లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయాలని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క డిమాండ్ చేశారు. అవినీతి పునాదులపై కేజ్రీవాల్ రాజకీయంగా ఎదిగారని విమర్శించారు. ఎంతో మంది మేధావులు, యువకుల నమ్మకాన్ని వమ్ము చేశారని మండిపడ్డారు. ఆయన క్యాప్టలిస్టుల కంటే ప్రమాదకారి అని అన్నారు.
Posted On: February 3, 2023, 12:05 pm