కోల్ మైనింగ్ కార్యకలాపాల్లో మైనింగ్ సర్దార్, డిప్యూటీ సర్వేయర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 405 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈపోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ఈరోజు నుంచే ప్రారంభప్రక్రియ మొదలైంది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోవచ్చు. ఈపోస్టులకు చివరితేదీ 23.02.2023.

తెలంగాణ తలసరి ఆదాయం ఎంతంటే?

తెలంగాణ తలసరి ఆదాయం ఎంతంటే?

ఎనిమిదిన్నరేళ్లలో తెలంగాణ దేశం నివ్వెరపోయే అద్భుతాలు ఆవిష్కరించిందని గవర్నర్ తమిళిసై చెప్పారు. రాష్ట్ర ఆదాయం రూ.62 వేల కోట్ల నుంచి రూ.1.84 లక్షల కోట్లకు పెరిగిందన్నారు. తలసరి ఆదాయం రూ.1.24 లక్షల నుంచి రూ.3.17 లక్షలకు చేరిందని వెల్లడించారు. సాగు 20 లక్షల ఎకరాల నుంచి 73.33 లక్షల ఎకరాలకు పెరిగిందని తెలిపారు.