ChotaNews chotanews

తెలంగాణ తలసరి ఆదాయం ఎంతంటే?

ఎనిమిదిన్నరేళ్లలో తెలంగాణ దేశం నివ్వెరపోయే అద్భుతాలు ఆవిష్కరించిందని గవర్నర్ తమిళిసై చెప్పారు. రాష్ట్ర ఆదాయం రూ.62 వేల కోట్ల నుంచి రూ.1.84 లక్షల కోట్లకు పెరిగిందన్నారు. తలసరి ఆదాయం రూ.1.24 లక్షల నుంచి రూ.3.17 లక్షలకు చేరిందని వెల్లడించారు. సాగు 20 లక్షల ఎకరాల నుంచి 73.33 లక్షల ఎకరాలకు పెరిగిందని తెలిపారు.

Posted On: February 3, 2023, 12:57 pm