తెలంగాణ నూతన సెక్రటేరియట్ పరిశీలనకు వెళ్తున్న కాంగ్రెస్ బృందాన్ని పోలీసులు అడ్డుకోవడాన్ని మాజీమంత్రి షబ్బీర్అలీ ఖండించారు. సెక్రటేరియట్ కేసీఆర్ జాగీరు కాదని.. ప్రజల డబ్బుతో నిర్మించారన్నారు. హడావిడిగా పనులు నిర్వహించడంతోనే.. సచివాలయంలో అగ్నిప్రమాదం జరిగిందని.. ప్రభుత్వం మాత్రం మాక్‌డ్రిల్ అని చెప్తోందని విమర్శించారు. వాస్తు పేరిట పాతభవనాన్ని కూల్చేసి.. నాసిరకంగా కొత్త భవనాన్ని నిర్మించడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమేనని ఆయన తెలిపారు.
Posted On: February 3, 2023, 1:29 pm